E-Paper
Advertisement

Air India: భారత్ నుంచి చైనాకు నేరుగా విమానాలు.. ఎప్పటి నుంచి అంటే?

Air India: భారత్ నుంచి చైనాకు నేరుగా విమానాలు.. ఎప్పటి నుంచి అంటే?
Advertisement

India-China Flights Resumption: కోవిడ్-19, భారత్-చైనా మధ్య టెన్షన్స్ కారణంగా 2020 నుండి సస్పెండ్ అయిన విమాన సర్వీసులు మళ్లీ పున: ప్రారంభం కాబోతున్నాయి. ఇటీవల డిప్లమటిక్ అగ్రిమెంట్స్ జరిగిన నేపథ్యంలో ఫిబ్రవరి 1, 2026 నుంచి నేరుగా విమాన సర్వీసులు నడవబోతున్నాయి. దాదాపు 6 సంవత్సరాల తర్వాత డైరెక్ట్ ఫ్లైట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ మేరకు ఎయిర్ ఇండియా  విమాన సర్వీసులు నడిపేందుకు రెడీ అవుతోంది. ఇండిగో, చైనా ఈస్టర్న్ లాంటి ఇతర ఎయిర్‌లైన్స్ ఇప్పటికే ఇండియా-చైనా రూట్స్ లో విమానాలు ప్రారంభించాయి. కానీ, నేరుగా నడిపించడం లేదు. ఎయిర్ ఇండియా స్పెసిఫిక్‌ గా షాంఘైకి డైరెక్ట్‌ గా ఫిబ్రవరి నుంచి విమానాలు నడిపించబోతోంది. ఫిబ్రవరి 1 నుంచి ఢిల్లీ-షాంఘై సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి.

వారానికి నాలుగు సర్వీసులు

ఢిల్లీ-షాంఘై విమానాలు వారానికి నాలుగు సార్లు నడుస్తాయని ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ రెండు నగరాల మధ్య సర్వీసుల కోసం తన బోయింగ్ 787-8 విమానాలను ఉపయోగించనున్నట్లు తెలిపింది. ఈ విమానాల్లో బిజినెస్ క్లాస్‌ లో 18 ఫ్లాట్ బెడ్‌లు, ఎకానమీ క్లాస్‌లో 238 విశాలమైన సీట్లు ఉన్నాయని వెల్లడించింది.  రెగ్యులేటరీ అప్రూవల్స్ కు లోబడి, ముంబై-షాంఘై విమానాలను కూడా ప్రవేశపెట్టాలని ఎయిర్ ఇండియా భావిస్తోంది. ఐదు సంవత్సరాల విరామం తర్వాత రెండు వైపులా ఎయిర్ కనెక్టివిటీని పునఃప్రారంభించడానికి ఇరుపక్షాలు అంగీకరించాయంటూ అక్టోబర్ 2, 2025న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటికే విమానాలు నడుపుతున్న ఇండిగో

Advertisement

ఫిబ్రవరి 1 నుంచి ఎయిర్ ఇండియా ఢిల్లీ- షాంఘై నగరాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నప్పటికీ, అక్టోబర్ 26 నుంచే ఇండిగో రెండు దేశాల మధ్య విమానాలను నడుపుతుంది. కోల్‌కతా నుంచి గ్వాంగ్‌ జౌకు ఇండిగో సర్వీసులు నడుపుతుంది. నవంబర్ 10న ఢిల్లీ నుంచి గ్వాంగ్జౌ విమానాలను కూడా ప్రారంభించింది. అటు చైనా వైపు నుంచి, చైనా ఈస్టర్న్ నవంబర్ 9 నుంచి సర్వీసులు ప్రారంభించింది. షాంఘై-ఢిల్లీ నడుమ వీక్లీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎందుకు విమాన సర్వీసులు ఆగిపోయాయంటే?

ఇండియా-చైనా బార్డర్ టెన్షన్స్.. ముఖ్యంగా 2020లో జరిగిన లడాఖ్ క్లాష్, ఆ తర్వాత కోవిడ్ పాండమిక్ కారణంగా విమాన సర్వీసులు సస్పెండ్ అయ్యాయి. SCO సమ్మిట్ తర్వాత అక్టోబర్ 2025న విమాన సర్వీసులు నడిపేందుకు MEA అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిజినెస్, ఎడ్యుకేషన్, హెల్త్‌ కేర్ మధ్య కనెక్టివిటీ పెరగనుంది. ఇండిగో, చైనా ఈస్టర్న్ వంటి ఇతర ఎయిర్‌లైన్స్ ఇప్పటికే ఇండియా-చైనా రూట్స్ లో సర్వీసులు ప్రారంభించాయి. ఎయిర్ ఇండియా స్పెసిఫిక్‌ గా షాంఘైకి డైరెక్ట్‌ గా విమాన సర్వీసులు అందించబోతుంది.

Advertisement

Read Also: ప్రపంచంలోనే అద్భుతమైన రైళ్లు, పట్టాలెక్కాయంటే రైల్వే రూపురేఖలు మారాల్సిందే!

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×