E-Paper
Advertisement

ప్లీజ్ సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు.. ప్రభుత్వాలను వేడుకున్న నిర్మాత!

ప్లీజ్ సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దు.. ప్రభుత్వాలను వేడుకున్న నిర్మాత!
Advertisement

Dheeraj Mogilineni: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న ధీరజ్ మొగిలినేని త్వరలోనే సమ్మర్ హాలిడేస్(Summer Holidays) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నిజానికి ఈ సినిమా అక్టోబర్ 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది . ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఉన్నఫలంగా అక్టోబర్ 30వ తేదీ ఆదర్శ కుటుంబం సినిమాని విడుదల చేయబోతున్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితులలో సమ్మర్ హాలిడేస్ నవంబర్ ఆరవ తేదీకి వాయిదా పడింది.

ప్రమోషన్ చేయాలంటే అప్పులు చేయాలి..

ఈ నేపథ్యంలోనే నిర్మాత ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) మీడియా సమావేశంలో భాగంగా సినిమాలు వాయిదా పడటం గురించి అదే విధంగా సినిమా టికెట్ల రేట్లు పెంచడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ కాంబినేషన్లు సినిమా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు అందుకే మేము వారితో పోటీగా వచ్చే సాహసం చేయలేదని తెలిపారు. ఇప్పటివరకు అక్టోబర్ 30వ తేదీ సినిమా విడుదలవుతుంది అంటూ ప్రమోట్ చేయడానికి ఉన్న డబ్బులు అన్ని అయిపోయాయని, నవంబర్ 6 వ తేదీ విడుదలవుతుందని ప్రమోట్ చేయడానికి అప్పులు చేయాల్సి వస్తుందని ఈయన తెలిపారు.

ఇండస్ట్రీకి మేలు చేసిన వారు అవుతారు..

Advertisement

ఇక సినిమా టికెట్ల రేట్లు పెంచడం గురించి కూడా మాట్లాడుతూ.. దయచేసి సినిమా టికెట్ల రేట్లు మాత్రం పెంచొద్దని ఈయన ప్రభుత్వాలను వేడుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇండస్ట్రీకి ఏదైనా మంచి చేయాలి అంటే టికెట్ల రేట్లు పెంచవద్దని అదే ఇండస్ట్రీకి చేసే మేలు అని తెలిపారు. సినిమాలకు టికెట్ల రేట్లు పెంచవచ్చు కానీ ప్రతి సినిమాకు టికెట్ల రేట్లు పెంచడం వల్ల మా చిన్న సినిమాలు నష్టపోతున్నాయని తెలిపారు. థియేటర్లకు కమిషన్ వస్తుందని తద్వారా చిన్న సినిమాలు థియేటర్లలో వేయటానికి ఇష్టపడటం లేదని తెలిపారు. సినిమా టికెట్ల రేట్లు పెంచొద్దని వీటి వల్ల ఎవరికి లాభం లేదని ధీరజ్ తెలిపారు.

వెంకటేష్ సినిమాలకు థియేటర్లు దొరుకుతాయి..

ఇక పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ చెప్పడం వాయిదా పడటం గురించి కూడా ఈయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోయినా సినిమా వాయిదా పడుతుందనే నిజాలను ఎవరు చెప్పారని తెలిపారు. వెంకటేష్ సినిమాలు నాలుగు రోజుల ముందు ప్రకటించిన ఆయన సినిమాకు థియేటర్లు దొరుకుతాయి జనాలు కూడా వస్తారు కానీ మాకు అలాంటి సౌకర్యాలు ఉండవని ధీరజ్ తెలిపారు. ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు వాయిదా పడటంతో చిన్న సినిమాలకు నష్టాలు వస్తున్నాయని ఈయన ఈ సందర్భంగా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: రామాయణ సినిమాకు హాట్ స్టార్ బిగ్ షాక్.. ఇంట్లో చూడాలన్న డబ్బులు కట్టాల్సిందే?

Related News

ఒక్కటి కాదు.. ఏకంగా 8 సినిమాలు! జంధ్యాలతో నరేష్ జర్నీమామూలుది కాదుగా !

కొత్త బంగారులోకం 2 పై వరుణ్ సందేశ్ బిగ్ అప్డేట్.. సీక్వెల్ సినిమా రాబోతోందా?

స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చా.. కానీ సక్సెస్ అంత ఈజీ కాదు!

పెద్ద సినిమాలదే పెత్తనమా? చిన్న సినిమాల గోడు పట్టదా?

అవును నేను పెళ్లి చేసుకుంటున్నాను.. పెళ్లి వార్తలపై తేజ సజ్జ క్లారిటీ!

గురూజీ మార్క్ కనిపించడం లేదే.. ఆదర్శ కుటుంబం విషయంలో ఏమైంది?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్… స్పెషల్ పోస్టర్ రిలీజ్!

Big Stories

Advertisement
×