E-Paper
Advertisement

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్.. కేంద్రం క్లారిటీ, వారే అర్హులు
Advertisement

Old Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌పై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2003 డిసెంబర్ 31 లోగా కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకొన్నవారు అర్హులని తెలిపింది. 2004 తర్వాత వారు ఉద్యోగంలో చేరిన కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఓపీఎస్ ఎంచుకునే అవకాశం కల్పించింది.

ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌పై క్లారిటీ– ఈ వెసులుబాటు NPS సభ్యులకు కాకుండా అర్హతలున్న ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్-DoPPW  గత నెల 22న ఆఫీస్ మెమోరాండం విడుదల చేసింది. 2004 జనవరి  ఒకటి నుంచి  కేంద్రప్రభుత్వంలో చేరిన ఉద్యోగులు అందరికీ నేషనల్ పెన్షన్ సిస్టమ్- NPS అమల్లో ఉంది. 2003లో కారుణ్య నియామకం కోసం చాలామంది అప్లై చేసుకున్నారు.

Advertisement

ఆ ఉద్యోగులు మాత్రమే అర్హులు-అయితే నియామక ప్రక్రియ ఆలస్యం అయ్యింది. వారంతా 2004 తర్వాత ఉద్యోగంలో చేరినవారు NPS పరిధిలోకి వెళ్లిపోయారు. ఈ అంశాన్ని నేషనల్ కౌన్సిల్ స్టాఫ్ సైడ్..  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్- DoPT- డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్‌తో సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత DoPPW దీనిపై స్పష్టత ఇచ్చింది.

ఓ వర్గానికి మాత్రమే ఓపీఎస్-కేంద్రం తీసుకొచ్చిన ఈ వెసులుబాటు కేవలం కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగంలో చేరిన ఓ వర్గానికి మాత్రమే. 2003 డిసెంబర్ 31 లేదా అంతకంటే ముందుగా కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసి ఉండాలి. అప్పటి నుంచి ఉద్యోగానికి అవసరమైన అన్ని అర్హతలు కలిగి ఉండాలి. 2004 జనవరి ఒకటి తర్వాత ఉద్యోగంలో చేరినప్పటికీ దరఖాస్తు తేదీని ప్రాతిపదికగా తీసుకుంది.

Advertisement

దీని ద్వారా సీసీఎస్ రూల్స్-2021 కింద ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ లెక్కన ఉద్యోగంలో చేరిన తేదీ కంటే దరఖాస్తు చేసిన డేట్‌ని పరిగణినలోకి తీసుకున్నారు. దీనిపై కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-CSIR 2026, జులై 7న తన ల్యాబోరేటరీలు, పరిశోధనా సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది.

ALSO READ: ఆభరణాలకు పింక్ పేపరే ఎందుకు? దాని వెనుక ఉన్న రహస్యమేంటి?

అర్హులైన ఉద్యోగులకు ఓపీఎస్ ఆప్షన్ కింద ప్రక్రియ ప్రారంభించాలని సూచన చేసింది. కేంద్రం మార్గదర్శకాలను  అమలు చేసిన తొలి స్వయం ప్రతిపత్తి సీఎస్ఐఆర్.  ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వ  NPS సభ్యులకు ఈ స్కీమ్ వర్తించదు. రెగ్యులర్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాల్లో చేరినవారు, నిర్దిష్ట అర్హతలు లేనివారు ఓపీఎస్ ఎంచుకునే ఛాన్స్ లేదు.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×