E-Paper
Advertisement

నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం..

నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల  నియామకం..
Advertisement

Nats Newjersey Chapter Leader:న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్‌గా సాయి గంగులను నియమించింది. నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల పాల్గొన్న ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ ఈ నియామకాన్ని ప్రకటించారు.న్యూజెర్సీకి చెందిన నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ మాట్లాడుతూ, యువకుడు, ఉత్సాహవంతుడు, చురుకైన నాయకుడైన సాయి గంగులకు సామాజిక సేవ పట్ల ఉన్న అంకితభావం న్యూజెర్సీ వ్యాప్తంగా నాట్స్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువతను నాట్స్ సేవా కార్యక్రమాల్లో మరింతగా భాగస్వాములను చేయడంలో సాయి గంగుల కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

న్యూజెర్సీ నుంచి ముగ్గురు నాట్స్ అధ్యక్షులు..

నాట్స్ ఛైర్మన్ కిశోర్ కంచర్ల మాట్లాడుతూ, నాట్స్ అభివృద్ధిలో న్యూజెర్సీ తెలుగు సమాజం అందించిన విశేష సేవలను కొనియాడారు. న్యూజెర్సీ నుంచి ముగ్గురు నాట్స్ అధ్యక్షులు రావడం ఈ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకతను చాటుతోందని పేర్కొన్నారు. తెలుగు సమాజానికి మరింత చేరువవుతూ, సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడానికి నాట్స్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలువురు ప్రముఖ తెలుగు సంఘాల నాయకులు, నాట్స్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆప్టా (APTA), ఆత్మీయ (ATMIYA), మాటా (MATA), తానా (TANA), టీఫాస్ (TFAS), ఎన్‌ఆర్‌ఐవీఏ (NRIVA) సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు సంఘాల మధ్య ఐక్యత, పరస్పర సహకారం, సమాజ సేవ పట్ల ఉమ్మడి నిబద్ధతకు ఈ సమావేశం వేదికగా నిలిచింది.

క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలు..

Advertisement

ఈ కార్యక్రమంలో నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు బిందు యలమంచిలి, టీపీ రావు, శ్యామ్ నాళం, మురళీకృష్ణ మేడిచెర్ల, శ్రీనివాస్ భీమినేని, వంశీ కొప్పురావూరి పాల్గొన్నారు.అలాగే నాట్స్ జాతీయ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న నెక్సిల్లో హెల్త్ (Nexillo Health) సంస్థకు చెందిన శశి పర్వతం, బులియన్ ఫార్చ్యూన్ (Bullion Fortune) సంస్థకు చెందిన కల్యాణ్ లక్కింశెట్టి, వంశీకృష్ణ కొప్పురావూరి కూడా ఈ కార్యక్రమానికి హాజరై నాట్స్ సేవా కార్యక్రమాలకు తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు నాట్స్ అధ్యక్షుడు రాజ్ అల్లాడ కు అభినందనలు తెలియజేశారు. ఆయన అంకితభావంతో అందిస్తున్న సేవలను, నాయకత్వాన్ని ప్రశంసించారు. తెలుగు సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని రాజ్ అల్లాడ నొక్కిచెప్పారు. క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాల్లో నాట్స్‌తో కలిసి పనిచేయాలని తెలుగు సంఘాలకు పిలుపునిచ్చారు.

సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు..

తెలుగు సమాజంలో పరస్పర సంబంధాలను మరింత బలోపేతం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను విస్తరించడం వంటి నాట్స్ లక్ష్యాలను ఈ సమావేశం మరోసారి చాటిచెప్పింది.న్యూజెర్సీ వ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలు నాట్స్ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, కమ్యూనిటీ కార్యకలాపాలు, స్వచ్ఛంద సేవా అవకాశాల కోసం నాట్స్ న్యూజెర్సీ చాప్టర్ లీడర్ సాయి గంగులను సంప్రదించవచ్చు మరియు పీఆర్వో (PRO) జీకే మీడియా గణేష్ – కుమార్. సంప్రదించాల్సిన ఈమెయిల్: natsnj@natsworld.org

Advertisement

Also Read: మళ్లీ ఆ స్థానానికి వెళ్లలేవు.. త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ పోస్ట్!

Related News

రూ .1000 కోట్ల కల.. జైలర్ 2తో కోలీవుడ్ చరిత్ర సృష్టిస్తుందా?

మళ్లీ ఆ స్థానానికి వెళ్లలేవు.. త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ పోస్ట్!

రజినీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జైలర్ 3 పై అఫీషియల్ అప్డేట్!

భార్య అంటే ఉచితంగా వచ్చే పనిమనిషా?- అనుపమ కామెంట్స్ వైరల్!

తన జీవిత గాథ అలానే ముగియాలి..తన బయోపిక్ మూవీ పై సల్మాన్ ఖాన్ కామెంట్స్!

సాయి దుర్గ తేజ్ బర్తడే స్పెషల్.. అమ్మవారి మొక్క నాటిన నాగబాబు!

బోల్డ్ ఫోటోషూట్ తో రచ్చ చేస్తున్న అక్కినేని కోడలు.. టార్గెట్ చేసిన సమంత ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×