E-Paper
Advertisement

చిక్కుల్లో ఫౌజీ సినిమా.. నేతాజీ మనవడు ఏమన్నారంటే?

చిక్కుల్లో ఫౌజీ సినిమా.. నేతాజీ మనవడు ఏమన్నారంటే?
Advertisement

Fauzi Movie:ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రధాన పాత్రలో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా వచ్చే ఏడాది మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందు రాబోతున్న చిత్రం ఫౌజీ. చారిత్రక, దేశభక్తి అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే ఎప్పటికప్పుడు పోస్టర్లతో చిత్ర బృందం సరిపెట్టిందే కానీ సినిమా గ్లింప్స్ ని మాత్రం విడుదల చేయలేదు. కానీ అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుండి ఒక గ్లింప్స్ విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ గ్లింప్స్ కారణంగా ఫౌజీ చిత్రం చిక్కుల్లో పడింది. ఏకంగా నేతాజీ మనవడు రంగంలోకి దిగి హెచ్చరించారు. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.

చిక్కుల్లో పడ్డ ఫౌజీ సినిమా..

అసలు విషయంలోకి వెళ్తే.. ప్రభాస్ బర్తడే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ లో నేతాజీ, హిట్లర్ తో ఉన్న ఒక సన్నివేశాన్ని చూపించారు. దీనిపైనే సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్ర కుమార్ బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో చరిత్రను మార్చి చూపించకూడదు అని ఆయన స్పష్టం చేశారు. నేతాజీ, హిట్లర్ మధ్య జరిగిన సమావేశాన్ని సినిమాలో తప్పుగా చూపించారని, హిట్లర్ తో నేతాజీ సమాన స్థాయిలో మాట్లాడారని, భారత స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు పొందడమే ఆయన లక్ష్యమని వివరించారు. కల్పిత పాత్రను గొప్పగా చూపించేందుకు నేతాజీ స్థాయిని తగ్గించినట్లు ఉండకూడదన్నారు. అంతేకాదు ఈ విషయంలో దర్శకుడు హను రాఘవపూడి , అలాగే చిత్ర బృందం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Advertisement

also read:నామినేషన్ వార్.. అసలైన ఆట మొదలుపెట్టిన గోట్స్!

స్పందించిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేశ్ ప్రసాద్..

ఇదిలా ఉండగా ఈ వివాదంపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అవధేశ్ ప్రసాద్ కూడా స్పందించారు. నేతాజీనీ హిట్లర్ తో పోల్చడం సరికాదు అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రలో కీలక పాత్ర పోషించిన జాతీయ నాయకుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా అభిప్రాయపడ్డారు. మరి ఈ వివాదంపై చిత్ర బృందం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

అసలు వివాదం ఏమిటంటే?

Advertisement

అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? అనే విషయానికి వస్తే.. గ్లింప్స్ లో నేతాజీ పాత్ర ప్రభాస్ పాత్రను ప్రశంసిస్తూ మాట్లాడడం , అతడి వివరాలను హిట్లర్ కి వెల్లడించడం ప్రేక్షకుల్లో అసంతృప్తికి కారణమైంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బెర్లిన్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ నియంత హిట్లర్ తో సమావేశమైన చారిత్రక ఘటనతో ఈ గ్లింప్స్ మొదలవుతుంది. ప్రభాస్ పోషించిన కల్పిత గూడచారి పాత్ర గురించి నేతాజీ ప్రస్తావిస్తారు. బ్రిటిష్ పాలకులకు ఆ గూడచారి ఎలా ఇబ్బందులు సృష్టిస్తాడో వివరిస్తారు. అయితే ఒక కల్పిత హీరోని గొప్పగా చూపించేందుకు నేతాజీ వంటి చారిత్రక వ్యక్తిని ఉపయోగించడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు చారిత్రక వ్యక్తులను కల్పిత కథలలో చూపించే ముందు వారి స్థాయికి తగిన గౌరవం ఇవ్వాలని పలువురు నెటిజన్స్ కూడా సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.

Related News

ఏంటీ.. ఆదర్శ కుటుంబం మూవీలో వెంకటేష్ దొంగా? సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

ప్రాణభయంతో సొంత ఇంటిని అమ్మేసిన టైగర్ ష్రాఫ్.. ఎన్ని కోట్లంటే?

తెలుగు డబ్బింగ్ కి సిద్ధమైన ఒడిస్సా హిట్ మూవీ..ఏదో తెలుసా?

ఘెట్టో కిడ్స్ తో భాగ్య శ్రీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదుర్స్.. వీడియో వైరల్!

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు..

ఏందమ్మా మానస.. సన్‌సెట్‌లోనూ ఇంత అందంగా ఉన్నావేంటి!

అసలు నేను చేసిందేంటి? గరివిడి లక్ష్మి వివాదంపై ఆర్పీ ఆవేదన!

Big Stories

Advertisement
×