Poonam Attack : పవన్ కళ్యాణ్ పై పూనమ్ కౌర్ చేస్తున్న డిజిటల్ ఎటాక్స్ ఇప్పట్లో ఆగేలా లేవు.అయితే ఇన్ని రోజులు ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేసుకొచ్చిన పూనమ్ ఇపుడు డైరెక్ట్ గానే ఎటాక్ చేయడం గమనార్హం. విషయంలోకి వెళ్తే… అన్నమయ్య జిల్లాకు చెందిన షానవాజ్ అనే మహిళ ఈ మధ్య ఒమన్ దేశంలో చిక్కుపోయి సహాయం కోసం అర్దించింది.దీంతో ఆంద్రప్రదేశ్ సర్కార్ మరియు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కలిసి సేఫ్ గా షానవాజ్ ని ఇండియాకి తీసుకొచ్చారు.దీంతో ఆమె ap డిప్యూటీ సీయం అయిన పవన్ కి కృతజ్ఞత చెప్పింది.దీనిపై పవన్ రియాక్ట్ అవుతూ “ప్రపంచంలో ఎక్కడ ఏ తెలుగు వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నా మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతీయుల భద్రతే మా ప్రాధాన్యత” అంటూ పోస్ట్ పెట్టారు.దీంతో ఈ పోస్ట్ పైనే ఇపుడు తన దైన శైలిలో రియాక్ట్ అయింది పూనమ్.అయితే కారణాలు ఏంటో తెలీదు కాని పూనం పెట్టిన పోస్ట్ ఉన్నపళంగా మాయం అవడం ఇక్కడ గమనార్హం.
A few days ago, Smt Shanawaz garu, a native of Vayalpadu in Annamayya district, shared a heartfelt video seeking help to return safely to India from Oman after facing serious difficulties there. After this issue came to my notice, I requested the Ministry of External Affairs… pic.twitter.com/U6N9xAYlev
— Pawan Kalyan (@PawanKalyan) May 8, 2026
ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఎందుకు
‘సోషల్ మీడియాలో కనిపించే మాటల్లో దేన్నీ నమ్మకండి. ఈ విజువల్ హంగులన్నీ కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికే. ఒకవేళ నిజంగానే సహాయం చేస్తే మంచిదే.. కానీ, సుగాలి ప్రీతి తల్లికి ఇచ్చిన మాటను ముందుగా నెరవేర్చాలి. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి.”అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పోస్ట్ పెట్టింది.సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని అప్పట్లో పవన్ హామీ ఇచ్చారని, అది నెరవేర్చకుండా ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఎందుకు అంటూ డైరెక్ట్ గా ప్రశ్నించడం ఇపుడు వైరల్ అవుతుంది.
also read :‘గేట్లు మూయండిరా’.. నాగ్ 100వ సినిమా లీక్డ్ సీన్స్ చూశారా?
అసలేం జరిగిందంటే
నిజానికి కర్నూలులో జరిగిన సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది.2017లో కర్నూలులోని ఒక ప్రైవేట్ స్కూల్ లో సుగాలి ప్రీతి అనే స్టూడెంట్ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.అయితే మొదట్లో ఇది ఆత్మహత్య గానే అనుకున్నప్పటికీ,తర్వాత ఆమెని రేప్ చేసి చంపేశారని ఆమె పేరెంట్స్ , స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఆరోపించారు.దీంతో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ పవన్ అప్పట్లో హడావిడి చేయడంతో ఇష్యూ కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది.అయితే కూటమి అధికారంలోకి సెప్టెంబర్ 26, 2025న ఈ కేసును CBIకి అప్పగిస్తూ అఫీషియల్ గా ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఇంకా మాట నెరవేర్చాలని పూనమ్ వాయిస్ రైజ్ చేయడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
గత ఏడెనిమిదేళ్లుగా సాగుతున్న మిస్టరీ
ఇక పూనమ్ – పవన్ మధ్య మొదలైన పంచాయితీ ఇప్పటిది కాదు.సీరియల్ గా గత ఏడెనిమిదేళ్లుగా సాగుతున్న మిస్టరీనే. ఇక అడపా దడపా పూనమ్ కౌర్ తన ట్వీట్లలో రెగ్యులర్ గా ‘గురూజీ’ (దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని టాక్)పై ఇన్ డైరెక్ట్ గా ఎదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది.తన జీవితాన్ని, కెరీర్‌ను ఆ వ్యక్తి నాశనం చేశారని, పవన్ కళ్యాణ్ అతడిని వెనకేసుకొస్తున్నారని ఆమె ఆరోపణ. మరి ఇందులో ఎంతవరకు నిజముందో వారిలో ఎవరైనా బయటపడితే కాని తెలీదు.
ఈ పంచాయితీ ఎటు వైపు దారి తీస్తుందో
ఇక పూనమ్ – పవన్ ఇష్యూని అపోజిషన్ పొలిటికల్ గా వాడుకోవడం తెల్సిందే.అయితే చాలా కాలంగా సైలెంట్ గా ఉన్న పూనమ్ మళ్ళీ ఈ మధ్య సెన్సేషన్ పోస్ట్స్ పెట్టడం మొదలెట్టింది.ఇక ఆపదలో ఉన్న మహిళని కాపాడితే ఇలా హంగు ఆర్భాటాలు అనడం ఎంతవరకు కరెక్ట్ అని ప్యాన్స్ క్వశ్చన్ చేస్తుంటే, న్యాయం చేస్తానన్న సుగాలి ప్రీతి కేసులో పవన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారంటూ మరికొంత మంది లాజిక్ లు తీసే పనిలో పడ్డారు. చూడాలి మరి ముందు ముందు ఈ పంచాయితీ ఎటు వైపు దారి తీస్తుందో !
also read :రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మానియా.. 50 డేస్.. అన్‌స్టాపబుల్ రికార్డ్స్!