E-Paper
Advertisement

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!

బాలయ్యకు గాయం.. NBK 111 రిలీజ్ డౌటేనా? కొరటాల ప్రాజెక్ట్‌పై పడ్డ ఎఫెక్ట్!
Advertisement

NBK 111:సినిమాని ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ లోనే తీసుకురావాలని ఫిక్స్ అయింది NBK111 మేకర్స్. అందుకే సినిమాని కూడా చక చకా పరుగులు పెట్టిస్తున్నారు.ఇక వీలైనంత త్వరగా షూటింగ్ ముగించి, దసరా నాటికి గుమ్మడికాయ కొట్టాలని పక్కా ప్లాన్‌ వేసింది వృద్ది సినిమాస్.మరో వైపు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా తన ‘ఫౌజీ’సినిమాని డిసెంబర్ 3న థియేటర్లలోకి వస్తున్నట్టు అనౌన్స్ చేయడంతో డిసెంబర్ బాక్సాఫీస్ వార్ మాములుగా ఉండదనుకున్నారు అంతా.

డిసెంబర్ లో తీసుకురావడం కష్టమే

Advertisement

కానీ ప్రస్తుతం కాకినాడ పోర్ట్‌లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ లో బాలయ్య గాయపడటం , కాలికి సర్జరీ జరగాల్సి రావడం చూస్తుంటే బాక్సాఫీస్ లెక్కలు మారేలానే ఉన్నాయి.అవును అనుకున్నట్టుగా ఈ సినిమాని డిసెంబర్ లో తీసుకురావడం కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది.

also read :NBK 111:బాబాయ్ కోసం అబ్బాయ్ ఎమోషనల్ మెసేజ్.. జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నాడంటే?

Advertisement

నిజానికి జనవరిలో సంక్రాంతి బరిలో దిగాలని మొదటగా అనుకున్నా ఆ స్లాట్ లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోల సినిమాలు కూడా రేసులో ఉండటం,దాంతో ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం పడే అవకాశం ఉండటంతో రిస్క్ తీసుకోకుండా డిసెంబర్‌లోనే రావడం బెటర్ అనే డిసెంబర్ ఫస్ట్ వీక్ కాని లేదా క్రిస్మస్ కి కాని బరిలోకి దిగితే ఎలా ఉంటుందని మేకర్స్ ప్లాన్ చేసుకున్నట్టు టాక్.

ఏమైనా అప్ డేట్ వదులుతారేమో !

సాధారణంగా ఇలాంటి గాయాలైనప్పుడు నటులు కొన్ని నెలల పాటైనా బెడ్ కి పరిమితమవుతారు.ఇక బాలయ్యకి సర్జరీ అంటే ఇప్పట్లో మునుపటిలా ఫుల్ ఎనర్జీతో షూటింగ్ లో పాల్గొంటాడా అంటే అనుమానమే.ఇక దీని పాటు పట్టాలెక్కాల్సిన కొరటాల శివ సినిమా కూడా మరింత ముందుకు పోస్ట్ పోన్ అయ్యేలానే కనిపిస్తుంది.మొత్తంగా చూస్తె బాలయ్య డిసెంబర్ రేస్ నుండి అవుట్ అయ్యేలానే కనిపిస్తున్నాడు.అయితే ఇప్పటిదాకా మేకర్స్ ఈ డేట్ లపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే వదలలేదు.చూడాలి ముందు ముందు ఏమైనా అప్ డేట్ వదులుతారేమో !

బాలయ్య ఆరోగ్యం కుదుటపడితేనే 

ఇక బాలయ్య-గోపీచంద్ కాంబో విషయానికి వస్తే ‘వీరసింహారెడ్డి’ లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ జోడీ రిపీట్ కావడం, పైగా రామ్ చరణ్ ‘పెద్ది’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్న వృద్ధి సినిమాస్ ఈ NBK 111 సినిమాని నిర్మిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ సినిమాను త్వరగా పూర్తి చేస్తేనే, కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే మాస్ యాక్షన్ డ్రామా త్వరగా సెట్స్ మీదికి వెళ్తుంది.ఏది ఏమైనా ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం కుదుటపడి తిరిగి షూట్‌లో పాల్గొంటే తప్ప, ఈ రేసులో NBK 111 ఎక్కడ నిలుస్తుందనేది క్లారిటీ వచ్చేలా లేదు !

also read :“గెట్ వెల్ సూన్ బాబాయ్” – బాలయ్య ప్రమాదంపై కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్!

Related News

పారడైస్ స్టోరీ ఇదేనా ? ఇదే ఐతే కష్టమే మరి !

కొత్త ఉద్యోగంలో చేరిన రకుల్ ప్రీత్ సింగ్.. వీడియోతో ఊహించని సర్ప్రైజ్!

క్లాప్ బాయ్ నుంచి పాన్ ఇండియా స్టార్..18 ఏళ్ల కెరీర్ పై నాని ఎమోషనల్ పోస్ట్!

కౌన్సిల్ సొమ్ము ఎటు పోయింది? సంచలన ఆరోపణలు చేసిన సి.కళ్యాణ్

రణబాలికి పోటీగా ఆదర్శ కుటుంబం… గెలుపెవరిదో!

మిల్కీ బ్యూటీకి పడిపోయాడా?.. స్టేజ్‌పైనే హీరో చేసిన పని వైరల్

నాని ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..మళ్ళీ వాయిదా దిశగా ప్యారడైజ్!

ఇరుముడి ఊపు తగ్గలేదుగా…మరో రికార్డుపై కన్నేసిన రవితేజ !

Big Stories

Advertisement
×