E-Paper
Advertisement

Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్‌లో జీవితం నాశనమే!

Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్‌లో జీవితం నాశనమే!
Advertisement

Gulf Job Scam: గల్ఫ్ లో ఉద్యోగం.. నెలకు దండిగా సంపాదించుకునే అవకాశం.. ఆలసించిన ఆశాభంగం.. అంటూ ఏజెంట్లు చెబుతున్న మాటల మాయలో పడి వేలాదిమంది తెలంగాణ వాసులు దేశంగాని దేశాల్లో నరకం అనుభవిస్తున్నారు. రోజుకు 12నుంచి 15గంటలు పని చేస్తున్నా జీతం చేతికందక పస్తులతో మలమల మాడుతున్నారు. పనిలో పెట్టుకుంటున్నవారు పాస్ పోర్టులు తీసేసుకుంటుండటంతో వెనక్కి రాలేక.. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక పడరాని కష్టాలు పడుతున్నారు. నాలుగు పైసలు సంపాదించి భవిష్యత్తును సురక్షితం చేసుందామన్న ఆశతో వెళ్లి ప్రాణాలతో ఇంటికి చేరుకుంటే అదే పదివేలు అనుకుంటున్నారు.

నిజానికి..

ఉద్యోగార్థులను గల్ఫ్ దేశాలకు పంపించే ఏజెంట్లు.. కన్సల్ టెన్సీ సంస్థలు నిబంధనల ప్రకారం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రొటెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ తమ వివరాలను నమోదు చేసుకోవాలి. అనుమతి వచ్చిన తర్వాతే ఎవ్వరినైనా ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాలకు పంపించాలి. దీనివల్ల ఉద్యోగం కోసం దేశం దాటి పోతున్నవారికి రక్షణ ఉంటుంది. అయితే, గల్ఫ్ జాబ్ ఏజెంట్లుగా పని చేస్తున్నవారిలో 90శాతం మంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే తమ దందా సాగిస్తున్నారు. ఇలాంటివారు తెలంగాణలోని ఒక్కో జిల్లాలో 70నుంచి వంద మందికి పైగానే ఉన్నట్టు ఒక అంచనా.

ఆశే అవకాశంగా..

Advertisement

తాము ఎంత సంపాదించుకుంటున్నాం అన్నట్టుగా వ్యవహారిస్తున్న ఇలాంటి ఏజెంట్లు ప్రధానంగా మధ్య.. దిగువ మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ చాలీచాలని జీతాలకు ఎన్నిరోజులు పని చేస్తారంటూ ఉచ్చులోకి లాగుతున్నారు. నేను చెప్పినట్టు చేస్తే దుబాయ్ లో ఉద్యోగం ఇప్పిస్తా అని నమ్మిస్తున్నారు. డబ్బు లేదంటే అప్పు చెయ్యి.. అక్కడికి వెళ్లాక రెండు నెలల్లో దానిని తీర్చేంత డబ్బు చేతికొస్తుందని చెబుతున్నారు. ఇక్కడ నీ కుటుంబాన్ని బాగు చేసుకోవచ్చు..ఆస్తులు కొనొచ్చని ఊరిస్తున్నారు. వలలో చిక్కుకున్న వారి నుంచి లక్ష నుంచి రెండు లక్షలు దండుకుంటున్నారు.

Also read: హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

ముంబయి ఏజెంట్లతో కలిసి..

Advertisement

ఇలా గుంజుతున్న డబ్బు నుంచి తమ కమీషన్ మినహాయించుకొని మిగతా మొత్తాన్ని ముంబయి ఏజెంట్లకు పంపిస్తున్నారు. నీకోసం రిస్క్ తీసుకొని ముంబయి వాళ్లతో పని చేయిస్తున్నా అని తమకు డబ్బు ఇచ్చినవారితో చెబుతున్నారు. ఇంకొన్ని రోజులే.. నీ లైఫ్ మొత్తం మారిపోతుందంటూ ఆశల పల్లకి ఎక్కిస్తున్నారు.

విజిట్.. టూరిస్ట్ వీసాలతో..

ఇక, ముంబయి ఏజెంట్లు గల్ఫ్ ఉద్యోగం కోసం డబ్బు ఇచ్చినవారి పేరు మీద విజిట్ వీసాలు తయారు చేసి పంపిస్తున్నారు. లోకల్ ఏజెంట్లు వాటిని తమకు డబ్బు ఇచ్చిన వారి చేతుల్లో పెడుతున్నారు. ఫలానా రోజు వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు. అక్కడ దిగగానే ఫలానా వ్యక్తి వచ్చి కలుస్తాడు.. ఉద్యోగంలో పెట్టించటంతోపాటు అన్నీ అతనే చూసుకుంటాడని తెలియచేస్తున్నారు. విజిట్ వీసా..జాబ్ వీసా మధ్య తేడా తెలియని ఎంతోమంది అమాయకంగా దేశంగాని దేశానికి వెళుతున్నారు.

అక్కడికి చేరుకోగానే..

ఉద్యోగం ఆశతో గల్ఫ్ లోని వేర్వేరు దేశాలకు చేరుకుంటున్న వారిని అక్కడి ఏజెంట్లు కలుస్తున్నారు. వెల్ కం అని చెప్పి ఉద్యోగాల్లో పెడుతున్నారు. పురుషులైతే డ్రైవర్లుగా..భవన నిర్మాణ కార్మికులుగా..పశువుల కాపర్లుగా..డ్రైవర్లుగా.. కంప్యూటర్‌ ఆపరేటర్లుగా చేరుస్తున్నారు. మహిళలను ఇళ్లల్లో పనిమనుషులుగా.. చిన్న పిల్లలు.. వృద్దుల కేర్ టేకర్లుగా పనుల్లో చేరుస్తున్నారు.

