BigTV English
Advertisement

Mouli: నీ లైఫ్ లో ఏమి అచీవ్మెంట్స్ రా బాబు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు కొట్టావు, ఇప్పుడు సక్సెస్ మీట్ కి ఫేవరెట్ హీరో

Mouli: నీ లైఫ్ లో ఏమి అచీవ్మెంట్స్ రా బాబు, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు కొట్టావు, ఇప్పుడు సక్సెస్ మీట్ కి ఫేవరెట్ హీరో

Mouli: లైఫ్ ని కరెక్ట్ గా టార్గెట్ చేసి ఫోకస్ చేస్తే ఎంత దూరమైనా వెళ్లొచ్చు అని రుజువు చేసిన చాలామంది వ్యక్తులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. చాలామంది ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సక్సెస్ అయిన మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. రీసెంట్ టైమ్స్ లో నానిని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. అదే మాదిరిగా ఈ జనరేషన్ లో ఒక్కరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం మొదలు పెడుతున్నారు. అతను మరెవరో కాదు లిటిల్ హార్ట్స్ సినిమా హీరో మౌళి తనుజ్.


2020 లాక్ డౌన్ టైంలో మౌళి యూట్యూబ్ వీడియోస్ చేయడం మొదలుపెట్టాడు. ముందుగా ఫుడ్ సంబంధించిన వీడియోలు చేసేవాడు. వాటికి చిన్నగా రెస్పాన్స్ రావడం మొదలైంది. ఆ తర్వాత తనలో ఉన్న కామిక్ టైమింగ్ బయటకు తీసి వీడియోలు చేశాడు. అది కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. అయితే తను చేసిన కొన్ని వీడియోస్ ను సెలబ్రిటీలు షేర్ చేయడం కూడా మొదలుపెట్టారు. రాహుల్ రవీంద్రన్ అతని వీడియోను గతంలో కూడా షేర్ చేశాడు.

90 స్ సినిమాతో బ్రేక్ 

ఈటీవీ విన్ లో 90 స్ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ విపరీతంగా వర్కౌట్ అయింది. ఈ సిరీస్ తో మౌలికి అద్భుతమైన గుర్తింపు లభించింది. అక్కడితో సినిమాల్లో కూడా అవకాశాలు రావడం మొదలైంది. చాలామంది హీరోలకు ఒక అభిమాన హీరో ఉండడం అనేది కామన్ గా జరుగుతుంది. మౌలికి హీరో నాని అంటే విపరీతమైన ఇష్టం. అప్పట్లో తన ట్విట్టర్ అకౌంట్ కూడా నాని పేరు ఇంక్లూడ్ అయి ఉండేది. నానిని కలిసే అవకాశం పలు సందర్భాల్లో వచ్చినా కూడా ఎప్పుడు మౌళి నానిని కలిసే ప్రయత్నం చేయలేదు.


డ్రీమ్ కం ట్రూ మూమెంట్స్ 

మౌళి వీడియోలో బాగా వైరల్ అయిన వీడియో “మీ హీరోకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రికార్డు ఉందా.?” అయితే ప్రస్తుతం ఈ మధ్యకాలంలో కూడా ఆ వీడియో వైరల్ అయింది. ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మౌళి అసలైన రికార్డు కొట్టాడు. ఈరోజుల్లో ఒక సినిమా హౌస్ ఫుల్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. కానీ మౌళి నటించిన సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో హౌస్ఫుల్ అయింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ రేపు నిర్వహించే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ కు నాని ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన అభిమాన హీరోని కలిసే అవకాశం మౌలికి వచ్చినా కూడా కలవలేదు. కానీ మౌళి సక్సెస్ మీట్ ఈవెంట్ కు నాని చీఫ్ గెస్ట్ గా రావడం అనేది అసలైన అచీవ్మెంట్. ఇలాంటి అచీవ్మెంట్స్ మౌళి లైఫ్ లో రీసెంట్ టైమ్స్ లో చాలా జరిగాయి. నిజంగా ఈ కాలం యూత్ కి మౌళి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి.

Also Read : Sree Vishnu : శ్రీ విష్ణు కామ్రేడ్ అవతారం… కామెడీ చేసుకోకుండా ఇవన్నీ ఎందుకో?

Related News

Sandeep Reddy Vanga: రష్మిక ‘గర్ల్‌ ఫ్రెండ్‌’లో సందీప్‌ రెడ్డి వంగా కీ రోల్‌.. నో చెప్పిన డైరెక్టర్, కారణమేంటంటే

Rajamouli: బాహుబలి సినిమాలో జక్కన్న మెచ్చిన సీన్ అదేనా..అంత ప్రభావితం చేసిందా?

Tollywood: ఇండస్ట్రీకి నెక్స్ట్ హీరోయిన్ రెడీ.. ఆ హాట్ ఫోజులు చూశారా!

Dhanya Balakrishna: రొమాన్స్ చేస్తేనే సక్సెస్.. అందుకే సక్సెస్ కాలేదన్న నటి?

Ramya Krishnan: రమ్యకృష్ణ పై ఐరన్ లెగ్ ట్రోల్స్.. ఆ జ్యోతిష్యుడు మాటే నిజమైందా?

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ కాదు.. ఒక్క మాటతో ఆ వార్తలను ఖండించిన శ్రీ లీల!

Suriya-Venky Atluri: సూర్య, వెంకీ అట్లూరి సినిమా నో హిందీ రిలీజ్.. ఎందుకంటే!

Sreeleela: శ్రీ లీలకు భర్త అవ్వాలంటే ఇన్ని క్వాలిటీస్ ఉండాలా? మామూలు కోరికలు కాదే?

Big Stories

×