Ranabaali Teaser: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ నెలలో భారీ సినిమాలో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇలా అక్టోబర్లో విడుదల కాబోతున్న సినిమాలకు సంబంధించి వరుస అప్డేట్స్ మేకర్స్ తెలియజేస్తున్నారు. ఇక అక్టోబర్ నెలలో నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రష్మిక(Rashmika) ప్రధాన పాత్రలలో నటించిన రణబాలి (Ranabaali)సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా అక్టోబర్ నెలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభం చేయబోతున్నారు ఇందులో భాగంగానే తాజాగా చిత్ర బృందం ఈ సినిమా టీజర్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. గత కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ రణబాలి టీజర్ విడుదల కాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా టీజర్ విడుదల తేదీని ప్రకటిస్తూ ఒక చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ రక్తంతో తడిసిన కత్తి కనిపించడంతో ఈసారి విజయ్ దేవరకొండ భారీ యాక్షన్ మూవీతో రాబోతున్నారని థియేటర్లలో రక్తపాతమే అంటూ అభిమానులు భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు తాజాగా తెలియజేశారు. ఇప్పటికే టీజర్ కి సంబంధించిన పనులన్నీ పూర్తి అయ్యాయని విజయ్ దేవరకొండ కూడా టీజర్ కి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ టీజర్ రాబోతోందనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనా కాలంలో రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ఇక ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
The legend of the cursed land rises 🔥#RanabaaliTeaser out on September 9th ❤🔥#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.#NeverForget#RanabaaliOnOct16th@TheDeverakonda @iamRashmika @Rahul_Sankrityn @MythriOfficial #ArnoldVosloo @AjayAtulOnline @nirav_dop… pic.twitter.com/mYnRUFuySf
— RANABAALI (@RanabaaliFilm) September 7, 2026
ఇకపోతే ఈ సినిమా విజయ్ దేవరకొండ అటు రష్మిక అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్పాలి. రష్మిక విజయ్ దేవరకొండ ఇదివరకు గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. అయితే ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం ఆ ప్రేమ పెళ్లి వరకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ రష్మిక పెళ్లి పీటలు ఎక్కారు. పెళ్లి తర్వాత విజయ్ రష్మిక నటిస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుత కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రణబాలి పాత్రలో నటించగా రష్మిక జయమ్మ అనే పాత్రలో కనిపించబోతున్నారు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమా పట్ల భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మరి అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రణబాలి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
Also Read: నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు… కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర!