Sree Vishnu : వెబ్ డిజైనర్ గా కెరియర్ మొదలుపెట్టిన శ్రీ విష్ణు నటుడుగా కొన్ని సినిమాలు చేశాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, సన్నాఫ్ సత్యమూర్తి, అప్పట్లో ఒకడుండేవాడు వంటి సినిమాలు శ్రీవిష్ణుకి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో తను కూడా ఒక మెయిన్ లీడ్ గా కనిపించాడు. ఆ సినిమా కొంతమందిని విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడితో శ్రీ విష్ణుకు వరుస అవకాశాలు వచ్చాయి.
ఈ తరుణంలో శ్రీ విష్ణు హీరోగా కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలు శ్రీవిష్ణు కి విపరీతమైన పేరును తీసుకొచ్చాయి. ఆ తరువాత సోలో హీరోగా వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు శ్రీ విష్ణు. అలా ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడం వలన కొన్ని తన లైఫ్ కి ప్లస్ అవ్వని స్క్రిప్ట్స్ కూడా యాక్సెప్ట్ చేసేసాడు. దానివలన వరుసగా శ్రీవిష్ణు కి కూడా ఫెయిల్యూర్స్ పడ్డాయి.
మామూలుగా కొంతమంది హీరోలు కామెడీ చేస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అలాంటి హీరోలలో శ్రీ విష్ణు ఒకడు. సెన్సార్ కి కూడా దొరక్కుండా బూతులు మాట్లాడటం శ్రీ విష్ణు కి వెన్నతో పెట్టిన విద్య. వరుస సినిమాలు డిజాస్టర్ అవుతున్న తరుణంలో సామజవరగమన సినిమా శ్రీ విష్ణుకు విపరీతమైన పేరు తీసుకొచ్చింది. కొంతమంది ఈ సినిమాను మినీ నువ్వు నాకు నచ్చావ్ అని కూడా పోల్చారు. ఆ తర్వాత శ్రీ విష్ణు స్ట్రెంత్ కామెడీ అని చాలామందికి అర్థం అయిపోయింది. ఆ సినిమా తర్వాత చేసిన ప్రతి సినిమాలోని కూడా శ్రీ విష్ణు కామెడీ విపరీతంగా వర్కౌట్ అయింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో శ్రీ విష్ణు కామెడీ వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.
ప్రస్తుతం శ్రీ విష్ణు ఇప్పుడు తన కామెడీని పక్కనపెట్టి ఒక కాన్సెప్ట్ బేస్ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని కాన్సెప్ట్ బేస్ సినిమాలు మీద శ్రీ విష్ణు సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. శ్రీ విష్ణు చేయబోయే సినిమాకి కొత్త దర్శకుడు జానకి రామ్ మారెళ్ల అని తెలుస్తుంది. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP, విజిల్ వర్తీ ఫిల్మ్స్ & KFC బ్యానర్లపై ప్రొడక్షన్ నంబర్ 1గా అనుష ద్రోణవల్లి, సీతా కుమారి కోత మరియు గోపాలం లక్ష్మీ దీపక్ ఈ సినిమాను నిర్మించనున్నారు నిర్మిస్తున్నారు.
బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి మరియు ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు కామెడీ సినిమాలు శ్రీ విష్ణుకు బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ కామ్రేడ్ సినిమా ఎంత మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. కామ్రేడ్ అనే ప్రస్తావన రావడానికి కారణం ఏమిటి అంటే ఈ సినిమాకి కామ్రేడ్ కళ్యాణ్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
Also Read: Sharwanand : అర్థం కాని స్థితిలో శర్వా పరిస్థితి, ఆ విషయంలో అసలు తగ్గట్లేదు