Nagarjuna:టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో అగ్ర హీరోలు, సీనియర్ మేకర్స్ సినిమా నిర్మాణంలో జరుగుతున్న లోపాలను బహిరంగంగా వేదికలపైనే ఎండగట్టడం ఒక ట్రెండ్‌గా మారింది. మొన్నటివరకు మెగాస్టార్ చిరంజీవి పలు వేదికలపై క్లాస్ పీకగా, తాజాగా అఖిల్ నటించిన ‘లెనిన్’ సక్సెస్ మీట్ వేదికగా కింగ్ నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చివరి నిమిషం వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులను లాగుతూ, రిలీజ్ రోజు ఉదయం వరకు మిక్సింగ్ థియేటర్ల చుట్టూ తిరిగే పద్ధతిపై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు, విశ్లేషణలు ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో సంచలనం రేపుతున్నాయి.
టాలీవుడ్‌ను ప్రస్తుతం పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య క్వాలిటీ లేకపోవడం కాదు.. పక్కా ప్లానింగ్ లేకపోవడం. రేపు పొద్దున థియేటర్లలో సినిమా రిలీజ్ అనగా, ఈరోజు రాత్రి వరకు ఎడిటింగ్ రూమ్స్, మ్యూజిక్ స్టూడియోలలో ఫైనల్ కరెక్షన్స్ చేస్తూనే ఉంటున్నారు. ఓవర్సీస్ కాపీలు పంపిన తర్వాత కూడా సీన్లు మార్చడం, రీ-రికార్డింగ్ సింక్ కాకపోవడం వల్ల, కంటెంట్ బాగున్నా ఫైనల్ అవుట్‌పుట్ దెబ్బతింటోందని నాగార్జున అన్నారు. దీనివల్ల బడ్జెట్లు పెరిగిపోయి నిర్మాతలు నిలువునా మునుగుతున్నారనేది ఆయన వాదన.
also read:Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!
ఈ సందర్భంగా నాగార్జున హాలీవుడ్ మేకింగ్ స్టైల్‌ను ఉదాహరణగా చూపిస్తూ టాలీవుడ్ మేకర్స్ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు. ఇటీవల విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ ది ఒడిస్సీ ‘ ఏడాది క్రితమే రిలీజ్ డేట్ ప్రకటించి, సరిగ్గా అదే టైమ్‌కి పక్కా క్వాలిటీతో థియేటర్లలోకి వచ్చిందని గుర్తుచేశారు. “మనం ఎందుకు అలా చేయలేకపోతున్నాం? ఒకప్పుడు నెల రోజుల ముందే ఫైనల్ కాపీ రెడీగా ఉండేది. ఇప్పుడెందుకు సాంకేతిక నిపుణులు, దర్శకులు చివరి నిమిషం వరకు టైమ్ వేస్ట్ చేస్తున్నారు?” అని నాగ్ ప్రశ్నించారు.
తన కొడుకు అఖిల్ నటించిన ‘లెనిన్’ సినిమాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో నాగార్జున ఓపెన్‌గా అసహనం వ్యక్తం చేశారు. నిజానికి ఈ సినిమా జూన్ 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ టెక్నికల్ వర్క్ పూర్తి కాకపోవడంతో రెండు వారాల పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. ఫైనల్ చెకింగ్ కోసం రెండు వారాల ముందే కాపీ ఇవ్వమని అడిగినా టీమ్ ఇవ్వలేకపోయిందని, చివరి నిమిషంలో తాను, డైరెక్టర్, ఎడిటర్ కూర్చుని కరెక్షన్స్ చేయాల్సి వచ్చిందని నాగ్ చెప్పారు. వేదికపైనే ఉన్న ప్రముఖ నిర్మాత నాగవంశీ వైపు తిరుగుతూ.. “వంశీ, నీకు కూడా చెప్తున్నా.. ముందే కాపీ రెడీ చేసుకుంటే అందరికీ బాగుంటుంది” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఒక సినిమాకు సంబంధించినవి కావు, మొత్తం టాలీవుడ్ మారాల్సిన అవసరాన్ని గుర్తుచేశాయి. రిలీజ్‌కు కనీసం రెండు వారాల ముందే ఫైనల్ అవుట్‌పుట్ చేతికి వస్తేనే టెక్నికల్ లోపాలు లేకుండా సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. ఇక మరి కింగ్ నాగార్జున ఇచ్చిన ఈ స్ట్రాంగ్ వార్నింగ్‌ను మన టాలీవుడ్ దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు, ఎడిటర్లు సీరియస్‌గా తీసుకుని తమ ప్లానింగ్ మారుస్తారా? లేదా ఎప్పటిలాగే లాస్ట్ మినిట్ రష్‌తో రిస్క్ చేస్తారా అనేది వేచి చూడాలి..