E-Paper
Advertisement

షూటింగ్ లో జారిపడ్డ బాలకృష్ణ.. హెల్త్ కండిషన్ పై డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ!

షూటింగ్ లో జారిపడ్డ బాలకృష్ణ.. హెల్త్ కండిషన్ పై డైరెక్టర్ గోపీచంద్ క్లారిటీ!
Advertisement

NBK 111: నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ముంబై మాఫియా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమా షూటింగు శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగాల్సిన ఈ సినిమాను సంక్రాంతి కంటే ముందే విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు గోపీచంద్ మలినేని. అందులో భాగంగానే డిసెంబర్ 24న టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా షూటింగును గోపీచంద్ మలినేని వేగంగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.

షూటింగ్లో గాయపడ్డ బాలకృష్ణ..

ఇప్పటికే దాదాపు చాలా బాగా సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్యపై కీలక యాక్షన్ సన్నివేశాలు కాకినాడ పోర్ట్ సమీపంలో చిత్రీకరిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ యాక్షన్ స్టంట్ చేస్తున్న సమయంలో సడన్గా కాలుజారి కింద పడ్డారట. వెంటనే స్పందించిన చిత్ర బృందం దగ్గర్లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కు తరలించగా.. చికిత్స అందించిన వైద్యులు గాయం తాలూకా తీవ్రతను తెలుసుకోవడానికి స్కానింగ్ నిర్వహించగా.. ఆయన కాలికి సర్జరీ అవసరమని తెలిపారట. అయితే ప్రస్తుతం సర్జరీ తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని, ఆ తర్వాతే సినిమా షూటింగ్లో పాల్గొనాలని సూచించినట్లు సమాచారం.

బాలకృష్ణ ఆరోగ్యంపై గోపీచంద్ క్లారిటీ..

Advertisement

మరోవైపు బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై డైరెక్టర్ గోపీచంద్ మలినేని వివరణ ఇస్తూ.. తన ఎక్స్ అధికారిక ఖాతా ద్వారా ఒక పోస్ట్ పంచుకున్నారు. ఈ మేరకు గోపీచంద్ మలినేని.. ” ప్రస్తుతం#NBK 111 సినిమా షూటింగు కాకినాడలో జరుగుతోంది. ఇక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో నందమూరి బాలకృష్ణ సడన్గా కాలుజారి కింద పడ్డారు.. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యులు బాలకృష్ణ కాలికి చిన్న ఎముక విరిగిందని చెప్పారు. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం NBK 111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చింది. ముఖ్యంగా అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాలయ్య త్వరగా కోలుకొని మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ” అంటూ బాలకృష్ణ ఆరోగ్యం పై వివరణ ఇస్తూ గోపీచంద్ క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం చిన్న మైనర్ సర్జరీ అని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

ALSO READ: ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

విడుదల ఆలస్యం అవుతుందా?

Advertisement

NBK 111 సినిమా విషయానికి వస్తే.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న రెండవ చిత్రం ఇది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలయి మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా అనడంతో అంచనాలు పీక్స్ కి చేరిపోయాయి. ఈ సినిమా కూడా వచ్చే సంక్రాంతి టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ముందే స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలని గోపీచంద్ డిసెంబర్ 24న సినిమాను విడుదల చేయాలని గట్టిగా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు సడన్గా బాలయ్యకు ఇలా చిన్నపాటి ప్రమాదం జరగడంతో సినిమా షూటింగు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. తద్వారా సినిమా కూడా విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

Related News

స్మోకింగ్ చేస్తోన్న నయనతార.. మార్పుకు కారణం?

కూతురు టాలీవుడ్ ఎంట్రీపై రవీనా టాండన్ ఏమన్నారంటే?

వారి టార్చర్ వల్లే వదిలేసా -ఐశ్వర్య లక్ష్మీ

యష్ ‘టాక్సిక్’ కథ లీక్..ఆ సెంటిమెంట్ వింటే మైండ్ పోవాల్సిందే!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

రీతూ వర్మ – వైష్ణవ్ తేజ్ మధ్య బ్రేకప్?

జయకృష్ణ సీక్రెట్ లీక్ చేసిన రషా.. ‘శ్రీనివాస మంగాపురం’ సెట్స్‌లో ఏం జరిగిందంటే?

మరో కొత్త సినిమాతో ‘లెనిన్ ‘డైరెక్టర్.. ఒక హిట్.. క్రేజీ హీరోతో ఛాన్స్!

Big Stories

Advertisement
×