OTT Movie : హారర్ జానర్ ని ఇప్పుడు ఎక్కువగా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలు ఇచ్చే థ్రిల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం ఒక బాలీవుడ్ హారర్ సినిమా గురించి చెప్పుకుందాం. ఇందులో ఒక కుటుంబంపై 350 సంవత్సరాల శాపం వెంటాడుతుంటుంది. ఈ కుటుంబంలో కుమార్తెలు పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే వరుడు చనిపోతాడు. ఇక ఈ సినిమా చివరి వరకు ఊహించని ట్విస్ట్లు, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ కి గుండె దఢ పెంచుతుంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
అమన్, కాయా ఒకరినొకరు ఇష్టపడి ప్రపోజ్ చేసుకుంటారు. ఇద్దరూ షికార్లు చేస్తూ ప్రేమను ఆస్వాదిస్తుంటారు. అయితే ఒక రోజు వీళ్ళిద్దరూ ఒక కార్ అక్సిడెంట్ నుంచి తప్పించుకుంటారు. కాయా తల్లిదండ్రులు ఈ ప్రేమ తెలుసుకుని, వారి కుటుంబంపై 300 సంవత్సరాల పాత శాపం గురించి చెబుతారు. కాయా తండ్రి రాజా రణజిత్ సింగ్ ఈ కుటుంబంలో ప్రస్తుతం వారసుడిగా ఉంటాడు. 300 ఏళ్ల క్రితం, రాజు సోదరుడు ఒక అమ్మాయిని అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. కోపంతో ఆమె తండ్రి అచార్య ఒక శాపం పెడతాడు. రణజిత్ సింగ్ కుటుంబంలో ఎవరైనా కుమార్తె ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా, ఆమె లవర్, పెళ్లికొడుకు ఇమ్మీడియట్‌గా మరణిస్తారు.
ఈ శాపం జనరేషన్స్ నుండి వస్తుంటుంది. ఇప్పుడు కాయా కూడా దీని బారిన పడింది. ఇక అమన్ ఈ శాపాన్ని బ్రేక్ చేయాలని నిర్ణయించుకుంటాడు. అతని స్నేహితుడు షుభ్ సహాయంతో, ప్రొఫెసర్ పశుపతి అనే ఓకల్ట్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళతారు. ఇది ఒక రింగ్ తో లింక్ ఉన్నట్లు త్రలుస్తుంది. ఈ శాపం బ్రేక్ చేయాలంటే, స్పిరిట్‌ను డిస్ట్రాయ్ చేయాలని ప్రొఫెసర్ చెబుతాడు. ఒక రిచ్యువల్ తో స్పిరిట్ బయటికి వస్తుంది. అమన్ ధైర్యంగా స్పిరిట్‌తో ఫైట్ చేస్తాడు. ఈ స్పిరిట్ ని అమన్ కంట్రోల్ చేస్తాడా ? దాని చేతిలో బలవుతాడా ? ఈ శాపం పోతుందా ? కంటిన్యూ అవుతుందా ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.
‘షాపిట్: ది కర్స్డ్’ (Shaapit: The Cursed) విక్రమ్ భట్ట్ దర్శకత్వంలో వచ్చిన హిందీ రొమాంటిక్ హారర్ అడ్వెంచర్ సినిమా. ఇందులో ఆదిత్య నారాయణ, ష్వేతా అగర్వాల్, రాహుల్ దేవ్, షుభ్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గూగుల్ ప్లే మూవీస్‌లో రెంట్/బై చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో కూడా ఉచితంగా అందుబాటులో ఉంది. చిత్రం 2010 మార్చ్ 19న విడుదలై, 2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 5.5/10 రేటింగ్ పొందింది.
Read Also : ఆడవాళ్లందరినీ వదిలేసి బొమ్మతో… చివరికి ఆ పని కూడా దాంతోనే… ఊహించని ట్విస్టులున్న థ్రిల్లర్ మూవీ