SreeMukhi: పటాస్, అదుర్స్ వంటి షోలతో యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన శ్రీముఖి(Sreemukhi).. అద్భుతమైన వాక్చాతుర్యంతో ఎంతోమందిని అభిమానులుగా మార్చుకుంది. ప్రస్తుతం బుల్లితెర క్వీన్ గా దూసుకుపోతున్న సుమ కనకాల(Suma Kanakala)ను సైతం బీట్ చేయగలిగింది అంటే.. ఆమె ఏ రేంజ్ లో అలరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు బుల్లితెర షోలను మొదలుకొని.. వెండితెర సినిమా ఈవెంట్ల వరకు సందడి చేస్తున్న ఈమె.. అవార్డ్స్ వేడుకల్లో కూడా సత్తా చాటుతోంది. తాజాగా ఈమె హరి, ముక్కు అవినాష్ లతో కలిసి ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ కొత్త ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా.. అందులో తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో ప్రతి వారం ఒక కొత్త థీమ్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈవారం ఫ్రెండ్షిప్ థీమ్ తో రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వెండితెర, బుల్లితెర సెలబ్రిటీలు తమ బెస్ట్ ఫ్రెండ్స్ తో హాజరయ్యారు. అంతేకాదు చెన్నై లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) , హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ(Sri Gouri Priya) కూడా ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో గెస్ట్లుగా వచ్చిన శేఖర్ మాస్టర్, సుప్రీత, నవ్య స్వామి తదితరులు తమ మొదటి లవ్ గురించి చెప్పగా.. చివరగా యాంకర్ శ్రీముఖి కూడా తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చింది.
also read:పోలీస్ అధికారి రాసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఏ ఓటీటీలో అంటే?
ఈ సందర్భంగా గెస్ట్ లను , వారి మొదటి ప్రేమ స్టోరీస్ గురించి ఒక్కొక్కరిని అడుగుతూ స్క్రీన్ పై పోస్టర్ ను ప్రదర్శించింది శ్రీముఖి. అందులో భాగంగానే శ్రీముఖి వంతు రాగా.. నిజామాబాద్ లవ్ స్టోరీ అంటూ ఒక పోస్టర్ స్క్రీన్ పై ప్రత్యక్షమైంది. దీనికి శ్రీముఖి మాట్లాడుతూ..” నేను నిజామాబాద్ నుండి తొలిసారి హైదరాబాదు ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ ఫిలిం జులాయి. రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుగుతోంది. ఇక అప్పుడు నేను పక్కకి చూస్తే ఒక అబ్బాయి తల పైకి ఎత్తకుండా రాస్తూనే కూర్చున్నాడు. అయితే కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఏమిటంటే ఆయనే మా శేఖర్ మాస్టర్”. అని శ్రీముఖి చెప్పగానే అక్కడ ఉన్న వాళ్లంతా ఓ అంటూ అరిచేశారు. ఇక వెంటనే శేఖర్ మాస్టర్ అయిన నేనెందుకు రాసుకుంటూ కూర్చుంటాను అని శేఖర్ మాస్టర్ అడగగా.. “నిజం చెబుతున్నాను.. నువ్వు రాసుకుంటున్న మాట వాస్తవం కాకపోయి ఉండొచ్చు కానీ నా తొలిప్రేమ మాత్రం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత శేఖర్ మాస్టర్” అంటూ కామెంట్ చేసింది శ్రీముఖి. మొత్తానికైతే శ్రీముఖి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.