Hero Destini Prime Scooter: హీరో మోటోకార్ప్ నుంచి వచ్చిన చౌకైన స్కూటర్ హీరో డెస్టినీ ప్రైమ్(Hero Destini Prime). 125cc ఫ్యామిలీ స్కూటర్ గా మార్కెట్లోకి అడుగు పెట్టి మంచి ఆదరణ దక్కించుకుంటుంది. బడ్జెట్ కస్టమర్లకు ఐడియల్ ఛాయిస్ గా మారింది. మంచి మైలేజ్, ప్రాక్టికల్ ఫీచర్లు, విశ్వసనీయతకు కేరాఫ్ గా నిలుస్తోంది.
హీరో డెస్టినీ ప్రైమ్ బేస్ వేరియంట్ (స్టాండర్డ్) ధర రూ. 71,499 నుంచి రూ.74,199 వేలు పలుకుతుంది. ఆన్ రోడ్ ధర రూ. డిల్లీలో సుమారు రూ.82,000- రూ.85,000 (RTO + ఇన్సూరెన్స్‌తో) వరకు ఉంటుంది. ఆయా రాష్ట్రాలను బట్టి ధర మారే అవకాశం ఉంటుంది.
హీరో డెస్టినీ ప్రైమ్ 124.6 cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్, BS6 Phase 2B కంప్లయింట్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. 9 bhp @ 7000 rpm పవర్, 10.36-10.38 Nm @ 5500 rpm టార్క్ ను అందిస్తుంది. CVT ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది. టాప్ స్పీడ్ 85 kmph. సిటీ డ్రైవింగ్‌కు స్మూత్, పెప్పీ గా ఉంటుంది.
ARAI క్లెయిమ్ ప్రకారం 56 kmpl మైలేజ్ ఇస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ 5 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. ఫుల్ ట్యాంక్ తో సుమారు 250-280 km రేంజ్ లభిస్తుంది.
i3S టెక్నాలజీ, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, USB మొబైల్ చార్జింగ్ పోర్ట్ తో వస్తుంది. బూట్ ల్యాంప్, అండర్ సీట్ స్టోరేజ్ తో వస్తుంది. LED గైడ్ ల్యాంప్స్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ తో వస్తుంది. ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ ను కలిగి ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే.. పెర్ల్ సిల్వర్ వైట్, నోబెల్ రెడ్, మెటాలిక్ నెక్సస్ బ్లూ, మ్యాట్ బ్లాక్ తో వస్తుంది.

సరసమైన ధరలో 125cc పవర్, ఫీచర్లు. మంచి మైలేజ్, లో మెయింటెనెన్స్. ఫ్యామిలీ కంఫర్ట్, స్పేషియస్ సీట్, స్మూత్ రైడ్. చాలా పెద్ద సర్వీస్ నెట్వర్క్.
Read Also: 60 ఏళ్ల కిందట అంబాసిడర్ కారు ధర ఇంతేనా? ఆ రేటుతో ఇప్పుడు టైరు కూడా రాదు!
హెడ్‌లైట్ హాలోజన్ (LED కాదు). స్టీల్ వీల్స్ (అల్లాయ్ కాదు). డిస్క్ బ్రేక్ ఆప్షన్ లేదు.
సిటీ కమ్యూటింగ్, ఫ్యామిలీ యూజ్‌కు బెస్ట్ ఆప్షన్. Honda Activa 125, TVS Jupiter 125కు మంచి ఆల్టర్నేటివ్. హీరో డెస్టినీ ప్రైమ్.. వాల్యూ ఫర్ మనీ స్కూటర్!
Read Also: మోస్ట్ పాపులర్ ఇండియన్ మేడ్ వింటేజ్ కార్లు, ఒక్కోదాని ప్రత్యేకత ఏంటో తెలుసా?