E-Paper
Advertisement

గాల్లోకి ఎగిరి మరీ.. చితకొట్టేస్తున్న సరికొత్త రోబో, ఇక మన పని అయిపోయినట్లే!

గాల్లోకి ఎగిరి మరీ.. చితకొట్టేస్తున్న సరికొత్త రోబో, ఇక మన పని అయిపోయినట్లే!
Advertisement

ఏదో ఒక రోజు మనుషులను రోబోట్‌లు రిప్లేస్ చేసేస్తాయ్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఏఐ వల్ల ఐటీ, దానికి సంబంధించిన రంగాలకే నష్టం.. మనుషులు చేసే పనులకు కాదులే అని చాలామంది ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ రోబో వీడియోను చూస్తే.. ఇక ఆ మాట అనరు. ఎందుకంటే.. ఏకంగా మార్షల్ ఆర్ట్స్‌ చేస్తోంది. హీరోలా విన్యాసాలు చేస్తూ గ్లోబల్ టెక్ వరల్డ్‌ని షేక్ చేస్తోంది.

బ్యాలెన్స్ తప్పదు.. కింద పడదు

ఈ రోబో పేరు H2-X కుంగ్ ఫూ లెజెండ్ గార్డియన్. చైనాకు చెందిన ‘యూనిట్రీ’ కంపెనీ డెవలప్ చేసిన ఈ హ్యూమనాయిడ్ రోబో.. ఫిజికల్ పవర్ అండ్ ఫ్లెక్సిబిలిటీలో ఒక కొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేసింది. మామూలుగా రోబోలు బ్యాలెన్స్ తప్పితే కింద పడిపోతాయి. కానీ ఇది గాల్లోకి లేచి స్పిన్నింగ్ కిక్స్ కొట్టడం, మార్షల్ ఆర్ట్స్ తరహాలో పల్టీలు కొట్టడం సునాయాసంగా చేసేస్తోంది. చివరికి నాలుగు మీటర్ల ఎత్తు నుంచి కింద పడేసినా.. బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఏమీ కానట్లే నిలబడిపోతోంది.

దీని పవర్ చూస్తే.. మైండ్ బ్లాకే..

Advertisement

కేవలం ఫ్లెక్సిబిలిటీ మాత్రమే కాదు.. దీని పవర్ ప్రదర్శన చూస్తే ఎవరైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఒక హ్యూమన్ పంచ్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో.. అంతకంటే ఎక్కువ ఫోర్స్‌తో కార్ డోర్లను డెంట్ చేసేస్తోంది. అంతేకాదు, కారు ముందు భాగాన్ని తన చేతులతో చాలా ఈజీగా పైకి ఎత్తేస్తోంది. యూనిట్రీ కంపెనీ చెప్తున్న దాని ప్రకారం.. ఈ రోబోను మనుషులకు రక్షణగా ఉండేలా, గార్డ్ చేసేలా డిజైన్ చేశారు. ఇందులో వాడిన హై-పాజిటీవ్ ఎలక్ట్రిక్ మోటార్లు, సెన్సార్లు రోబో మూవ్‌మెంట్స్‌ను చాలా ఆక్యురేట్‌గా కంట్రోల్ చేస్తాయి. పైగా ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 8 గంటల పాటు నాన్-స్టాప్‌గా పనిచేసే ఎండ్యూరెన్స్ కెపాసిటీ దీనికి ఉంది.

సెక్యూరిటీ గార్డులుగా రోబోలు.. వాళ్ల ఉద్యోగాలు హుష్!

ప్రస్తుతం చైనా రోబోటిక్స్ రేస్‌లో చాలా ఫాస్ట్‌గా దూసుకెళ్తోంది. మనుషులు చేసే కష్టమైన పనులను, ప్రమాదకరమైన వర్క్ ఎన్విరాన్‌మెంట్‌లో రోబోలతో చేయించడమే చైనా మెయిన్ టార్గెట్. ఫ్యాక్టరీల్లో హ్యాండ్లింగ్, డేంజరస్ ఇన్స్‌పెక్షన్స్, మైనింగ్ లేదా సెక్యూరిటీ గార్డ్ రూల్స్‌లో ఈ హ్యూమనాయిడ్ రోబోలను ఫ్యూచర్‌లో డిప్లాయ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

రోబో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలను ఈ కింది వీడియోలో చూసేయండి

Advertisement

Also Read: బంగారం ధరలు మరింత కిందకి? ఇప్పుడు కొనాలా? వద్దా?

అయితే, ఇక్కడే ఒక పెద్ద వార్నింగ్ కూడా దాగి ఉంది. ఎంత టెక్నాలజీ పెరిగినా.. ఈ రేంజ్ పవర్ ఉన్న రోబోలు లాబొరేటరీ దాటి బయటకు వచ్చినప్పుడు సేఫ్టీ రిస్క్ చాలా ఎక్కువ. భారీ బరువు, అత్యంత శక్తివంతమైన ఫోర్స్‌తో మూవ్ అయ్యే ఈ రోబోలు మనుషుల మధ్య తిరిగేటప్పుడు చిన్న సాఫ్ట్‌వేర్ గ్లిచ్ వచ్చినా పెద్ద ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది.

Also Read: రూ. 20,000 లోపే బెస్ట్ మానిటర్స్.. వర్క్, గేమింగ్ వాడకం ఏదైనా.. పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మామ!

Tags

Related News

అన్నీ AI చేసేస్తోంది.. ఇక మీరెందుకు? ఈ ప్రశ్నకు ఇలా సమాధానం ఇవ్వండి

రూ. 2,500 లోపే ప్రీమియం ANC ఇయర్‌బడ్స్.. మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్-5 మోడల్స్ ఇవే!

ఫోటోలు పోయాయని బాధపడుతున్నారా? టెన్షన్ వద్దు మామ.. ఈ 7 ట్రిక్స్ మీ కోసమే!

మతిపోయే ఫీచర్లతో బెస్ట్ ఇయర్‌బడ్స్,ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!

రూ. 20,000 లోపే బెస్ట్ మానిటర్స్.. వర్క్, గేమింగ్ వాడకం ఏదైనా.. పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది మామ!

తక్కువ బడ్జెట్‌లో నెక్స్ట్ లెవెల్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్..ఈ ఛాన్స్ మిస్ అయితే కష్టమే!

ఏసీ ఉన్నోళ్లకి గుడ్ న్యూస్.. చలికాలంలో ఇలా వాడితే.. ఇల్లంతా ఫుల్ వెచ్చదనం!

Big Stories

Advertisement
×