OTT Movie : విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటించిన సినిమా ‘తలైవన్ తలైవీ’. పాతిక కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమా తొంబై కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ‘సార్ మేడమ్’ టైటిల్ తో తెలుగులో కూడా రిలీజ్ అయింది. రొమాంటిక్ యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఓటీటీలో కూడా అడుగుపెట్టింది. ఈ సినిమాని చూసి ఫ్యామిలీ ఆడియన్స్ కేరింతలు కొడుతున్నారు. విజయ్ సేతుపతి, నిత్యామీనన్ నటనలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ స్టోరీ ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
వీరయ్య (విజయ్ సేతుపతి) ఒక సింపుల్ పరోటా మాస్టర్. తన ఫ్యామిలీతో కలిసి రోడ్‌సైడ్ షాప్ నడుపుతుంటాడు. రాణి వీరయ్య (నిత్యా మేనెన్) తో వీరయ్య కి పెళ్ళి చూపులు జరుగుతాయి. వీరయ్య పెద్దగా చదువుకోలేదని తెలిసి కూడా రాణి పెళ్లికి ఒప్పుకుంటుంది. అయితే ఈ సంబంధం రాణి అన్నయ్యకి ఎంతమాత్రం ఇష్టం ఉండదు. సంబంధం కుదుర్చుకున్న తరువాత, వీరయ్య అతని తమ్ముడు పెద్ద రౌడీలనే విషయం రాణి ఫ్యామిలీకి తెలుస్తుంది. పెళ్లి సంబంధాల సమయంలో వాళ్లు చెప్పిన విషయాలన్నీ అబద్ధాలని అర్థమవుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే రాణి కోడలిగా రావడం ఆ ఇంటికి మంచిది కాదని ఒక జ్యోతిష్కుడు వీరయ్య తల్లికి చెబుతాడు. వీరయ్య ను వివాహం చేసుకోవద్దని రాణిని ఆమె పేరెంట్స్ కూడా వారించడం మొదలుపెడతారు. కానీ అప్పటికే వాళ్ల మధ్య ప్రేమ మొదలవుతుంది. ఇక పెద్దవాళ్ల మాటలను పట్టించుకోకుండా ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అక్కడి నుంచి అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ రెండు ఫ్యామిలీలకు తల బిరుసు ఎక్కువగానే ఉంటుంది. అందరూ గతంలో రౌడీయిజం చేసినోళ్లే. పెళ్ళి మొదట్లో అంతా బాగానే ఉంటుంది. పెళ్లి తర్వాత ఈ మ్యారేజ్ డిస్‌ఫంక్షనల్‌గా మారుతుంది. ఇద్దరూ ఈగో క్లాష్‌లు, చిన్న చిన్న విషయాలపై ఫైట్స్ చేసుకుంటారు. వీరయ్య రెస్టారెంట్‌లో పరోటా వంటకానికి ఫేమస్. రాణి కూడా ఫుడ్ లవర్, కానీ ఈ వివాహం ఫ్యామిలీ ఇంటర్ఫియరెన్స్‌తో మరింత కామ్‌ప్లికేటెడ్ అవుతుంది.
ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఫైట్స్‌లో జాయిన్ అయి, గన్, సికిల్ వంటి ఆయుధాలు ఉపయోగించి కామెడీ-డ్రామాని సృష్టిస్తారు. ఆ తరువాత ఇద్దరూ మూడు నెలలు విడిగా ఉంటారు. ఒక సన్నివేశంలో పెరారసి ఆగాసవీరన్ కి చెప్పకుండా, దేవుడి దగ్గర తన కూతురుకు తలనీలాలు తీపిస్తుంటుంది. ఈ విషయం తెలిసి అతను టెంపుల్‌లోకి వచ్చి సీన్ క్రియేట్ చేస్తాడు. ఫైట్స్ ఎక్స్‌కలేట్ అవుతూ డివోర్స్ కావాలని డిసైడ్ చేసుకుంటారు. ఈ స్టోరీ ఈగో వర్సెస్ లవ్ తో ముందుకు సాగుతుంది. చివరికి వీళ్ళు విడాకులు తీసుకుంటారా ? మళ్ళీ హోటల్ కివెళ్ళిపోతారా ? ఈ రెండు కుటుంబాల గొడవలు సర్దుకుంటాయా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
‘తలైవన్ తలైవీ’ (Thalaivan Thalaivii) పాండిరాజ్ దర్శకత్వంలో, విజయ్ సేతుపతి, నిథ్యా మేనెన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రం 2025 జూలై 25న థియేటర్లలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2025 ఆగస్టు 22 నుండి తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ డబ్బింగ్‌తో స్ట్రీమింగ్‌లో ఉంది. 2 గంటల 20 నిమిషాల రన్‌టైమ్ తో ఈ సినిమా IMDb లో 5.8/10 రేటింగ్ పొందింది.
Read Also : టాయిలెట్ కు వెళ్లి తిరిగిరాని లోకాలకు… ఈ మిస్టరీ డెత్ కు వెన్నులో వణుకు పుట్టించే హర్రర్ రీజన్