E-Paper
Advertisement

ది ప్యారడైజ్ వాయిదా వార్తలకు చెక్… విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

ది ప్యారడైజ్ వాయిదా వార్తలకు చెక్… విడుదలపై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
Advertisement

The Paradise Movie: నాచురల్ స్టార్ నాని (Nani)హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ (The Paradise). ఈ సినిమా కోసం నాని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది మొదట్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ భావించారు కానీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విడుదల కూడా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇకపోతే చిత్ర నిర్మాతలు ఈ సినిమాని సెప్టెంబర్ 24వ తేదీ విడుదల చేయబోతున్నారని క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

నాని సినిమా విడుదలపై క్లారిటీ..

ఇలా ఈ సినిమా విడుదల గురించి రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల పట్ల నాని అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ గురించి ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ నిర్మాతలు స్పందించకపోవడంతో అసలు ఈ సినిమా అనుకున్న విధంగా సెప్టెంబర్ 24వ తేదీ వస్తుందా? రాదా ?అంటూ అసహనం వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా విడుదల గురించి మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

సెప్టెంబర్ 24 నే ది ప్యారడైజ్…

Advertisement

చిత్ర నిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వి సినిమాస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ది ప్యారడైజ్ సినిమా విడుదల తేదీ గురించి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24వ తేదీ అనుకున్న విధంగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా తెలియజేయడంతో నాని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా మరొక 15 రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా ఈ రెండు పాటలు కూడా సోషల్ మీడియా ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. ఇటీవల సెకండ్ సింగిల్ ఏసనాగుల కట్ట అంటూ విడుదలైన పాటకు మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. నాని తల్లి పాత్రలో బాలీవుడ్ నటి సోనాలి కులకర్ణి నటించబోతున్నారు. నాని జోడిగా ఖయాదులోహర్ నటించగా స్పెషల్ సాంగ్ లో కీర్తి సురేష్ సందడి చేశారు. మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించటం విశేషం.

Also Read: రణబాలి టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్…ఈ సారి రక్తపాతమే!

Related News

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’లోకి ఎన్టీఆర్ ఎంట్రీ?

రణబాలి టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్…ఈ సారి రక్తపాతమే!

ఘనంగా చంద్రబోస్ కొడుకు పెళ్లి.. హాజరైన సెలబ్రిటీస్ వీరే!

సిగరెట్ తాగుతూ ప్రేయసితో అడ్డంగా బుక్కైన జయం రవి.. వీడియో వైరల్!

స్టార్ హీరోలతో పోటీపడుతున్న నాగ్.. నిర్మాతలకు షాక్..

క్రిస్మస్ బరిలో దాదా VS కింగ్ 100.. నందమూరి – అక్కినేని హీరో పోరు..

‘దాదా’గా విశ్వరూపం చూపించబోతున్న బాలయ్య.. విడుదల ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×