E-Paper
Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికిందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికిందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..!
Advertisement

BRS Strategy: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ సమావేశాల వేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పక్కా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ నెల 6న ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా తప్పనిసరిగా హాజరుకావాలని సమాచారం అందించారు.

సభను స్తంభింపజేసే నిరసనలు?

ప్రభుత్వం విధించిన 22ఏ నిషేధిత జాబితా వివాదంపై సభలో నిరసనకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు చేతబూని అసెంబ్లీలోకి వెళ్లి నిరసన తెలపడం ద్వారా సభను స్తంభింపజేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, కాళేశ్వరం బ్యారేజీలు, రైతు రుణమాఫీ, శాంతిభద్రతల సమస్యలను ప్రధానంగా లేవనెత్తాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను అసెంబ్లీ వేదికగా గట్టిగా నిలదీసేందుకు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

Advertisement

Also read: హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కేసీఆర్ దిశా నిర్దేశం..

అదే విధంగా సభ వేదికగా ప్రభుత్వంపై ఏ విధంగా విరుచుకుపడాలి, ప్రజా సమస్యలపై ఎలాంటి వైఖరి అవలంబించాలనే అంశాలపై నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పాలన ప్రారంభమై వెయ్యి రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఇచ్చిన డిక్లరేషన్లు, 6 గ్యారంటీల అమలు వైఫల్యాన్ని సభలో ప్రధానంగా నిలదీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సభలో నిరసనను ఉధృతం చేసేందుకు గులాబీ దళం కసరత్తు చేస్తోంది. తీర్మాణాలను సైతం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.కాంగ్రెస్ తీరును ఎండగడుతూ శాసనసభలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ భేటీ ద్వారా తమ కార్యరూపాన్ని సిద్ధం చేసుకోనున్నట్లు సమాచారం.

ఎర్రవెల్లిలో 6న భేటీ

Advertisement

శాసన సభ సమావేశాలు ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో, బీఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈనెల 6న ఎర్రవెల్లి నివాసంలో మధ్యాహ్నం 1 గంటకు లంచ్ చేయనున్నారు. అనంతరం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసనసభా పక్షం భేటీ అవుతుంది. శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో కూడిన సంయుక్త సమావేశం జరగనున్నది.ఈ సమావేశానికి హాజరుకావాలని పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సూచించారు.

Also read: ఇరుముడి ఊపు తగ్గలేదుగా…మరో రికార్డుపై కన్నేసిన రవితేజ !

Tags

Related News

తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనలో ఊహించని ట్విస్ట్.. సీనియర్లకు బిగ్ షాక్!

డిప్యూటీ సీఎం ఇస్తేనే కేబినెట్‌లోకి వెళ్తా.. ఏఐసీసీకి మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్‌!

కాంగ్రెస్ పార్టీకి ఉహించని షాక్.. ఆ విషయంలో ఇక అన్ని పార్టీలు అటువైపే..?

రెండేళ్లు చాన్సివ్వండి.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ది..ప‌రీక్ష‌లో మంచి మార్కులు తెచ్చుకుంటా! ఆ త‌రువాత మీ జీత‌భ‌త్యాలు నేను చూసుకుంటా!

కృష్ణా నీటి వివాదంపై తేలని పంచాయితీ.. కీలక వ్యాఖ్యలు చేసిన కేఆర్ఎంబీ!

కేటీఆర్ జెన్‌జీ మంత్ర.. విద్యార్థులు, నిరుద్యోగుల‌తో ఢిల్లీ బాట‌..! జెన్‌జీ మ‌న‌సు గెలుచుకునే ప్ర‌య‌త్నం..

ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ లేఆఫ్స్.. లక్ష మంది ఉద్యోగులకు షాక్!

Big Stories

Advertisement
×