Natural Star Nani: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే మనకు సినీ బ్యాగ్రౌండ్ ఉంటేనే అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీలో ఎదగడానికి అవకాశం ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు అయితే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో సక్సెస్ కావడం అంటే మామూలు విషయం కాదు అలా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. చిరంజీవి స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలోకి వస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అందుకున్న హీరోలలో నాచురల్ స్టార్ నాని (Nani) ఒకరు. కెరియర్ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదలైన ఈయన ప్రయాణం ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరో క్రేజ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నారు. పలువురు సీనియర్ దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న నాని హీరోగా అష్టా చమ్మా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా 2008 సెప్టెంబర్ 5వ తేదీ విడుదల అయింది. ఈ నేపథ్యంలోనే నాని తన సినీ జర్నీని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ నేపథ్యంలోనే గాల్లోకి ఎగురుతున్న తుపాకుల మధ్యలో నాని ఉన్నటువంటి ది ప్యారడైజ్ సినిమాకి సంబంధించిన ఒక వీడియో షేర్ చేస్తూ..”18 ఏళ్లు.. సినిమాల్లో అఫీషియల్ గా అడల్ట్ (పెద్దవాడిని) అయ్యాను. మీరు నాపై చూపించిన ప్రేమను నేనెప్పుడూ తేలికగా తీసుకోలేదు, తీసుకోలేను” అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఇలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్లాప్ బాయ్ గా పనిచేస్తూ సినిమాలలో అవకాశాలను అందుకున్నారు .ఈయన దర్శకుడు బాపు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.ఇలా క్లాప్ బాయ్ గా పనిచేస్తున్న నాని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దృష్టిలో పడటంతో ఈయన అష్టాచమ్మా సినిమాలో రాంబాబు పాత్రలో నానిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
18 years.
Officially an adult in cinema 🙂Never took your love for granted. I won’t ever. ♥️ pic.twitter.com/s6lcXTSs1Y
— Nani (@NameisNani) September 5, 2026
ఇలా అష్టా చమ్మా సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నాని తన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మంచి విజయం కావడంతో తదుపరి ఈయనకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే నాని సినిమాలు పరిమితమయ్యాయి కానీ ఇప్పుడు ఈయన ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇలా హీరోగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగా కూడా నాని పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా హీరోగా నిర్మాతగా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం ఈయన ది ప్యారడైజ్ సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు.
Also Read: బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!