E-Paper
Advertisement

ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన నయనతార.. ఎన్ని కోట్లంటే?

ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసిన నయనతార.. ఎన్ని కోట్లంటే?
Advertisement

Nayanthara: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న నయనతార (Nayanthara) వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో పరిమితులు దాటేసి.. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలలో నటిస్తూ తన ఉనికిని చాటుకోవడమే కాకుండా ఆదాయాన్ని కూడా పెంపొందించుకుంటుంది. ఈ క్రమంలోనే వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న ఈమె.. మరొకవైపు అలా సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు చెన్నైలో ఒక లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసింది అంటూ వార్తలు వస్తున్నాయి. మరి దాని ధర ఎంత ? ఆమె చెన్నైలో ఏ ప్రాంతంలో ఆ ఇల్లు కొనుగోలు చేసింది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసిన నయనతార..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా చెన్నైలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోయెస్ గార్డెన్ (Poes Garden) ఏరియాలో ఏకంగా రూ.40 కోట్ల ఖరీదైన విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్ తో పాటు పలువురు సినీ, రాజకీయ దిగ్గజాలు నివసించే ఈ ఖరీదైన ఏరియాలో ఇప్పుడు నయనతార ఇల్లు కొనుగోలు చేయడం చెన్నై సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

also read:ఫస్ట్ క్రష్ పై స్పందించిన శ్రీముఖి.. ఎవరేమనుకున్నా ఆ ప్రేమ ఎప్పటికీ మారదు అంటూ!

స్టార్ హీరోల ఇళ్ళ పక్కనే..

నిజానికి ఇదే ప్రాంతంలో ఈమెకు ఇల్లు ఉన్నప్పటికీ త్వరలోనే తన కుటుంబంతో కలిసి ఈ సరికొత్త విలాసవంతమైన ఇంట్లోకి గృహప్రవేశం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై నయనతార నుంచి లేదా ఆమె టీం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దశాబ్దాలు గడుస్తున్నా.. చెక్కుచెదరని క్రేజ్ తో అత్యధిక పారితోషకం తీసుకుంటూ ఖరీదైన జీవన శైలితో నిజంగానే లేడీ సూపర్ స్టార్ గా తన సామ్రాజ్యాన్ని ఏలుతోంది నయనతార. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

నయనతార సినిమాలు..

Advertisement

నయనతార ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. అందులో భాగంగానే తాజాగా హాయ్ అనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీతో పాటు మరొకవైపు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ సినిమాలో గంగ అనే ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఇందులో విలన్ మూలాలు ఉన్న లేడీ విలన్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే నయనతారకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ చిత్రాలతో నయనతార ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related News

అఖిల్ సక్సెస్ పై స్పందించిన సుమంత్..

ఇకపై ప్రతి పెళ్లిలో ఈ పాటే మోగాల్సిందే.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వెడ్డింగ్ వైబ్స్!

‘అమరన్’ డైరెక్టర్‌తో ధనుష్ ఊచకోత.. ‘ఓం’ టైటిల్ టీజర్ చూశారా?

వైష్ణవ్ తేజ్ – రీతూ వర్మ పెళ్లికి సాయి దుర్గ తేజ్, తల్లి నో చెప్పారా!

‘చెన్నై లవ్ స్టోరీ’కి రూ.కోటి రూపాయల ఫ్రీ టికెట్లు?ఏంటిది కిరణ్?

ప్రభుత్వాన్ని మోకరిల్లేలా చేశారంటూ సంచలన ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్!

సూర్య సినిమా థియేట్రికల్ రైట్స్ లొల్లి.. అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లకు షాక్!

Big Stories

Advertisement
×