Sivaji Raja:టాలీవుడ్‌లో కొంతమంది నటులు హీరోలుగా సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంటే.. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తారు.అలాంటి నటుల్లో శివాజీరాజా కూడా ఒకరని చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో వెరైటీ పాత్రలు పోషించిన ఆయన.. తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలు, హీరోగా నిలదొక్కుకోవడానికి చేసిన ప్రయత్నాలు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చిన గుర్తింపు గురించి ఆసక్తికరమైన విషయాలని ఒక ఇంటర్వ్యూలో ఇలా పంచుకున్నారు.
హీరో కావాలనుకున్నారు.. కానీ
సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రాకపోయినా.. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని తన కుటుంబంలో సినిమాలకు సంబంధించిన వాళ్లు ఎవరూ లేరని, సినిమా రంగం గురించి పెద్దగా తెలిసిన నేపథ్యం కూడా లేదని ఆయన చెప్పారు. అయినప్పటికీ, ప్రయత్నిస్తూ నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాని తెలిపారుకళ్ళు’ సినిమాతో హీరోగా పరిచయమైన తాను ఆ తర్వాత హీరోగా అవకాశాల కోసం కొంతకాలం ఎదురుచూశానని అయితే వెంటనే వరుస అవకాశాలు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయారు. ఆ సమయంలో వచ్చిన పాత్రలను అంగీకరిస్తూ చేస్తూ తన జర్నీని కంటిన్యూ చేశానని తెలిపారు.
బొబ్బిలి రాజా’తో గుర్తింపు.. కానీ
వెంకటేశ్ హీరోగా నటించిన ‘బొబ్బిలి రాజా’ తన కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిందని చెప్పారు. ఈ సినిమా తర్వాత ఆయనకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఈ సక్సెస్ తో తన పాత్రకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందని అనుకోలేదని ఆయన వివరించారు.
ఆ సినిమాలో తన పాత్రను ప్రేక్షకులు గుర్తించడానికి ప్రధాన కారణం సినిమా సక్సెస్ అని , అందులోని ఇతర నటీనటుల పాత్రలు, కామెడీ సన్నివేశాలు కూడా అని తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే ఆ తర్వాత హీరోగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ, అనుకున్నంతగా సక్సెస్ కాలేవని బాధపడ్డారు.ఒక దశలో తనకు ఒకే మూస పాత్రలు ఎక్కువగా వచ్చాయని కూడా చెప్పారు. మంచివాడిలా కనిపిస్తూ, లోపల మరో ఆలోచన ఉన్న వ్యక్తుల పాత్రలు, చివర్లో మారిపోయే క్యారెక్టర్లు వంటి వాటిలో నటించాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు.
సినిమాలు తక్కువగా చూస్తారా?
సినిమా ఇండస్ట్రీలో ఉంటూ సినిమాలు తక్కువగా చూస్తారనే కామెంట్స్ పై శివాజీరాజా రియాక్ట్ అవుతూ ప్రతి సినిమాను చూడటం తనకు అలవాటు లేదని, అయితే మంచి సినిమాలను మాత్రం మిస్ కాకుండా చూస్తానని చెప్పారు. సినిమాలు చూడకపోవడంపై గతంలో తనకు ఒక సందర్భంలో పెద్ద చర్చ కూడా జరిగిందని తెలిపారు.
రవితేజ, ప్రకాష్‌రాజ్ నటించిన ‘సముద్రం’ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఈ విషయం డిస్కస్ అయిందని తెలిపారు.ఇక ప్రతి సినిమాను చూడకపోయినా, నటుడిగా తాను ఇంకా నేర్చుకుంటూనే ఉండాలని శివాజీరాజా అభిప్రాయపడ్డారు. తన కెరీర్‌లో సుమారు 500 సినిమాలు చేసి ఉంటే, వాటిలో ప్రతి పాత్ర తనకు సంతృప్తిని ఇచ్చిందని చెప్పలేనని అన్నారు.
చంద్రశేఖర్ ఏలేటిపై ప్రశంసలు
దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ప్రతిభ గురించి శివాజీరాజా మాట్లాడుతూ ఆయన స్క్రీన్‌ప్లే అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని మెచ్చుకున్నారు.ముఖ్యంగా ‘అమృతం’ సీరియల్‌తో పాటు ‘అనుకోకుండా ఒకరోజు’, ‘సాహసం’ వంటి సినిమాల్లో ఆయన వర్క్ నెక్స్ట్ లెవెల్ అని ఆకాశానికి ఎత్తేశారు.చంద్రశేఖర్ ఏలేటి చాలా పద్ధతిగా పనిచేస్తారని, తొందరపడకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తారని శివాజీరాజా చెప్పారు. ఆయన పని చేసే విధానం స్లో అండ్ స్టెడీగా ఉంటుందని వివరించారు.
అయితే దర్శకుడిగా ఆయనకు రావాల్సినంత విజయాలు ఎందుకు రాలేదనే ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆయన అందరిలా వేగంగా సినిమాలు చేసే వ్యక్తి కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతిభ విషయంలో మాత్రం ఆయనపై ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.
గుండు హనుమంతరావుతో ప్రత్యేక అనుబంధం!
‘అమృతం’ సీరియల్‌లో అంజి పాత్రతో ప్రేక్షకులను నవ్వించిన గుండు హనుమంతరావుతో శివాజీరాజాకు మంచి అనుబంధం ఉందని తెలిపారు. ఈ సీరియల్‌లో ఇద్దరూ కలిసి పనిచేయడం మాత్రమే కాదు.. వ్యక్తిగతంగానూ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని ఆయన చెప్పారు.తన మొదటి సినిమా ‘కళ్ళు’లో గుండు హనుమంతరావు కూడా నటించారని గుర్తుచేసుకున్నారు. మొదటి సినిమా నుంచి కలిసి ప్రయాణం చేసిన నటులతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుందని, ఆ బంధం చాలా కాలం కొనసాగుతుందని వివరించారు.
తన సొంత నిర్మాణంలో రూపొందించిన సీరియల్స్‌లోనూ గుండు హనుమంతరావు నటించారని చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్న పరిచయం, కంఫర్ట్ కారణంగా కలిసి పనిచేయడం ఎంతో సులభంగా ఉండేదని చెప్పుకొచ్చారు.
ALSO READ :‘జైలర్ 2’ జోరు చూస్తుంటే.. వెయ్యి కోట్లు పక్కానా?