E-Paper
Advertisement

Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?
Advertisement

Rinku Singh AI Video Controversy: టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) కంటే ముందు స్టార్ ఆటగాడు రింకు సింగ్ ( Rinku Singh) వివాదంలో చిక్కుకున్నాడు. హిందూ దేవుళ్ళపై పోస్టులు పెట్టి అడ్డంగా దొరికిపోయాడు రింకు సింగ్. దీంతో రింకు సింగ్ చిక్కులో పడ్డాడు. తన ఫేస్బుక్ అకౌంట్ లో హిందూ దేవుళ్లకు సంబంధించిన ఒక ఏఐ వీడియో పోస్ట్ ( Rinku Singh AI Video Controversy ) చేయడంతో వివాదం చోటు చేసుకుంది. అయితే ఈ వీడియోలో దేవుళ్ళ నల్ల కళ్ళజోడు పెట్టుకుని ఉండడం అభ్యంతరకరంగా ఉందని, రింకు సింగ్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో టీ20 ప్రపంచ కప్ కంటే ముందు రింకు సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు.

Also Read: Ranbir Kapoor-RCB: ఆ బాలీవుడ్ హీరో చేతిలోకి RCB..కేవ‌లం రూ.300 కోట్ల‌కే..కోహ్లీ టీమ్ కు ఘోర అవ‌మాన‌మే ?

రింకు సింగ్ పై పోలీసులకు ఫిర్యాదు

Advertisement

టీమిండియా టీ20 స్పెష‌లిస్ట్ రింకు సింగ్ ( Rinku Singh) కొత్త వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా త‌న ఫేస్ బుక్ లో హిందూ దేవుళ్ల‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు రింకు సింగ్. ఈ ఏఐ వీడియోను రింకు సింగ్ పోస్ట్ చేయ‌డంతో, వివాదం రాజుకుంది. అయితే, ఈ ఏఐ వీడియోలో దేవుళ్లు న‌ల్ల క‌ళ్ల‌జోడు పెట్టుకుని, థార్ కారులో వెళ్లిన‌ట్లు ఉంది. అయితే, దేవుళ్లు న‌ల్ల క‌ళ్ల జోడు పెట్టుకోవ‌డం ఏంటీ, దీని వ‌ల్ల మ‌త‌ప‌ర‌మైన మ‌నోభావాలు దెబ్బ‌తిస్తున్న‌ట్లు క‌ర్ణి సేన సంఘం సీరియ‌స్ అయింది.

ఇందులో భాగంగానే, టీమిండియా టీ20 స్పెష‌లిస్ట్ రింకు సింగ్ ( Rinku Singh) పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది క‌ర్ణి సేన ( Karni Sena). ఈ ఏఐ వీడియోపై వెంట‌నే రింకు సింగ్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని, ఆ వీడియోను డిలీట్ చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. ఇక క‌ర్ణిసేన పోలీసుల‌కు ఇచ్చిన‌ ఫిర్యాదు నేప‌థ్యంలో విచార‌ణ చేస్తున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. విచార‌ణ చేసిన త‌ర్వాత దీనిపై స్పందిస్తామ‌న్నారు. కాగా, ఈ కేసులో రింకు సింగ్ ( Rinku Singh) అరెస్ట్ అవుతాడ‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది.

రేప‌టి నుంచే టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌

Advertisement

రేప‌టి నుంచే టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌ టీ20 సిరీస్ ( India vs New Zealand, 1st T20I) ప్రారంభం కానుంది. ఈ టోర్న‌మెంట్ కు రింకు సింగ్ కూడా సెల‌క్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. సూర్య కుమార్ యాద‌వ్ కెప్టెన్సీలో టీమిండియా, ఈ సిరీస్ లో ఆడ‌నుంది. టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ మ‌ధ్య 5 టీ20లు జ‌రుగ‌నున్నాయి. కాగా, నాగ్‌పూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టీమిండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ మ‌ధ్య తొలి టీ20 ( India vs New Zealand, 1st T20I) మ్యాచ్ జ‌రుగ‌నుంది.

 

 

Also Read: Virat Kohli: న్యూజిలాండ్ ప్లేయ‌ర్ మెడ ప‌ట్టుకుని తోసేసిన‌ కోహ్లీ..బంతిని త‌న్ని మ‌రీ రెచ్చిపోయాడుగా

 

 

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×