E-Paper
Advertisement

కారు అద్దె బకాయి వివాదంలో దారుణం.. యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు!

కారు అద్దె బకాయి వివాదంలో దారుణం.. యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు!
Advertisement

Hyderabad Crime: అక్టోబర్ 18.. తెల్లవారుజామున సరిగ్గా రెండు గంటలు… అంతా నిద్రలో ఉన్న టైమ్.. అర్బాజ్ అనే యువకుడిని ఫర్దీన్, నేహాల్ బైక్ మీద తీసుకెళ్లారు. గమ్యం గుల్షన్ కాలనీ… సెవెన్ టూంబ్స్ వెనక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అసలు గొడవ ఏంటంటే, ఐదు నెలల కిందట అర్బాజ్ సెల్ఫ్ డ్రైవ్ కారు అద్దెకు తీసుకున్నాడు. ఆ కారు యాక్సిడెంట్‌కి గురికావడంతో రిపేర్‌కు టైమ్‌ పట్టింది. డేస్‌ పెరగడంతో కారు అద్దె బకాయి 8వేల రూపాయలకు పెరిగింది. ఈ బకాయి విషయంలోనే అర్బాజ్‌కు.. కారు యజమాని మాలిక్‌కు మధ్య గొడవ మొదలైంది.

కర్రలతో దాడి..

ఆఫీస్ క్లీన్ చేయమంటే అర్బాజ్ నో అన్నాడట. అంతే, ఆ గ్యాంగ్‌కి కోపం నషాళానికి ఎక్కింది. కర్రలతో దాడి చేశారు. పెద్ద బండరాయి ఎత్తి మీదికి వచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. అక్కడితో ఆగారా..? అంటే అసలు టార్చర్ అప్పుడే మొదలైంది. అర్బాజ్‌ను గదిలో బంధించారు. డ్రెస్ విప్పించి బలవంతంగా డ్యాన్స్ చేయించి వీడియో రికార్డ్ చేశారు. ఇక్కడితో ఆగితే వాళ్లు రౌడీలు ఎందుకవుతారు? సమీపంలోని సెలూన్‌కి లాక్కెళ్లి మరీ గుండు కొట్టించారని బాధితుడు పోలీస్‌లకు కంప్లీట్ చేశాడు. బాధితుడి కంప్లైంట్‌తో కథ మలుపు తిరిగింది. గోల్కొండ పోలీసులు 8మందిని అరెస్ట్ చేశారు. ఫర్దీన్, నేహాల్, మాలిక్, ముస్తఫా, నౌమాన్, షైబాన్, అద్నాన్… వీళ్లతో పాటు ఇబ్రహీం అలీ ఖాన్ అలియాస్ అమెర్‌ను కూడా కటకటాల వెనక్కి నెట్టేశారు.

ఎక్కడైనా SHARE చేశారా..?

Advertisement

డబ్బుల కోసం గొడవ పెట్టుకోవడం ఒక ఎత్తయితే.. అవమానించేందుకు ఈ VIDEOలు తీయడం మరో ఎత్తు.. ఇంకా దారుణం ఏంటంటే.. అర్బాజ్‌కు గుండు కొట్టించడం. 8వేలరూపాయల బకాయి కోసం మొదలైన గొడవ.. ఇంతటి దారుణానికి దారితీసింది. ఇప్పుడు పోలీసులు మరో విషయం కూడా తేల్చాలి. ఈ వీడియోలు ఎందుకు తీశారు..? వాటిని ఎక్కడైనా SHARE చేశారా..? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..? ఈ దారుణానికి FULL STOP పడిందా..? లేక ఇంకా బయటకు రావాల్సిన ట్విస్టులు ఉన్నాయా..? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Also read: సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!

Tags

Related News

సింగరేణి జోలికొస్తే ఊరుకోం.. కాంగ్రెస్, బీజేపీలకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!

కేసీఆర్ ఫామ్‌హౌస్ నీటి కథేంటి? విచారణకు ఎంపీ చామల డిమాండ్!

హైదరాబాద్‌లో 87 నిమిషాల మనీ గేమ్.. దెబ్బకు రూ. 3.34 కోట్లు స్వాహా!

ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారులు.. ఏకంగా రూ.39 లక్షలకు పైగా లంచం వసూల్!

ఈ-ముద్ర ప్రైవేట్ కీస్ లోపం అసలు ఎలా జరిగింది?.. అసలు మ్యాటర్ ఇదే?

రైతుల కష్టాలకు ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణం.. ఆర్.ఎస్ ప్రవీణ్ ఫైర్!

తెలంగాణకు భారీ పెట్టుబడుల వరద.. సీఎం రేవంత్ వ్యూహం ఇదే?

Big Stories

Advertisement
×