E-Paper
Advertisement

IPL 2026 : SRH కెప్టెన్‌ మార్పుపై కావ్య పాప సంచలన ప్రకటన.. వచ్చే సీజన్ కు వస్తున్నాడు

IPL 2026 : SRH కెప్టెన్‌ మార్పుపై కావ్య పాప సంచలన ప్రకటన.. వచ్చే సీజన్ కు వస్తున్నాడు
Advertisement

IPL 2026 : స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కొత్త కెప్టెన్ ను నియ‌మిస్తార‌నే ప్ర‌చారానికి యాజ‌మాన్యం పుల్ స్టాప్ పెట్టింది. వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లోనూ పాట్ క‌మిన్స్ కెప్టెన్ గా ఉంటారంటూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట‌ర్ ను షేర్ చేసింది. అత‌ని సార‌థ్యంలో 2024 ఫైన‌ల్ చేరిన స‌న్ రైజ‌ర్స్ 2025 లో ఆరోస్థానంలో నిలిచింది. ఓవ‌రాల్ గా క‌మిన్స్ కెప్టెన్సీలో 30 మ్యాచ్ లు ఆడ‌గా.. 15 గెలిచి, 14 ఓడింది. ఓ మ్యాచ్ లో మాత్రం ఫ‌లితం తేల‌లేదు. అత‌డినీ వేలంలో రూ.20.50 కోట్ల‌కు కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే. పాట్ క‌మిన్స్ కెప్టెన్సీలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 2024 సీజ‌న్ లో ఫైన‌ల్ కి కూడా చేరుకుంది. కానీ 2025లో మాత్రం ప్లే ఆప్స్ కి కూడా చేరుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Yograj Singh: టీమిండియాలో కలకలం..యువరాజ్ తండ్రి ఆత్మహత్యాయత్నం?

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కీల‌క మార్పులు

Advertisement

2024లో ఐపీఎల్ వేలానికి ముందు సౌతాఫ్రికా ఆట‌గాడు ఐడెన్ మార్ క్ర‌మ్ స్థానంలో పాట్ క‌మిన్స్ కి కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది స‌న్ రైజ‌ర్స్ యాజ‌మాన్యం. వ‌రుస‌గా మూడో సీజ‌న్ లో త‌మ జ‌ట్టును క‌మిన్స్ న‌డిపిస్తాడ‌ని స‌న్ రైజ‌ర్స్ ప్ర‌క‌టించింది. ఆస్ట్రేలియా వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్, వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ అందించిన అత‌డినీ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 2024 వేలంలో ఏకంగా రూ.20.50 కోట్ల కు కొనుగోలు చేసింది. ప్ర‌స్త‌తం గాయం నుంచి కోలుకుంటున్నాడు పాట్ క‌మిన్స్. ఈనెల 21 నుంచి ఇంగ్లాండ్ తో జ‌రిగే యాషెస్ సిరీస్ తొలిటెస్ట్ కి దూరం అయ్యాడు. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టులో కొన్ని కీల‌క మార్పులు చేసింది. స్టార్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కి ట్రేడ్ చేసింది. అదేవిధంగా ఆడ‌మ్ జంపా, రాహుల్ చాహ‌ర్ వంటి స్పిన్న‌ర్ల‌ను విడుద‌ల చేసింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిష‌న్ వంటి కీల‌క ఆట‌గాళ్ల‌ను మాత్రం అట్టి పెట్టుకుంది.

క‌మిన్స్ గాయం.. కాస్త ఆందోళ‌న

2026 లో ట్రావిస్ హెడ్ SRH కెప్టెన్సీ పొందే అవకాశం గురించి భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడిన కొన్ని గంటల తర్వాత.. ఈ పోస్ట్ రావడం గమనార్హం. స‌న్ రైజ‌ర్స్ బౌలింగ్ ఆందోళనకరంగా ఉంది. షమీని విడుదల చేసే ముందు నేను ఒకటి లేదా రెండుసార్లు ఆలోచించేవాడిని. బహుశా భరత్ అరుణ్ సంజీవ్ గోయెంకాతో షమీని తీసుకోవాలని చెప్పి ఉండవచ్చు. నేను అతని నుంచి ఉత్తమంగా తీసుకుంటాను. కమిన్స్ గాయం ఆందోళన కలిగిస్తుంది. దీంతో కెప్టెన్‌గా ట్రావిస్ హెడ్ వైపు చూడవచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు అశ్విన్. కమ్మిన్స్ చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీని కారణంగా పెర్త్‌లో జరిగే తొలి యాషెస్ టెస్ట్‌కు అతను అధికారికంగా దూరమయ్యాడు. బ్రిస్బేన్‌లో జరిగే రెండో టెస్ట్‌కు అతను సకాలంలో కోలుకుంటాడని ఆస్ట్రేలియా ఆశిస్తోంది. కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో నవంబర్ 21 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్ట్‌లో స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించనున్నాడు.

Advertisement

Also Read : Team India: టీమిండియా ప్లేయ‌ర్ కోసం స‌న్యాసం తీసుకున్న ప్రియురాలు ?

Related News

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

రీ-ఎంట్రీపై ప‌గ‌టి క‌ల‌లు వ‌ద్దు..ఇక‌ రిటైర్మెంట్ ఇచ్చేసి, స‌న్యాసం తీసుకో !

Big Stories

Advertisement
×