E-Paper
Advertisement

చమ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్.. నవ్వుల గ్యారెంటీ! గ్రాండ్‌గా మొదలైన కొత్త చిత్రం!

చమ్మక్ చంద్ర, ఆటో రాంప్రసాద్.. నవ్వుల గ్యారెంటీ! గ్రాండ్‌గా మొదలైన కొత్త చిత్రం!
Advertisement

Han Shiv Entertainments: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న చిత్రాల జోరు మాములుగా లేదు.ఈ క్రమంలోనే ఒక సరికొత్త కథాంశంతో, భారీ తారాగణంతో హన్ శివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1 చిత్రం సోమవారం నాడు ఘనంగా ప్రారంభమైంది. టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో లాంఛనంగా మొదలైంది.

గౌరవ దర్శకత్వం వహించిన ఎస్‌.వి. కృష్ణారెడ్డి 

Advertisement

హైదరాబాద్‌లో జరిగిన ఈ ముహూర్తపు వేడుకకు సినిమా రంగానికి చెందిన దిగ్గజాలు హాజరై చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి క్లాప్ కొట్టగా, వెర్సటైల్ యాక్టర్ అలీ కెమెరా స్విచ్ ఆన్ చేసి టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్ చెప్పారు. లెజెండరీ డైరెక్టర్ ఎస్‌.వి. కృష్ణారెడ్డి ముహూర్తపు షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించడం విశేషం. ఈ వేడుకలో డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి, ఫణి సహా చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని సందడి చేశారు.

also read :పవన్ కళ్యాణ్ ట్వీట్‌కు పూనమ్ కౌర్ దిమ్మతిరిగే కౌంటర్.. వైరల్ అవుతున్న పోస్ట్!

Advertisement

ఆసక్తికరమైన పాత్రలో కనిపించనున్న అలీ 

దర్శకుడు టి.డి. ప్రసాద్ వర్మ మాట్లాడుతూ.. “అనురాగ్ హీరోగా, మహేశ్వరి-జ్యోతి గార్ల నిర్మాణంలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ఈ రోజు మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన ఎస్‌.వి. కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలీ గారు ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తారు.ప్రేక్షకులకి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఒక కొత్త అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది” అని తెలిపారు

హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్న అనురాగ్

ఇక ఈ సినిమా ద్వారా హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతున్న అనురాగ్ మాట్లాడుతూ ప్రసాద్ వర్మ గారు చెప్పిన లైన్ వినగానే చాలా థ్రిల్లింగ్‌గా అనిపించిందని, ఇందులో తన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పుకొచ్చారు .ఇక సీనియర్ నటుడు అలీ మాట్లాడుతూ హన్ శివ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వస్తున్న ఈ తొలి ప్రయత్నం పెద్ద సక్సెస్ కావాలని, దర్శకుడు ప్రసాద్ వర్మ క్లారిటీతో ఉన్నారని, తన పాత్ర ప్రేక్షకులను మెప్పిస్తుందని తెలిపారు.

త్వరలోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్

ఇక సినిమా విషయానికి వస్తే అనురాగ్‌, సంతోష్‌, సాయి విక్రాంత్, అలీ, చ‌మ్మ‌క్ చంద్ర‌, ఆటో రాంప్ర‌సాద్‌, ఫ‌ణి, వినీత రెడ్డి మొదలైన వారు ఈ సినిమాలో నటిస్తున్నారు.ఎన్‌.మ‌హేశ్వ‌రి, పి.జ్యోతి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ దర్శకత్వం వహిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నామని, త్వరలోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్, ఫస్ట్ లుక్ అప్‌డేట్స్ ఇస్తామని నిర్మాతలు తెలిపారు. ఇక కామెడీకి పెద్ద పీట వేయబోతున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనుందని సమాచారం.

also read :‘కార్పెంటర్’ గా బాలయ్య మెప్పిస్తాడా? లేక ‘ఆచార్య’ లాగే ముంచేస్తాడా?

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×