Nidhhi Agerwal-Shivaji: నటుడు శివాజీ కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన క్షమాపణలు చెప్పిన ఈ వివాదం మాత్రం సద్దుమనగడం లేదు. హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంలో తన స్టేట్మెంట్ తప్పు కాదని, ఆ సమయంలో వాడిన రెండు పదాలకు మాత్రమే తాను క్షమాపణలు కోరుతున్నట్టు శివాజీ స్పష్టం చేశాడు. అంతేకాదు తన వ్యాఖ్యలకు కూడా ఆయన వివరణ ఇచ్చాడు. బుధవారం జరిగిన దండోర మూవీ ప్రెస్ మీట్ పాల్గొన్న తను అలా మాట్లాడానికి కారణం చెప్పాడు. లులూ మాల్లో హీరోయిన్ నిధి అగర్వాల్ పడిన ఇబ్బంది, ఆవేదనని చూసే తాను అలా మాట్లాడానన్నాడు.
తనపై అంతమంది ఎగబడుతూ తీవ్ర ఇబ్బంది పెట్టారని, ఆ సంఘటన వల్ల నిధి అగర్వాల్ ఎంతో అవమానంగా ఫీల్ అయ్యారని, ఆ సంఘటన తనని ఎంతో ప్రభావం చేసిందన్నాడు. ఆ తర్వాత వెంటనే సమంత సంఘటన కూడా జరగడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్లో తాను అలా మాట్లాడాల్సి వచ్చిందన్నాడు. అంతేకాదు తన వ్యాఖ్యలను మరింత సమర్థించుకుంటూ నిధి అగర్వాల్ డ్రెస్‌పై కూడా కామెంట్స్ చేశాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి డ్రెస్ గానీ జారిపోయి ఉంటే అసలేం జరిగేది.. జీవితాంతం ఆ వీడియోలు ఉంటాయి.. అవి చూస్తూ తనేంత మానసిక వేదన అనుభవించేదంటూ సింపతీ కార్డు వాడాడు.
అయితే శివాజీ చేసిన ఈ కామెంట్స్ అనంతరం నిధి అగ్వాల్ ఓ పోస్ట్ షేర్ చేశారు. తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో తన ఫోటోని షేర్ చేస్తూ దానికి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. ‘బాధితురాలిని నిందిస్తూ సానుభూతి పొందడం కరెక్ట్ కాదు. దీనినే మానిపులేషన్ అని పిలుస్తారు‘ అని రాసుకొచ్చింది. ఇక ఆమె పోస్ట్ చూసి ఇది శివాజీ కౌంటర్లా ఉందని అంతా అభిప్రాయపడుతున్నారు. శివాజీని ఉద్దేశించే నిధి ఈ పోస్ట్ పెట్టింది, ఆయనపై వచ్చిన నెగిటివిటీ పొగొట్టుకోవడానికి తన సంఘటనను వాడుకుంటున్నారని పరోక్షంగా ఆమె చెప్పిందంటున్నారు. ఈ కామెంట్స్ అనంతరం నెటిజన్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిధి అగర్వాల్ డ్రెస్ గురించి ఆయన అలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ అభిప్రాయం తెలుపుతున్నారు.
Also Read: Anasuya Vs Shivaji: మీకు నిజంగా దమ్ముంటే.. ఇలా చెప్పండి.. శీవాజీ అనసూయ రీకౌంటర్
ఇక ఈ వివాదం కాస్తా శివాజీ వర్సెస్ అనసూయ అన్నట్టు మారింది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. తాజాగా అనసూయ శివాజీ వ్యాఖ్యలపై ధ్వజమెత్తింది. అనసూయ రూణం తీర్చుకునే అవకాశం కోసం దేవుడిని ప్రార్థిస్తాను అన్న వ్యాఖ్యలపై అనసూయ స్పందిస్తూ.. నాకు మీ సపోర్టు ఏం అవసరం లేదు.. నాకు దూరంగా ఉండండి అదే నాకు ఆనందమంటూ కౌంటర్ ఇచ్చింది. అలాగే అమ్మా, నాన్న .. బుచ్చి అంటున్న మీరు.. బయటకు సింపతి పొందుతున్నారు.. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలా మాట్లాడారో అదే మీ నిజస్వరూపమంటూ శివాజీపై భగ్గుమంది. ఇలా ఆడవాళ్ల దుస్తులపై నీచపు కామెంట్స్ చేయడం మీ చేతకాని తనానికి నిదర్శనమని, నిజంగా హీరోయిన్ల సేఫ్టి గురించి ఆలోచించేవారు.. ఇలా మాట్లాడరంటూ శివాజీపై మండిపడింది.