E-Paper
Advertisement

రాజకీయాల్లోకి వెళ్లి ఆస్తులన్నీ పోగొట్టుకున్నా.. నరేష్ షాకింగ్ కామెంట్స్!

రాజకీయాల్లోకి వెళ్లి ఆస్తులన్నీ పోగొట్టుకున్నా.. నరేష్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Naresh Political:టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నరేష్ తన పొలిటికల్ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలని ఇలా ఒక ఇంటర్వ్యూలో చెప్పకొచ్చారు.ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు చేసిన తాను రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. సంపాదించిన ఆస్తులు క్రమంగా కరిగిపోయాయని, డబ్బు విషయంలో తాను చేసిన కొన్ని పొరపాట్ల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడారు.

రాజకీయాల్లోకి వెళ్లాక ఆస్తులు కరిగిపోయాయి!

Advertisement

నరేష్ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెల్సిందే.అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని ఆయన చెప్పారు. రాజకీయాల్లో సంపాదించాలనే ఉద్దేశంతో తాను అడుగుపెట్టలేదని, పార్టీ కార్యక్రమాల కోసం సొంతంగా ఖర్చు పెట్టాల్సి వచ్చేదని వివరించారు.

అంతేకాదు, ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో కొన్ని వ్యాపారాలు ప్రారంభించినా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని చెప్పారు. ముఖ్యంగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వంటి వ్యాపారాలు నష్టపోవడంతో తన దగ్గరున్న ఆస్తులను అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోయారు.

Advertisement

ఇక సినిమాల్లో హీరోగా ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ, సంపాదించిన డబ్బును ఆస్తుల రూపంలో జాగ్రత్తగా నిలబెట్టుకోలేకపోయానని అంగీకరించారు. భూములు కొనడం వంటి పెట్టుబడులపై కూడా పెద్దగా దృష్టి పెట్టలేదని చెప్పారు.

చేతిలో రూ.10 వేలుంటే.. అడిగినవారికి రూ.15 వేలిచ్చేవాడిని!

ఇక డబ్బు విషయంలో తనకు మొదటి నుంచీ ఒక అలవాటు ఉండేదని నరేష్ తెలిపారు. ఎవరికైనా కష్టం వచ్చిందని, డబ్బు అవసరమని అడిగితే తన దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చేవాడినని చెప్పారు. “నా దగ్గర రూ.10 వేలు ఉంటే రూ.15 వేలు ఇచ్చేసేవాడిని” అంటూ తన పాత అలవాటును గుర్తు చేసుకున్నారు. ఇతరులకు సాయం చేయాలనే ఆలోచనతో స్థాయికి మించి డబ్బు ఖర్చు పెట్టేవాడినని వివరించారు.ఒక దశలో కెరీర్ పరంగా, ఆర్థికంగా దాదాపు జీరో స్థాయికి చేరుకున్నానని నరేష్ చెప్పారు. 1998 ప్రాంతంలో రాజకీయాల్లో యాక్టివ్ అవడంతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని గుర్తు చేసుకున్నారు.

దాదాపు 15 ఏళ్లు రాజకీయాలకే అంకితం

నరేష్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలపై దృష్టి తగ్గిందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలు, సామాజిక సేవలో పూర్తిగా నిమగ్నమయ్యానని తెలిపారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఫుల్‌టైమ్ కార్యకర్తలా పనిచేసిన రోజులు ఉన్నాయని వివరించారు.ఆ సమయంలో సినిమాల నుంచి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయిందని,అయితే దీనిపై ఎవరినీ తప్పుపట్టడం లేదని స్పష్టం చేశారు. తాను సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు ఇతరులు తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడం సహజమేనని తెలిపారు.

రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత హిందూపురం నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని కూడా నరేష్ గుర్తు చేసుకున్నారు. దాదాపు 12 నుంచి 15 ఏళ్ల పాటు రాజకీయ ప్రయాణం తన జీవితంలో ముఖ్యమైన ఫేజ్ గా నిలిచిందని చెప్పారు.

ఇంట్లో కాంగ్రెస్.. టీడీపీ నేపథ్యం.. నరేష్ మాత్రం 

తన కుటుంబంలో రాజకీయంగా వేర్వేరు పార్టీలు ఉన్నాయని కృష్ణగారికి కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉండగా, తన తల్లి కూడా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. ఆమె టీడీపీ తరఫున పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అయితే తాను మాత్రం సిద్ధాంతపరంగా ఆర్ఎస్ఎస్‌తో అనుబంధం ఏర్పరచుకున్నానని తెలిపారు. చిన్నప్పుడు మద్రాసులో పెరగడం, కాన్వెంట్‌లో చదవడం, ఆ తర్వాత హిందూ హైస్కూల్, రామకృష్ణ మిషన్ స్కూల్‌లో చదువుకోవడం తన ఆలోచనలపై ప్రభావం చూపాయని చెప్పారు.

సినిమాల్లోకి మళ్లీ వచ్చాక సెకండ్ ఇన్నింగ్స్

రాజకీయాల కోసం సినిమాలకు దూరమైన నరేష్.. తిరిగి నటనలోకి వచ్చిన తర్వాత తనకు నచ్చిన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పారు. పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా కథలో తన పాత్ర నచ్చితేనే అంగీకరిస్తానని తెలిపారు.మొత్తంగా తన పొలిటికల్ జర్నీపై నరేష్ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయిపోయాయి.

ALSO READ :బొబ్బిలి రాజా తర్వాత నా కెరీర్‌లో ఏం జరిగిందంటే.. శివాజీరాజా కామెంట్స్

Tags

Related News

వెంకీ సినిమా ట్రైలర్ వచ్చేస్తోంది.. రచ్చకు రెడీనా!

గ్లామర్ షోతో కాదు.. సింపుల్ లుక్‌తోనే మ్యాజిక్ చేసిన సాన్యా!

బొబ్బిలి రాజా తర్వాత నా కెరీర్‌లో ఏం జరిగిందంటే.. శివాజీరాజా కామెంట్స్

‘జైలర్ 2’ జోరు చూస్తుంటే.. వెయ్యి కోట్లు పక్కానా?

సన్‌ఫ్లవర్‌లా మారాలంటున్న రితికా నాయక్.. అసలు మ్యాటర్ ఏంటంటే!

ఒక్కటి కాదు.. ఏకంగా 8 సినిమాలు! జంధ్యాలతో నరేష్ జర్నీమామూలుది కాదుగా !

కొత్త బంగారులోకం 2 పై వరుణ్ సందేశ్ బిగ్ అప్డేట్.. సీక్వెల్ సినిమా రాబోతోందా?

Big Stories

Advertisement
×