Nelson Dilipkumar:నెల్సన్..ఇపుడు ఎక్కడా చూసినా ఈ పేరే రీసౌండ్ చేస్తుంది .తలైవా హీరోగా వచ్చిన జైలర్ 1,2 కి డైరెక్టర్ ఈయనే మరి .మొదటి పార్టు ఏకంగా 600 కోట్లు వసూలు చేయడం ,ఇపుడు సీక్వెల్ కూడా ఊహిం చిన దానికి మించి వసూళ్లను కొల్లగొడుతుండటంతో నెల్సన్ పేరు మారుమ్రోగిపోతుంది .ఇక ‘కోలమావు కోకిల’, ‘డాక్టర్’, ‘బీస్ట్’సినిమాలు తీసింది కూడా ఈయనే మరి ఇంతటి స్టార్ డం సాధించిన ఈ క్రేజీ ఫిలిం మేకర్ ఒకప్పుడు ఏం చేసేవారో తెలుసా ..
నెల్సన్ దిలీప్ కుమార్ కి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు .చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడ్డ నెల్సన్ చెన్నైలోని న్యూ కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ చదివారు. చదువు పూర్తయ్యాక విజయ్ టీవీలో అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్‌గా కెరీర్ మొదలుపెట్టారు.టీవీ షోలకు స్క్రిప్టులు రాయడం, కామెడీ టైమింగ్‌ను సెట్ చేయడం, ప్రేక్షకులకు నచ్చేలా ఎపిసోడ్స్ ని డిజైన్ చేయడం ఆయన పని.అయితే నెల్సన్ కేవలం తనకు అప్పగించిన పని చేసుకుని వెళ్లిపోకుండా ఎపిసోడ్స్ ఎలా వస్తున్నాయి,వాటిని ఆడియన్స్ కి నచ్చేలా ఎలా డైరెక్ట్ చేస్తున్నారు ,అసలు దర్శకత్వం అంటే ఏంటి ?అనే విషయాలపై ఫోకస్ పెట్టె వాడట .. అలా స్క్రిప్ట్ రైటర్‌గా మొదలైన ఆయన జర్నీ క్రమంగా దర్శకత్వం పై మనసు పారేసుకుని దర్శకుడిగా మారేదాకా సాగింది .
అలాంటి సమయంలోనే ఆయన పాత స్నేహితుడు, నటుడు శింబుతో ఉన్న ఫ్రెండ్ షిప్ మళ్ళీ కుదిరింది . ఇద్దరికీ స్కూల్ రోజుల నుంచే పరిచయం ఉండటం నెల్సన్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి ఇక . టీవీ ఎపిసోడ్స్ లో నెల్సన్ టాలెంట్ గుర్తించిన శింబు, సినిమాల్లోకి రావాలని ప్రోత్సహించారని తెలుస్తుంది.అలా నెల్సన్‌కు శింబు హీరోగా రూపొందాల్సిన ‘వెట్టై మన్నన్’ సినిమాతో దర్శకుడిగా ఛాన్స్ వచ్చింది,కాని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ఆగిపోయింది .
దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవాలనుకున్న సమయంలోనే ఈ ప్రాజెక్టు ఆగిపోవడం నెల్సన్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి.దీంతో ఆయన మళ్లీ టీవీకి వెళ్లిపోయాడు నెల్సన్ .అయితే విజయ్ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే నెల్సన్‌కు మరో కీలక అవకాశం వచ్చింది. తమిళ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్లకు దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చింది.అలా ఆయనకు, హోస్ట్ కమల్ హాసన్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. ఈ అనుభవం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.అదే సమయంలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ నెల్సన్‌కు ఒక మంచి కథ రాసుకుని వస్తే సినిమా చేసే అవకాశం కల్పిస్తానని ఎంకరేజ్ చేశాడట .
అలా అనిరుధ్ ప్రోత్సహించడంతో నెల్సన్ కొత్త కథ ఒకటి రెడీ చేశాడు.అలా క్రైమ్, కామెడీ అంశాలను కలిపి రూపొందించిన కథే ‘కోలమావు కోకిల’. నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా 2018లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది.తెలుగులో ‘కోకో కోకిల’ పేరుతో వచ్చిన ఈ సినిమా నెల్సన్ కి మంచి పేరు తెచ్చింది.
తర్వాత శివకార్తికేయన్‌తో కలిసి చేసిన ‘డాక్టర్’ సినిమా ఆయన కెరీర్‌లో మరో టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.2021లో క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాతో నెల్సన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ డిజైన్ చేసుకున్నాడు.ఆ తర్వాత విజయ్‌తో చేసిన ‘బీస్ట్’అనే యాక్షన్ ఎంటర్‌టైనర్2022లో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది .అయినప్పటికీ తలైవా ఛాన్స్ ఇవ్వడంతో మిగిలినదంతా హిస్టరీ గా మారిపోయింది .
Also read:‘మంగళవారం’లో పులిరాజు పాత్ర వెనుక ఇంత కథ ఉందా?