E-Paper
Advertisement

Mega 158: గ్యాంగ్ స్టర్ డ్రామాగా మెగా 158..బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!

Mega 158: గ్యాంగ్ స్టర్ డ్రామాగా మెగా 158..బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
Advertisement

Mega 158: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాని 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని ఆలోచనలో చిత్ర బృందం ఉన్నారు. అందుకు అనుగుణంగానే షూటింగ్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం చిరంజీవి(Chiranjeevi) డైరెక్టర్ బాబి(Bobby) దర్శకత్వంలో బిజీ కాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు.

కోలకత్తా బ్యాక్ డ్రాప్…

ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్ చూస్తుంటే ఇది ఒక యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ మరొక అప్డేట్ వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ స్టోరీ డ్రాఫ్ట్ పూర్తయిందని మేకర్స్ వెల్లడించారు. దీనితోపాటు కోల్ కత్తా భాషలో ఒక కోట్ జత చేయడంతో ఈ సినిమా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్ స్టార్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది. ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నారు.

చిరంజీవి సినిమాలో కార్తీ?

Advertisement

ఈ సినిమాకు బాబి దర్శకత్వం వహించగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా మాళవిక నాయర్ నటించబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి కానీ ఈ వార్తలలో నిజం లేదని ఆమె స్పందించారు..ఒకవేళ నిజంగానే చిరంజీవి గారితో నటించే అవకాశం వస్తే తప్పకుండా ఆ అవకాశాన్ని వదులుకోనని వెల్లడించారు. ఇక ఈ సినిమాలో కార్తీక్ కూడా నటించబోతున్నారంటూ రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలు అన్నీ కూడా అవాస్తవమేనని తెలియజేశారు.

గ్యాంగ్ స్టర్ సినిమాగా..

Advertisement

ఇక ఈ సినిమాలో ఇతర నటీనటులు ఎవరు ఏంటి అనే విషయాలు తెలియాలి అంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఇదివరకు బాబి చిరంజీవి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా సక్సెస్ కావడంతోనే చిరు బాబికి మరొక అవకాశం ఇచ్చారు. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ సినిమాగా రాబోతుందనే విషయం తెలిసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరంజీవి ఇప్పటికే విశ్వంభర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలతో పాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నిర్మాణంలో మరో సినిమాకు కూడా చిరంజీవి కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: Varanasi Movie: ప్రమోషన్ల కోసమే రూ.200 కోట్లు.. అసలేం ప్లాన్ చేస్తున్నావ్ జక్కన్న?

Related News

“బస్ డ్రైవర్ కొడుకు.. ఉగ్రవాది కాదు”.. ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన యశ్ తల్లి!

రేర్ పిక్.. గౌతమ్ కి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపిన మహేష్ బాబు!

సెప్టెంబర్ నెలలో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలు.. ఆ 3 డోంట్ మిస్!

రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరోయిన్?

త్వరలో వర్క్ మోడ్ లోకి రష్మిక..కానీ?

వంగీమామ ఇంత త్యాగం చేశారా..? విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్..

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

Big Stories

Advertisement
×