E-Paper
Advertisement

Top Load Washing Machines: ట్రెండ్ సెట్టింగ్ ఏఐ వాషింగ్ మిషన్లు.. వచ్చే నెలలోనే లాంచ్.. ఒకసారి బట్టలు వేశారంటే..!

Top Load Washing Machines: ట్రెండ్ సెట్టింగ్ ఏఐ వాషింగ్ మిషన్లు.. వచ్చే నెలలోనే లాంచ్.. ఒకసారి బట్టలు వేశారంటే..!

Top Load Washing Machines: సాధారణంగా వాషింగ్ మిషన్లకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. వినియోగదారుల అవసరాలు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కంపెనీలు వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాయి. మార్కెట్ లోకి కొత్త మోడల్స్ విడుదల చేస్తుంటాయి. ఈ క్రమంలోనే మార్చి చివరి నాటికి పలు కంపెనీలకు చెందిన అధునాతన టాప్ లోడ్ వాషింగ్ మిషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వాటిలో టాప్ – 5 లిస్ట్ ను ఇక్కడ అందించడం జరుగుతోంది. వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి.

Samsung Bespoke AI Top Load

శాంసంగ్ తన బిస్పోక్ సిరీస్ నుంచి అధునాతన టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ను తీసుకువస్తోంది. దీనిలోని AI Ecobubble టెక్నాలజీ.. చల్లని నీటిలో కూడా బుడగలు సృష్టించి మొండి మరకలను తొలగిస్తుంది. ఇందులో AI VRT+ ఉండటం వల్ల మిషన్ తిరుగుతున్నప్పుడు నాయిస్ ఉండదు. వైబ్రేషన్స్ సమస్య కూడా రాదు. ఇందులోని Hygiene Steam ఫీచర్.. 99.9 శాతం బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

LG Smart Inverter AI DD

ప్రముఖ కంపెనీ ఎల్జీ.. తన ఫ్రంట్ లోడ్ టెక్నాలజీ అయిన ఏఐ డీడీ (AI DD)ని టాప్ లోడ్ లోకి కూడా ప్రవేశపెట్టింది. దీనిలోని ఏఐ డైరెక్ట్ డ్రైవ్ 2.0 బట్టల బరువును బట్టి కాకుండా మెటిరియల్, సునితత్వాన్ని బట్టి తనకు తానుగా ఉతికే పద్దతిని మార్చుకుంటుంది. ఇందులోని టర్బోడ్రమ్ మురికిని వదిలించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఈ వాషర్ లోని విండ్ జెట్ డ్రై ఫీచర్.. బట్టలను ఉతికిన అనంతరం త్వరగా ఆరేలా చేస్తుంది. 80 – 90 శాతం మిషన్ లోనే ఆరిపోయేలా దోహదం చేస్తుంది.

IFB DeepClean AI Series

ఉప్పునీరు ఉండే కఠిన ప్రాంతాల్లోనూ ఈ వాషింగ్ మిషన్ సమర్థవంతంగా పనిచేయగలదు. దీనిలోని ActivMix టెక్నాలజీ డిటర్జెంట్‌ను నీటిలో పూర్తిగా కరిగేలా చేస్తుంది. Power Steam, 3D Wash System ద్వారా బట్టలను అన్ని మూలల నుంచి శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా దీనిలోని Aqua Energie ఫీచర్.. నీటిలోని కఠినత్వాన్ని తగ్గించి బట్టలు మెత్తగా, ఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది.

Whirlpool 360 BloomWash Pro

వర్ల్ పూల్ తన ఐకానిక్ బ్లూమ్ వాష్ సిరీస్ ను అత్యాధునిక సెన్సార్లతో అప్డేట్ చేసింది. దీనిలోని 6th Sense Technology బట్టల లోడ్‌ను బట్టి నీరు, డిటర్జెంట్, వాషింగ్ సమయాన్ని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇందులోని Hexa Bloom Impeller ఫీచర్ కారణంగా.. బట్టలు ఒకదానికొకటి రాసుకోకుండా శుభ్రం చేయబడతాయి. అలాగే Hot Catalytic Soak ఫీచర్.. వేడి నీటిలో బట్టలను నానబెట్టి జిడ్డు మరకలను సైతం సులభంగా తొలగించేందుకు సాయపడుతుంది.

Also Read: Vitamin C serum: స్కిన్ వైటనింగ్ Vs బ్రైటనింగ్.. విటమిన్ సి సీరమ్ మీ చర్మంపై ఎలా పనిచేస్తుంది?

Haier 5 Star Oceanus Wave

బడ్జెట్ ధరలో మంచి ప్రీమియం ఫీచర్లు ఉన్న టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ను కోరుకునేవారు దీనిని పరిశీలించవచ్చు. దీనిలోని Pillow Drum డిజైన్ వల్ల సున్నితమైన బట్టలు దెబ్బతినవు. NZP (Near Zero Pressure) టెక్నాలజీ వల్ల వాటర్ ప్రెజర్ తక్కువగా ఉండే పై అంతస్తు ఇళ్లల్లోనూ మెరుగైన పనితీరును కనబరచగలదు. Anti Bacterial Vortex Pulsator వల్ల మెషిన్ లోపల బ్యాక్టీరియా చేరకుండా పరిశుభ్రంగా ఉంటుంది.

Also Read: Trump Effect: ట్రంప్ నిర్ణయాలు ప్రభావం.. దేశం వీడుతున్న అమెరికన్లు, 1935 నాటి పరిస్థితులు రిపీట్?

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×