E-Paper
Advertisement

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!
Advertisement

NTR’S Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఎన్టీఆర్ ప్రమాదానికి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేతికి గాయం కావడంతో వెంటనే సర్జరీ నిర్వహించారు. ఇలా ఎన్టీఆర్ కు సర్జరీ కావడంతో ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. సుమారు 8 వారాలపాటు ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటారని వార్తలు వచ్చాయి కానీ ఎన్టీఆర్ మాత్రం పూర్తిగా కోలుకున్నారని తెలుస్తోంది.

డ్రాగన్ సెట్ లోకి తారక్ ఎంట్రీ..

ఇటీవల మైత్రి మూవీ నిర్మాతలు ఎన్టీఆర్ హెల్త్ అప్డేట్ తెలియజేస్తూ ఎన్టీఆర్ మరికొద్ది రోజులలో సినిమా షూటింగ్లో పాల్గొంటారు అంటూ తెలియజేశారు అయితే తాజాగా ఈ అంశంపై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)బిగ్ అప్డేట్ తెలియజేశారు. ఎన్టీఆర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ఈయన డ్రాగన్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలియజేశారు. ఇలా ఎన్టీఆర్ త్వరగా రికవరీ అవ్వడమే కాకుండా వెంటనే సినిమా షూటింగ్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఎన్టీఆర్ చాలా స్పీడ్ మీద ఉన్నారని త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న విధంగానే 2027 జూన్ 11వ తేదీ ఈ సినిమాని విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

డ్రాగన్ సినిమాలో బాలీవుడ్ స్టార్స్..

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్లో రాబోతున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జోడిగా నటి రుక్మిణి వసంత్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇకపోతే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తుంది.

Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న నటి ఆలియా భట్ (Alia Bhatt)ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. అదేవిధంగా విలన్ పాత్రలో నటుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor)నటిస్తున్నారని దాదాపు వీరి ఎంపిక ఫైనల్ అయిందని త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా తెలియజేయబోతున్నట్టు సమాచారం. ఇలా బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమాలో భాగమవుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఆలియా భట్ ఎన్టీఆర్ హీరోగా నటించిన RRR సినిమాలో నటించారు. ఇక ఇప్పుడు రెండోసారి ఎన్టీఆర్ తో కలిసి ఈమె స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

Also Read: సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!!

Related News

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

Advertisement
×