E-Paper
Advertisement

స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చా.. కానీ సక్సెస్ అంత ఈజీ కాదు!

స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చా.. కానీ సక్సెస్ అంత ఈజీ కాదు!
Advertisement

Naresh:టాలీవుడ్‌లో కొంతమంది నటులు హీరోలుగా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ అన్ని జనరేషన్స్ తో కలిసిపోతూ సరికొత్త రోల్స్ చేయడం అంత ఆషామాషీ కాదు. అలాంటి అరుదైన నటులలో చెప్పుకోవాల్సి వస్తే నవరసరాయ విజయ కృష్ణ నరేష్ మొదటి స్థానంలో ఉంటాడని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నరేష్ పలు ఆసక్తికరమైన విషయాలని ఇలా చెప్పుకొచ్చారు.

చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణం.. 

Advertisement

నరేష్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, తాను పెరిగిన వాతావరణమే తనకు సినిమాలపై ఆసక్తి పెరగడానికి ప్రధాన కారణమని వివరించారు. ఆయన చుట్టూ సినిమా ప్రపంచానికి సంబంధించిన పరిచయాలు, నటీనటుల ప్రభావం ఉండేవి. చిన్న వయసులోనే కృష్ణ, విజయనిర్మల వంటి ప్రముఖులను చూస్తూ పెరిగానని చెప్పారు.

ఆ రోజుల్లో సినిమా అనేది ఇప్పటిలా కేవలం వినోద రంగం మాత్రమే కాదని, ప్రజల్లో నటీనటుల పట్ల విపరీతమైన అభిమానం ఉండేదని తెలిపారు. చెన్నైలోని అప్పటి సినిమా వాతావరణం, మెరీనా బీచ్, అక్కడ గొప్పవారితో పరిచయాలు, తిరుపతికి వెళ్లే బస్సుల్లో కనిపించే ఫ్యాన్స్.. ఇలా ఎన్నో సంఘటనలను నరేష్ గుర్తుచేసుకున్నారు.

Advertisement

ఉదయం స్కూల్‌కు వెళ్లే సమయంలో తిరుపతి వెళ్లే బస్సులు కనిపించేవని, అందులోని అభిమానులు కృష్ణ, విజయనిర్మల వంటి నటులను చూసేందుకు ఎగబడే వారని తాను కూడా చేతులు ఊపితే వారు మళ్ళీ ఊపేవారని ఆనాటి రోజులని గుర్తు చేసుకున్నారు.

తొమ్మిదేళ్ల వయసులోనే నటుడిగా తొలి అడుగు

ఇక ఇండస్ట్రీలో తన ఎంట్రీ గురించి వివరిస్తూ సుమారు తొమ్మిదేళ్ల వయసులోనే నటించే అవకాశం వచ్చిందని, దర్శకుడు లక్ష్మీదీపక్ తనను నటిస్తావా అని అడిగినప్పుడు, తాను నటిస్తానని చెప్పినట్టు తెలిపారు. అయితే ఈ విషయం తల్లికి చెప్పకుండా ముందుగా షూటింగ్ చేసేయాలని అనుకున్నట్లు సరదాగా వివరించారు.

ఇదే ఇంటర్వ్యూలో తన చదువు గురించి మాట్లాడుతూ తనకు కొన్ని సబ్జెక్టుల్లో ఇంట్రెస్ట్ ఉండేదని, కాని మ్యాథ్స్ మరియు సైన్స్ అంటే అంతగా ఇష్టం ఉండేది కాదని నవ్వుతూ చెప్పకొచ్చారు. ముఖ్యంగా ఇంగ్లీష్, కవిత్వంలో బాగా మార్కులు వచ్చేవని చెప్పారు.

తన తల్లి మాత్రం తాను డాక్టర్ కావాలని కోరుకున్నారని, ఆసుపత్రి స్థాపించాలనే ఆలోచన కూడా ఉండేదని నరేష్ వివరించారు. అయితే తనకు రక్తం చూస్తేనే భయమని, డాక్టర్ ప్రోపెషన్ తనకి ఏ మాత్రం సూట్ కాదని చెప్పారు.

సినీ కుటుంబాల్లో పుట్టడం వల్ల 

ఇక ఈ ఇంటర్వ్యూలో నెపోటిజంపై నరేష్ మాటలాడుతూ తాను సినిమా వాతావరణంలో పెరిగానని, చిన్నప్పటి నుంచే నటీనటులను చూస్తూ పెరగడం వల్ల సినిమాలపై ఆసక్తి ఏర్పడిందని అయితే ఒక స్టార్ కిడ్ గా పుట్టినంత మాత్రాన సక్సెస్ ఫుల్ గా కెరీర్ సాగిస్తామా అంటే గ్యారంటీ ఇవ్వలేమని తన మనసులోని మాటని బయటపెట్టాడు.

బ్యాక్ గ్రౌండ్ ఉంటె మొదట్లో అవకాశాలు వస్తాయని కానీ,ఇక్కడ నిలబడాలంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాల్సిందే అంటూ నెపోటిజం పై తన అభిప్రాయాన్ని తెలిపాడు.అయితే లాయర్స్ తమ పిల్లలను లాయర్స్ గా, డాక్టర్స్ తమ పిల్లలను డాక్టర్స్ గా ఎంకరేజ్ చేస్తే తప్పు ఏమీ అనిపించదని,కానీ సినీ ఇండస్ట్రీ దగ్గరికి వస్తే మాత్రం నెపోటిజం అనే పదం ఎక్కువగా వినిపిస్తోందని వాపోయారు విజయ కృష్ణ నరేష్ .

ALSO READ :పెద్ద సినిమాలదే పెత్తనమా? చిన్న సినిమాల గోడు పట్టదా?

Tags

Related News

ఒక్కటి కాదు.. ఏకంగా 8 సినిమాలు! జంధ్యాలతో నరేష్ జర్నీమామూలుది కాదుగా !

కొత్త బంగారులోకం 2 పై వరుణ్ సందేశ్ బిగ్ అప్డేట్.. సీక్వెల్ సినిమా రాబోతోందా?

ప్లీజ్ సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు.. ప్రభుత్వాలను వేడుకున్న నిర్మాత!

పెద్ద సినిమాలదే పెత్తనమా? చిన్న సినిమాల గోడు పట్టదా?

అవును నేను పెళ్లి చేసుకుంటున్నాను.. పెళ్లి వార్తలపై తేజ సజ్జ క్లారిటీ!

గురూజీ మార్క్ కనిపించడం లేదే.. ఆదర్శ కుటుంబం విషయంలో ఏమైంది?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్… స్పెషల్ పోస్టర్ రిలీజ్!

Big Stories

Advertisement
×