E-Paper
Advertisement

Anaganaga Oka Raju : రాజుగారు సౌండ్ చెయ్యట్లేదు.. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందా..?

Anaganaga Oka Raju : రాజుగారు సౌండ్ చెయ్యట్లేదు.. సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుందా..?
Advertisement

Anaganaga Oka Raju : టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటిస్తూ వస్తున్నాడు. జాతి రత్నాలు మూవీ అతని లైఫ్ కు టర్నింగ్ పాయింట్. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు నవీన్ పోలిశెట్టి. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి.. ప్రస్తుతమైన అనగనగా ఒక రాజు అనేది చిత్రంలో నటిస్తున్నారు.. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సంక్రాంతి రేసులో స్టార్ హీరోలో సినిమాలు పోటీ పడుతుండడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాకు ప్రమోషన్స్ మొదలు పెట్టాలి. కానీ ఈ మూవీ మేకర్స్ మాత్రం సైలెంట్ గా ఉండడంతో సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉందో ఒకసారి తెలుసుకుందాం..

మళ్లీ వెనక్కి వెళ్లిన నవీన్ పోలిశెట్టి..

సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేసిన నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రం ‘అనగనగా ఒక రాజు’ పండుగ రేసు నుంచి తప్పుకుందట. జనవరి 14న విడుదల చెయ్యాలని ముందుగా అనుకున్నారు. కానీ ప్రమోషన్స్ మొదలుపెట్టలేదు. అందులో ఆ సమయంలో స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల కాబోతున్నాయి. దీంతో జనవరి 23 లేదా జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్బంగా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్. కథ, కామెడీ, నవీన్ పోలిశెట్టి టైమింగ్ కారణంగా మొదటి టీజర్ నుంచి సినిమా పై బజ్ ఉంది

Advertisement

Also Read:బన్నీ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్.. అట్లీ ఏ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నాడంటే?

నవీన్ పోలిశెట్టి సినిమాలు.. 

తెలుగు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒక్కో సినిమాతో తన క్రేజ్ ని పెంచుకుంటూ వస్తున్నాడు. మొదట్లో సైడ్ క్యారెక్టర్ చేసిన ఈయన హీరోగా తన సత్తాని చాటాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లో ప్రత్యేకమైన కామెడీ డిటెక్టివ్ స్టైల్‌తో మెప్పించాడు. జాతి రత్నాలు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. మిస్ శెట్టి – మిస్టర్ పొలిశెట్టి తో ఎమోషనల్ గా కట్టిపడేసారు. ఇప్పటివరకు నటుడిగా,  రైటర్గా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ హీరో అనగనగా ఒక రోజు మూవీ తో సింగర్ గా కూడా మారాడు. కేవలం పెద్ద హీరోల సినిమాలు ఉండడం వల్లనే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. నవీన్ పోలిశెట్టి కున్న క్రేజ్ తో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిన టాక్ బాగానే ఉంటుందని జనాలు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ హీరోకు అనగనగా ఒక రాజు మూవీ ఏ మాత్రం టాక్ ని అందిస్తుందో చూడాలి..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×