E-Paper
Advertisement

Niharika Konidela: బాబాయ్‌కి పోటీగా వస్తోన్న నిహారిక.. అంత ధైర్యమేంటో?

Niharika Konidela: బాబాయ్‌కి పోటీగా వస్తోన్న నిహారిక.. అంత ధైర్యమేంటో?
Advertisement

Niharika Konidela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) సినిమా వస్తుందంటే చాలు, అప్పటి వరకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చిత్రాలు కూడా వాయిదా పడతాయి. ఎందుకంటే, పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన క్రేజేంటో లాస్ట్ ఇయర్ వచ్చిన ‘ఓజీ’ (OG) చిత్రం మరోసారి తెలియజేసింది. ‘ఓజీ’ థియేటర్లలో కలెక్షన్ల సునామీ‌ని చూపించి, రికార్డులను క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ ప్లాప్ సినిమా కూడా మొదటి వారం బీభత్సంగా కలెక్షన్స్‌ను రాబడుతుంది. అలాంటి క్రేజ్ ఉన్న హీరో చిత్రానికి పోటీగా, ఇప్పుడో చిన్న సినిమా సవాల్ విసిరేందుకు సిద్ధమవుతోంది. ఆ సినిమా నిర్మాత ఎవరో కాదు.. స్వయానా పవన్ కళ్యాణ్ అన్న కుమార్తె మెగా డాటర్ నిహారిక (Niharika Konidela). అవును, నిహారిక నిర్మాతగా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో కలిసి పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై నిర్మిస్తోన్న ‘రాకాస’ (Raakaasaa) చిత్రాన్ని, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు పోటీగా దించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది.

Also Read- Mrithyunjay: శ్రీవిష్ణు ‘మృత్యుంజ‌య్‌’ విడుదల తేదీ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

‘ఉస్తాద్ భగత్ సింగ్’‌కు పోటీగా..

Advertisement

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మార్చి 26న విడుదల అంటూ మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 27న రావాల్సిన రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం వాయిదా పడటంతో ఆ స్లాట్‌లో పవన్ కళ్యాణ్‌ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ చిత్రమంటే విడుదలకు ఒక వారం ముందు, అలాగే విడుదలైన ఒక వారం తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంటే మాత్రం విడుదల తర్వాత దాదాపు రెండు వారాల పాటు ఇతర ఏ సినిమా కూడా కనిపించనంతగా డామినేషన్ ఉంటుంది. అలాంటిది, పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైన వారానికే నిహారిక తన ‘రాకాస’ను బరిలోకి దింపుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

Also Read- Daggubati Family: అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం.. దగ్గుబాటి ఫ్యామిలీ స్ట్రాంగ్ వార్నింగ్!

నిహారిక స్కెచ్ ఏంటి?

Advertisement

‘రాకాస’ చిత్రాన్ని ఏప్రిల్ 3న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా తెలియజేశారు. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల‌తో న‌టుడిగా మెప్పించిన సంగీత్ శోభ‌న్ తొలిసారి సోలో హీరోగా ఇందులో న‌టిస్తున్నారు. మాన‌స శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ ఖంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, సినిమాపై మంచి అంచనాలు ఏర్పడేలా చేసింది. మరి ఇలాంటి చిత్రాన్ని పవన్ కళ్యాణ్‌కు పోటీగా కాకుండా కాస్త టైమ్ చూసుకుని విడుదల చేసి ఉంటే, మంచిగా కలెక్షన్స్ రాబట్టేది. అలా కాకుండా, పోటీగానే ఎందుకు దించాలని నిహారిక భావిస్తుందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక విడుదల తేదీ అంటూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో సంగీత్ చేతిలో కాగ‌డా ప‌ట్టుకుని చీక‌టిలో దేనినో వెతుకుతున్నాడు. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి ఈ రిలీజ్ వెనుక నిహారిక స్కెచ్ ఏంటో చూడాలి..

Also Read- Gunasekhar: మళ్లీ జన్మంటూ ఉంటే అలా పుట్టకూడదు.. గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్!

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×