OTT Movie : కేరళలోని ఒక గ్రామంలో, చీకటి గదిలో ఒక యువకుడు ల్యాప్ టాప్‌లో ఒక వీడియోను ఎడిట్ చేస్తుంటాడు. స్క్రీన్ పై ఒక ఆఫ్రికన్ గిరిజన పాట ప్లే అవుతుంది. అది అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే అతని అమ్మమ్మ తన గదిలోనే ఉండి, ఆ పాటను విని గుర్తుపట్టి పాడటం మొదలు పెడుతుంది. ఈ పాట ఆమెకు ఎలా తెలుసు? ఒక దూర ఖండం నుంచి వచ్చిన ఈ పాట, ఈ చిన్న గ్రామంలో ఒక ముసలావిడ నోట ఎలా విన్పించింది ? ఈ రహస్యం ఏంటో తెలియాలంటే ముందుగా మూవీ పేరేంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
ఉన్ని (ఆషిక్ సఫియా అబూబక్కర్), కేరళలోని ఒక చిన్న గ్రామంలో నివసించే స్ట్రగ్లింగ్ వీడియో ఎడిటర్. ఒక ట్రావెల్ వ్లాగ్ ను ఎడిట్ చేస్తున్నప్పుడు కెన్యాలోని ఒక గిరిజన సమూహం పాడిన అరుదైన పాటను కనుగొంటాడు. దాన్ని తన వీడియోకు యాడ్ చేస్తుండగా, ఆశ్చర్యకరంగా అతని అమ్మమ్మ ఆ పాటను విని గుర్తుపట్టి, దాన్ని లిరిక్స్‌తో సహా పాడుతుంది. ఆ పాట ఆమెకు బాగా తెలిసినట్లు కనిపిస్తుంది.
వెంటనే ఉన్ని, తన స్నేహితురాలు అనుపమ (గౌతమి లక్ష్మి గోపన్) సహాయంతో, అమ్మమ్మ పాడిన ఆ పాట వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తాడు. అది ఊహించని విధంగా వైరల్ అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది ఈ పాటను తాము కూడా గుర్తుపట్టినట్లు చెప్పడం, దాని వివిధ వెర్షన్ లు వివిధ భాషలలో ఉన్నాయని తెలియడం ఇంకా షాక్ కు గురి చేస్తుంది. దీంతో ఈ పాట మూలాలను కనుగొనేందుకు ఉన్ని, అనుపమ కేరళలోని వివిధ ప్రాంతాలకు, అలాగే ఇతర ప్రదేశాలకు ప్రయాణం చేస్తారు.
ఈ క్రమంలోనే వాళ్ళు సుమతి టీచర్ (జాస్మిన్ కావ్య), షకుంతల (సూర్య ఎస్ కురుప్), అభిలాష్ అభి (బెన్నీ జాన్) వంటి విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులను కలుస్తారు. వాళ్ళంతా ఈ పాటతో తమకున్న అనుబంధాలను పంచుకుంటారు. ఈ పాట సామాజిక సరిహద్దులను దాటి, వివిధ సంస్కృతులలో ఎలా వ్యాపించిందో, దాని అర్థం ఆకలి, మానవ అనుబంధం వంటి భావనలతో ఎలా ముడిపడి ఉందో కథలో చూపిస్తారు. మాక్యుమెంటరీ ఫార్మాట్‌లో చిత్రీకరించిన ఈ మలయాళ చిత్రంలో కామెడీ, ఎమోషన్స్ కట్టి పడేస్తాయి. ఇంతకీ ఆ సాంగ్ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది? దేశాలే కాదు ఖండాలు దాటి ఎలా ప్రయాణించింది? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
Read Also : అమ్మాయిల నాలుకలు కోసే సైకో… పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో అంటే?
ఇప్పుడు మనం చెప్పుకుంటున్న లేటెస్ట్ మలయాళ మూవీ పేరు ‘Pattth’. 2024లోనే ఓ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితం అయిన ఈ మూవీ జూన్ 6న సైలెంట్ గా, డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం manoramaMAXలో అందుబాటులో ఉంది. IMDbలో ఈ మూవీకి 7.0 రేటింగ్ ఉంది. ఇందులో ఆషిక్ సఫియా అబూబక్కర్, గౌతమి లక్ష్మి గోపన్, జాస్మిన్ కావ్య, సూర్య ఎస్ కురుప్, బెన్నీ జాన్ మెయిన్ లీడ్స్ గా నటించారు. జితిన్ ఇసాక్ థామస్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది.