E-Paper
Advertisement

NBK 111Nayanatara: యువరాణిగా నయనతార..స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ఎన్బీకె111!

NBK 111Nayanatara: యువరాణిగా నయనతార..స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ఎన్బీకె111!
Advertisement

NBK 111 Nayanatara : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణ తిరిగి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరొక సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకోబోతోంది. ఇప్పటికే బాలకృష్ణకు సంబంధించిన లుక్ విడుదల చేయగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నయనతార పాత్రకు సంబంధించి ఒక వీడియో విడుదల చేశారు. ఈ సినిమాలో నయనతార యువరాణి పాత్రలో కనిపించబోతున్నారని తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన వీడియో చూస్తుంటేనే స్పష్టం అవుతుంది. నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోని విడుదల చేస్తూ..NBK 111 ప్రపంచంలోకి యువరాణిని ఆహ్వానిస్తున్నామంటూ చిత్ర బృందం ఈ వీడియోని తెలిపారు. త్వరలోనే ఈమె షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా తెలియజేశారు.

పుట్టినరోజు ప్రత్యేకం..

ఇలాంటి నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఈమె నటించబోతున్నారంటూ అధికారకంగా ప్రకటిస్తూ ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేయడంతో  ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నయనతార ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇదివరకే బాలకృష్ణతో కలిసి సింహం, శ్రీరామరాజ్యం వంటి సినిమాలలో నటించారు. శ్రీరామరాజ్యం సినిమాలో బాలకృష్ణ రాముడిగా నటించుగా ఈమె సీత పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మరోసారి రాణి పాత్రలో బాలకృష్ణకు జోడిగా నయనతార కనిపించబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆఖండ2 ప్రమోషన్లలో బిజీగా బాలయ్య..

Advertisement

ఇక నయనతార ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. యశ్ టాక్సిక్ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక బాలకృష్ణ సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదివరకే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో మరోసారి బాలకృష్ణ గోపీచంద్ కాంబినేషన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక అఖండ 2 సినిమా విడుదల అయిన అనంతరం బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ పనులలో పాల్గొనబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో బాలకృష్ణ ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Mega 158: గ్యాంగ్ స్టర్ డ్రామాగా మెగా 158..బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

Advertisement

 

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×