E-Paper
Advertisement

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!
Advertisement

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాద సంస్థ టాప్ కమాండర్ యాసిర్‌ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన భారత భద్రతా బలగాలు తెలిపాయి. సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లా, యుస్మార్గ్ ఎగువ ప్రాంతాలలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే పక్కా సమాచారంతో సంయుక్తంగా ఈ నిఘా ఆధారిత గాలింపు చర్యలు చేపట్టిన ఇండియన్ ఆర్మీ (53 రాష్ట్రీయ రైఫిల్స్), స్పెషల్ ఫోర్సెస్ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో యాసిర్ అంతమైనట్టు భద్రతా భలగాలు ప్రకటించాయి.

ఉగ్ర దాడులతో సంబంధం..

గతంలో లష్కరే తోయిబాకు చెందిన ‘సులేమాన్ మూసా’ గ్రూపులో కీలక సభ్యుడిగా యాసిర్ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. యాసిర్‌కు పూంచ్‌లో ఐఏఎఫ్ (IAF) కాన్వాయ్‌పై జరిగిన దాడి, సోనామార్గ్ మరియు బోటా పత్రి ప్రాంతాలలో జరిగిన ఉగ్ర దాడులతో సంబంధం ఉందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Also read: గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్‌కి పండగే.. ఆ ఫోన్ ధర రూ.13,300 తగ్గింది, ఈ డీల్ మిస్ అవ్వొద్దు!

మరో ఉగ్రవాది..

ఎన్‌కౌంటర్ జరిగిన పీర్ పంజాల్ శ్రేణిలోని కొండలు, గుహల మధ్య ‘మూసా’ అనే మరో ఉగ్రవాది దాక్కున్నట్లు సమాచారం ఉండటంతో, అతని కోసం పోలీసు భలగాలు మరింత ఉధృతంగా గాలిస్తున్నారు. ఈ లష్కర్ కమాండర్ నిర్మూలనను జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను దెబ్బతీయడంలో భద్రతా బలగాలకు లభించిన అతిపెద్ద విజయంగా అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Also read: ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

Tags

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×