E-Paper
Advertisement

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్

ఏం సిరీస్ గురూ… మనుషుల్ని చంపి పచ్చి మాంసం నోట్లో కుక్కే కిల్లర్
Advertisement

Crime Thriller Series: సైకో థ్రిల్లర్ సినిమాలంటే ఎలా ఉంటాయి భయ్యా ? ఎప్పుడూ పోలీసులే కదా కిల్లర్ ను వెంటాడి పట్టుకునేది. అలాగే సైకోనే కదా వేటాడి చంపేది. కానీ ఎన్నాళ్ళు ఇదే మూస పద్ధతి ? ఇలాంటి లైన్ తో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి ? ఇక ఈ మేకర్స్ మారరా ? ఇదే జానర్లో ఏదైనా కొత్తగా ట్రై చేయలేరా ?… మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా ? అయితే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. అయితే ఇది మూవీ కాదు, ‘దల్ దల్’ (Daldal) అనే సిరీస్. 2026లోనే వచ్చిన ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ అంతా కథానాయిక రీటా ఫెరీరా చుట్టూనే తిరుగుతుంది. ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో అతి చిన్న వయసులోనే డీసీపీగా బాధ్యతలు చేపట్టిన మహిళ ఆవిడ. మైనర్ బాలికలను వ్యభిచార కూపం నుండి రక్షించి ఒక అడ్వెంచర్ రైడ్ చేస్తుంది. దీని తర్వాత మీడియా ఆమెను ఒక హీరోలా చూపిస్తుంది. కానీ బయటకు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌లా కనిపించినప్పటికీ, రీటా జీవితం వ్యక్తిగతంగా ఒక ఊబి లాంటిది. ఆమె డ్రగ్స్ వ్యసనంతో బాధ పడుతుంటుంది. ఆఫీసులో అమ్మాయి అనే కారణంతో మిగతా వాళ్ళు చూసే చిన్నచూపు, నిశ్చితార్థం ఆగిపోవడంతో అలా తయారవుతుంది. అలాగే చనిపోయిన తన తల్లి ఎప్పుడూ ఆమెకు కనిపిస్తుంటుంది.

Advertisement

అదే సమయంలో ముంబై నగరంలో అత్యంత క్రూరమైన పద్ధతిలో వరుస హత్యలు జరుగుతాయి. కిల్లర్ బాధితులను దారుణంగా హింసించి, వారి మణికట్టు కోసి, నోట్లో వస్తువులను కుక్కి చంపేస్తుంటాడు. విచిత్రం ఏమిటంటే, చనిపోయిన వారంతా సమాజంలో “మంచి వ్యక్తులు”గా గుర్తింపు పొందినవారే. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతను రీటాకు అప్పగిస్తారు. మీడియా ఒత్తిడి ఎక్కువవడంతో రీటా సహోద్యోగి, ఆమె అంటే పడని విక్రమ్ సాథే రంగంలోకి దిగుతాడు. ఇదే టైమ్ లో ఒక డ్రగ్ పెడ్లర్ దొరకడంతో, తన వ్యసనం ఎక్కడ బయట పడుతుందో అని రీటా ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది.

దీన్ని వాడుకుని కమిషనర్ ఆమెను కేసు నుండి తప్పించి, విక్రమ్‌కు బాధ్యతలు ఇస్తాడు. ఇంతలోనే పోలీస్ స్టాఫ్‌లో ఒకరు అదే కిల్లర్ చేతిలో హత్యకు గురవడంతో డిపార్ట్‌మెంట్ పరువు పోతుంది. అధికారం కోల్పోయినప్పటికీ రీటా ఈ కేసును పర్సనల్ గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ హత్యల వెనుక అనితా ఆచార్య, సాజిద్ అనే ఇద్దరు యువకులు ఉన్నారని ఆమె గుర్తిస్తుంది. వాళ్ళకి షాకింగ్ ఫ్లాష్‌బ్యాక్‌ ఉంటుంది.

Advertisement

అందుకే సమాజంలో మంచివారిగా చలామణీ అవుతూ, ఘోరాలు చేసే మృగాలనే ఇప్పుడు ఏరిపారేస్తుంటారు ఈ కిల్లర్స్. మరి ఆ సైకోలకి ఉన్న గతం ఏంటి ? చివరకు రీటా, సాజిద్, అనితల మధ్య జరిగే ఉత్కంఠభరితమైన పోరాటంలో కేసు ఎలా ముగిసింది ? చివరకు రీటా తన మనసులోని ఊబి నుండి ఎలా బయటపడింది ? అనేదే ఈ సిరీస్ లో చూసి తెలుసుకోవాల్సిందే.

తెలుగులోనూ స్ట్రీమింగ్

భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘దల్ దల్’ (Daldal). విష్ ధమిజా రాసిన ‘భేండి బజార్’ నవల ఆధారంగా తెరకెక్కింది. Amazon Prime Videoలో తెలుగు ఆడియోతో 7 ఎపిసోడ్ల సిరీస్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ ఉంది కాబట్టి ఇంకా చూడకపోతే వెంటనే ఒక లుక్కేయండి.

Read Also: సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

Related News

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

80ల నాటి తిరుగుబాటు, నెత్తురోడిన వీధులు… హిస్టరీని షేక్ చేసిన రియల్ ఇన్సిడెంట్స్

Big Stories

Advertisement
×