E-Paper
Advertisement

Dhanush: ధనుష్ దాచిపెట్టిన సీక్రెట్ విలువ అక్షరాలా రూ. 60 కోట్లు.. ఏంటో తెలిస్తే దిమ్మ తిరుగుతుంది

Dhanush: ధనుష్ దాచిపెట్టిన సీక్రెట్ విలువ అక్షరాలా రూ. 60 కోట్లు.. ఏంటో తెలిస్తే దిమ్మ తిరుగుతుంది
Advertisement

Dhanush: సాధారణంగా సెలబ్రిటీలు అందరూ చాలా లగ్జరీగా నివసిస్తుంటారు. ఖరీదైన కారులు, బంగ్లాలో ఉంటారు. వారు వాడే దుస్తులు దగ్గరనుంచి ధరించే వాచ్ ల వరకు కోట్లలలో ఉంటాయి. అయితే కొంతమంది సెలబ్రిటీలకు మాత్రం ఒక వస్తువు అంటే పిచ్చి ఉంటుంది. ఒకరేమో దుస్తులు అంటే ఎక్కువ ఇష్టపడరు. ఇంకొకరు ఫోన్స్.. గాడ్జెట్స్ మీద ఎక్కువ ఖర్చు పెడతారు. ఎన్టీఆర్ అయితే ఎక్కువ వాచ్ ల మీద ఖర్చు పెడతాడు. నాగ చైతన్య కార్ల మీద..ఇలా ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది.

ఎన్టీఆర్ లానే ధనుష్ కి కూడా వాచ్ ల పిచ్చి ఉందట. వైట్ అండ్ వైట్ లుంగీ, షర్ట్ తో సింపుల్ గా కనిపించినా.. చేతికి వాచ్ మాత్రం చాలా ఖరీదైనదే ధరిస్తాడు. ఎంత సింపుల్ లుక్ లో కనిపించే ధనుష్ కి ఇలాంటి వాచ్ ల పిచ్చి ఉంది అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ధనుష్ ఈ విషయాన్నీ బయటపెట్టాడు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న చిత్రం తేరి ఇష్క్ మే. తెలుగులో ఈ సినిమా అమర కావ్యం అనే పేరుతో రిలీజ్ కానుంది.

Advertisement

ఇక  ధనుష్ తాజాగా దుబాయ్ లోని వాచ్ వీక్ కి గెస్ట్ గా వెళ్ళాడు.  అక్కడ జరిగిన ఇంటర్వ్యూలో యాంకర్.. మీ చేతికి ఉన్న వాచ్ విలువ రూ. 2.5 కోట్లా ..? అంటే ధనుష్ నవ్వి ఊరుకున్నాడు. మరి నవ్వడా.. ఆ ధర కేవలం ఆ వాచ్ దే. దానికన్నా ఎక్కువ విలువైన వాచ్ లు ఆయన దగ్గర చాలా ఉన్నాయి. ఈ వాచ్ విలువ తెలుసుకొనే ఇలా అయిపోతే వాటి విలువ తెలుసుకొంటే గుండె ఆగిపోతుందేమో అని నవ్వి ఉంటాడు. అవును, మీరు విన్నది నిజమే. ధనుష్ దగ్గర ఉన్న వాచ్ కలక్షన్ మొత్తం కలిపితే దాదాపు రూ. 60 కోట్లు ఉంటాయట. ఇప్పటివరకు తెలియని ఈ సీక్రెట్ ను ధనుష్ మొదటసారి బయటపెట్టాడు.

నేషనల్, ఇంటర్నేషనల్, రేర్ పీస్ లు అన్ని ధనుష్ దగ్గర ఉన్నాయట. అయితే ఈ వాచ్ ల పిచ్చి వెనుక ఒక అద్భుతమైన కథ కూడా ఉంది. ధనుష్.. తాము చిన్నప్పుడు చాలా పేదరికంలో బతికాం అన్న విషయం ఎన్నోసార్లు.. ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. ఇడ్లీ కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నామని చెప్పుకొచ్చాడు. ఇక ఆ సమయంలోనే తన తల్లి తనాకు ఒక వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చిందంట. ప్లాస్టిక్ డిజిటల్ వాచ్.. దాని విలువ 100 రూపాయల కన్నా తక్కువే. కానీ, అది తనకు ఎంతో ఇష్టమని ధనుష్ చెప్పుకొచ్చాడు. అది విరిగిపోయినా.. బ్యాటరీ ఐపోయినా.. కూడా చేతికి పెట్టుకొని స్కూల్ కి వెళ్ళేవాడినని.. ఇప్పుడు ఉన్న కోట్ల విలువైన వాచ్ ల కన్నా తనకు తన తల్లి ఇచ్చిన ప్లాస్టిక్ డిజిటల్ వాచే తనకు ఎంతో గొప్పది అని ధనుష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×