Bigg Boss 10 Telugu: బుల్లితెర రియాలిటీ షో గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బిగ్ బాస్ తెలుగు కార్యక్రమానికి చాలా మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ రియాలిటీ షో ఏకంగా తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకొని పదవి సీజన్ ప్రారంభం కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే బిగ్ బాస్ 10 (Bigg Boss 10 Telugu) కి సంబంధించిన లాంచింగ్ ఎపిసోడ్ షూట్ పూర్తి అయినట్టు తెలుస్తుంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ ఆరో తేదీ సాయంత్రం ఏడు గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతోంది.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు, వారి స్టేజ్ పెర్ఫార్మెన్స్ లకు సంబంధించిన వీడియోలు కూడా లీక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తమిళ స్టార్ హీరో కార్తీ(Karthi) హాజరైనట్లు తెలుస్తుంది. నాగార్జున(Nagarjuna) కార్తీ ఇద్దరు సరదాగా ముచ్చటిస్తున్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లాంచింగ్ ఎపిసోడ్ లో భాగంగా కార్తీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం హీరో కార్తీ సర్దార్ 2 (Sardar 2)సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీ విడుదలవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పి ఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో విలన్ పాత్రలో ఎస్ జె సూర్య నటించారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేసాయి .విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాదులో కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.
ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలోనే ప్రమోషన్లలో భాగంగానే హీరో కార్తీ బిగ్ బాస్ 10 వేదికపై సందడి చేశారని తెలుస్తోంది. ఇకపోతే హీరో కార్తీతో నాగార్జునకు చాలా మంచి అనుబంధం ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఊపిరి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఇక బిగ్ బాస్ కార్యక్రమానికి వస్తే ఇందులో భాగంగా సెలబ్రిటీలతో పాటు కామనర్స్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మొత్తం ఆరుగురు కామనర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు.కృష్ణుడు,యాంకర్ వర్షిణి సౌందరాజన్, టెంపర్ వంశీ,సీరియల్ నటి చైత్ర , జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ ,జబర్దస్త్ కమెడియన్ నరేష్, నటి దేబ్జానీ,సీరియల్ యాక్టర్ ముఖేష్ గౌడ ,సినీ నటుడు అదిత్ ఈశ్వరన్(త్రిగుణ్),యాంకర్ సుధీర్ రెడ్డి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఝాన్సీ రోహిత్, చరణ్, షాలినీ, రామకృష్ణ, అమన్ కామనర్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.