E-Paper
Advertisement

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్

సముద్రం అడుగున గుట్టలుగుట్టలుగా బంగారం… హై-వోల్టేజ్ యాక్షన్ తో దుమ్మురేపే డిజాస్టర్ థ్రిల్లర్
Advertisement

Adventure Thriller: ఓటీటీలో యాక్షన్, క్రైమ్, సస్పెన్స్ సినిమాలు చాలానే వస్తుంటాయి. కానీ సముద్ర గర్భంలో జరిగే కథలు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. అలాంటి సినిమాల్లో ఇప్పటికీ ప్రత్యేకంగా చెప్పుకునే హాలీవుడ్ థ్రిల్లర్ ‘బ్లాక్ సీ’ (Black Sea). నిధి కోసం చేసే అడ్వెంచర్ మాత్రమే ఈ సినిమా కథ కాదు. మనిషిలోని అత్యాశ, నమ్మకం, ద్రోహం… ఇవన్నీ ఒకే జలాంతర్గామిలో బందీ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించే ఉత్కంఠభరితమైన సినిమా. ప్రపంచం నుంచి దూరంగా, సముద్రం అడుగున చిక్కుకుపోయిన కొందరు మనుషులు డబ్బు కోసం ఎంత దూరం వెళ్లారు ? ఈ సినిమాను తెలుగులో చూడొచ్చా ? ఏ ఓటీటీలో ఉంది ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

బ్లాక్ సీ కథలో కెప్టెన్ రాబిన్సన్ అనే వ్యక్తి హీరో. అతనికి 30 ఏళ్లుగా సబ్‌మెరైన్‌లను నడిపిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ అతని ఉద్యోగం పోతుంది. కుటుంబం కూడా దూరం కావడంతో జీవితంపై ఆశలు కోల్పోయిన పరిస్థితిలో ఉంటాడు. అలాంటి సమయంలో అతని జీవితాన్ని మార్చే ఒక రహస్య సమాచారం చెవిన పడుతుంది.

Advertisement

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ జర్మనీకి చెందిన ఒక సబ్‌మెరైన్‌ భారీ ఎత్తున బంగారంతో వెళ్తూ, బ్లాక్ సీలో మునిగిపోయిందని తెలుసుకుంటాడు. ఆ నిధిని వెలికితీస్తే జీవితమే మారిపోతుందని భావించి ఒక ప్రమాదకరమైన మిషన్‌కు సిద్ధమవుతాడు. బంగారం కోసం బయలుదేరిన స్నేహితుల బృందమే తరువాత స్నేహితులుగా మారుతుంది.

ప్రయాణం కోసం పాత రష్యన్ జలాంతర్గామిని సిద్ధం చేస్తాడు రాబిన్సన్. బ్రిటిష్ – రష్యన్ నావికులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. నిధి దొరికిన తర్వాత అందరికీ సమానంగా వాటా ఇస్తానని మాట కూడా ఇస్తాడు. ప్రయాణం మొదట సాఫీగానే సాగుతుంది. కానీ సముద్రం లోతుల్లోకి దిగేకొద్దీ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. బంగారం కోసం వచ్చిన వారిలో అత్యాశ పుడుతుంది. మనుషులు తక్కువైతే వాటా ఎక్కువ అనే ఆలోచన ఒక్కొక్కరిలో పెరుగుతుంది.

Advertisement

అక్కడి నుంచి అసలు ప్రమాదం బయట శత్రువుల వల్ల కాదు… అదే జలాంతర్గామిలో ఉన్న మనుషుల వల్లనే షురూ అవుతుంది. దీంతో ఆ బ్లాక్ సీలో ప్రతి నిమిషం టెన్షన్ పెరుగుతూనే ఉంటుంది. ఒకవైపు జలాంతర్గామి దెబ్బతింటుంది. మరోవైపు బృందంలోని సభ్యులు ఒకరిపై ఒకరు తిరగబడతారు. బయట సముద్రం, లోపల అత్యాశ… ఈ రెండింటి మధ్య రాబిన్సన్ తీసుకునే నిర్ణయాలు కథను సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ గా మారుస్తాయి.

చివరికి బంగారం కోసం వెళ్లిన వాళ్లలో ఎంతమంది తిరిగి పైకి వస్తారు? నిజంగా ఆ నిధి వాళ్లకు దక్కుతుందా ? లేక అత్యాశ అందరినీ నాశనం చేస్తుందా ? అసలు బంగారం ఎవరి చేతికి వెళ్లింది ? రాబిన్సన్ తన మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాడా? అన్నది తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులో మాత్రం లేదు

‘బ్లాక్ సీ’ని దర్శకుడు కెవిన్ మెక్‌డొనాల్డ్ డైరెక్ట్ చేశారు. సముద్ర గర్భంలోని క్లాస్ట్రోఫోబిక్ వాతావరణాన్ని అద్భుతంగా తెరపై చూపించాడు. స్క్రీన్‌ప్లే నెమ్మదిగా మొదలైనా, తర్వాత ప్రతి సన్నివేశం ఉత్కంఠను పెంచుతుంది. ఈ సబ్‌మెరైన్ డిజాస్టర్ అడ్వెంచర్ థ్రిల్లర్ ను చూడాలంటే కాస్త కష్టమే. ఎందుకంటే Apple TVలో సుమారు రూ. 80 నుంచి రూ. 150 వరకు రెంట్ చెల్లిస్తేనే గానీ సినిమాను చూడలేము. 2014లో విడుదలైన ఈ మూవీ ఇంగ్షీషులోనే ఉంది. తెలుగులో మాత్రం అందుబాటులో లేదు.

Read Also: దురదృష్టవంతుడి చేతిలో విశ్వవినాశనాన్ని ఆపే బాధ్యత… మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ సిరీస్

Tags

Related News

పేర్లు తెలిస్తే చాలు చంపే టాలెంట్… స్పైన్ చిల్లింగ్ కొరియన్ హర్రర్ సిరీస్

ఒక్క అమ్మాయి కోసం ఇద్దరబ్బాయిలు… తెలుగులోనే ట్రయాంగిల్ వెబ్ సిరీస్

బాత్రూమ్ లో మందుతో తల్లి మృతి… అనుమానమంతా తండ్రిపైనే… నిమిషానికో ట్విస్ట్ మావా

పోలీస్ అధికారి రాసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?

ప్రాణంగా చూసుకున్న పాపనే చంపి ఫ్రిడ్జ్ లో… తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ సిరీస్

దురదృష్టవంతుడి చేతిలో విశ్వవినాశనాన్ని ఆపే బాధ్యత… మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ కామెడీ సిరీస్

బ్యాచిలర్ పార్టీకని వెళ్ళి దిక్కుతోచని చిక్కుల్లో… కట్ చేస్తే బట్టల్లేకుండా బీచ్ లో

Big Stories

Advertisement
×