Also read: ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

అప్పటి నుంచి కష్టాలు షురూ..

అప్పటి నుంచి వెళ్లిన వారికి కష్టాలు మొదలవుతున్నాయి. ఉద్యోగాల్లో పెట్టుకుంటున్నవారు జాబ్ లో చేరక ముందే పాస్ పోర్టు, వీసా తీసేసుకుంటున్నారు. నమ్మకం కోసమే..అడిగినపుడు తిరిగి ఇచ్చేస్తామని చెబుతున్నారు. అ తర్వాత తమ అసలు స్వరూపం చూపిస్తున్నారు. రోజుకు 12నుంచి 15గంటలపాటు గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారు. అదేమని అడిగితే శారీరకంగా వేధిస్తున్నారు. ఇష్టానుసారం కొడుతున్నారు. కనీసం మూడు పూటలు భోజనం కూడా ఇవ్వటం లేదు. ఈ బాధలు భరించలేక మా దేశానికి తిరిగి వెళ్లిపోతామంటే లక్ష నుంచి రెండు లక్షలు డిమాండ్ చేస్తున్నారు. డబ్బు ఇవ్వకపోతే పాస్ పోర్టు ఇవ్వమని చెబుతున్నారు. దేశంగాని దేశంలో ఎవరికీ తమ బాధలు చెప్పుకోవాలో కూడా తెలియక బాధితులు నరకం అనుభవిస్తున్నారు. పోలీసుల వద్దకు వెళదామంటే పాస్ పోర్టు లేదని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న భయంతో ఆ పని కూడా చెయ్యలేక పోతున్నారు.

ప్రభుత్వ చర్యలు..

గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, మోసాలు, వేధింపులపై ఫిర్యాదులు చెయ్యటానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఎవరైనా బాధితులు దృష్టికి వస్తే ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాల సిబ్బంది సహకారంతో స్వదేశానికి రప్పిస్తున్నాయి. అయితే, ఈ సహాయాన్ని పొందుతున్న వారి సంఖ్య స్వల్పంగా ఉంటోంది.

Also Read: రూ. 20 వేల బడ్జెట్‌లో బెస్ట్ వాషింగ్ మెషీన్! మీ ఇంటికి పర్ఫెక్ట్

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

దీనిపై సీనియర్ పోలీస్ అధికారులతో మాట్లాడగా ఇలాంటి మోసాల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు సూచించారు. ఏజెంట్, కన్సల్టెన్సీకి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్’ నుంచి లైసెన్స్ ఉందో లేదో తనిఖీ చేసుకోవాలన్నారు. విజిట్, టూరిస్ట్ వీసాలపై వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. గల్ఫ్ ప్రభుత్వం జారీ చేసిన వర్క్ పర్మిట్ వీసా ఉంటేనే వెళ్లాలని చెప్పారు. ఉద్యోగం ఇస్తున్న కంపెనీ వివరాలు, అక్కడ మీకు లభించే జీతం వివరాలను భారత ప్రభుత్వ ఈమైగ్రేట్ (eMigrate) పోర్టల్ ద్వారా ధృవీకరించుకోవాలన్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ..

ఉద్యోగం, జీతం, పని గంటలు, వసతి, వైద్య సౌకర్యాల వంటి అన్ని వివరాలు స్పష్టంగా ఉన్న అరబిక్ లేదా ఇంగ్లీష్ ఆఫర్ లెటర్‌పై సంతకం చేసి ఒక కాపీని తమ వద్ద ఉంచుకోవాలన్నారు. ఏజెంట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ భారీగా నగదును చేతికి ఇవ్వొద్దని తెలిపారు. ఏవైనా చెల్లింపులు ఉంటే ఈమైగ్రేట్ ద్వారా..లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా మాత్రమే జరిపి రసీదులు భద్రపరుచుకోవాలన్నారు. పాస్‌పోర్ట్, వీసా, ఉద్యోగ ఒప్పంద పత్రాల జిరాక్స్ కాపీలను కుటుంబ సభ్యుల వద్ద పెట్టాలన్నారు.

Also Read: యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

Related News

పాత బంగ్లాలో అర్ధరాత్రి విడిది.. దెయ్యం లేదని నిరూపిస్తే.. రూ.52 వేలు మీవే!

సహారా ఎడారి లేకపోతే అమెజాన్ అడవి ఉండేది కాదా? రెండింటి మధ్య అసలు లింకేంటి?

ఒకప్పుడు పాక్ లో.. ఇప్పుడు ఇండియాలో.. ఈ అందమైన గ్రామం గురించి మీకు తెలుసా?

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

రాత్రిపూట వెలిగే మొక్కలు వచ్చేశాయి.. ‘అవతార్‘ సినిమాలో చూసింది ఇప్పుడు నిజమైంది!

ఈ నదుల్లో నీళ్లే కాదు, బంగారం ప్రవహిస్తుంది.. నిజంగా అద్భుతం!

48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన భార్య.. పచ్చబొట్టు చూసి గుండెలకు హత్తుకున్న భర్త!

Big Stories

Advertisement
×