E-Paper
Advertisement

Mrithyunjay: శ్రీవిష్ణు ‘మృత్యుంజ‌య్‌’ విడుదల తేదీ ఫిక్సయింది.. ఎప్పుడంటే?

Mrithyunjay: శ్రీవిష్ణు ‘మృత్యుంజ‌య్‌’ విడుదల తేదీ ఫిక్సయింది.. ఎప్పుడంటే?
Advertisement

Mrithyunjay: టాలీవుడ్‌లో కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా పేరునున్న శ్రీవిష్ణు (Sree Vishnu) నుంచి మరో వైవిధ్యమైన చిత్రం వచ్చేందుకు సిద్ధమైంది. ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ.. తనకంటూ ఓ మంచి గుర్తింపును, ఇమేజ్‌ను సొంతం చేసుకున్న శ్రీవిష్ణు.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. సంక్రాంతికి వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari) చిత్రంలో కూడా ఆయన మెరిశారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న ‘మృత్యుంజయ్’ (Mrithyunjay) మూవీకి సంబంధించి సడెన్ అప్డేట్ వచ్చేసింది. ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’ చిత్రాల వాయిదాలతో సినిమా రిలీజ్ డేట్స్ విషయాలలో భారీగా ఛేంజెస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుపుతూ, అందుకు సంబంధించిన పోస్టర్‌ను మేక‌ర్స్ విడుదల చేశారు.

Also Read- Sonu Sood: సోనూసూద్ మరో షాకింగ్ పోస్ట్.. ఈసారి ఎవరికంటే?

రెండు చేతులూ కట్టుకుని..

Advertisement

ఈ పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. పేప‌ర్ల‌తో నిండిన రోడ్డుపై శ్రీవిష్ణు నిలబడి ఉన్నారు. సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా పోస్టర్‌ని విజువల్ ఉంది. కొన్ని పేపర్లు గాలిలో ఎగిరిపడుతుండగా, శ్రీవిష్ణు మాత్రం ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి, రెండు చేతులూ కట్టుకుని నిలబడి ఏదో చెబుతున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే కచ్చితంగా శ్రీవిష్ణు ఏదో డిఫరెంట్ కథని చెప్పబోతున్నారనే విషయం అర్థమవుతోంది. మేకర్స్ కూడా ఉత్కంఠ‌ భ‌రిత‌మైన క‌థాంశంతో ‘మృత్యుంజయ్’ మూవీ రూపొందుతున్నట్లుగా చెబుతున్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఆ పరిస్థితులను తన సినిమాకు అనుగుణంగా మార్చుకోవడంలో శ్రీవిష్ణు సిద్ధహస్తుడు. ఆయన జడ్జిమెంట్ ఒకటీ ఆరా చిత్రాల విషయంలో మిస్సయిందేమో గానీ, చాలా వరకు సక్సెస్ అయ్యాయి. సినిమా ఎలా ఉన్నా, నిర్మాతకు మాత్రం ఆయన చిత్రాలు లాస్ రానివ్వవు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ వస్తేగానీ, అసలు ఈ సినిమా ఏంటనేది తెలియదు. రిలీజ్ డేట్ ప్రకటించారు కాబట్టి, ప్రమోషన్స్ విషయంలోనూ మేకర్స్ జోరు పెంచనున్నారు.

Also Read- Daggubati Family: అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటాం.. దగ్గుబాటి ఫ్యామిలీ స్ట్రాంగ్ వార్నింగ్!

‘సామజవరగమన’ పెయిర్..

Advertisement

ఇక ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌ చిత్రం హుస్సేన్ షా కిర‌ణ్ (Hussain Sha Kiran) ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోంది. ర‌మ్య గున్నం స‌మ‌ర్ప‌ణ‌లో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత మరోసారి శ్రీవిష్ణు, రేబా జాన్ జంటగా నటిస్తున్నారు. శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాల భైర‌వ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. చూద్దాం మరి.. ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్‌ని శ్రీవిష్ణుకు ఇస్తుందో..

Also Read- Allu Sirish: కాబోయే భార్యపై అల్లు శిరీష్ ముద్దుల వర్షం.. క్యూట్ వీడియో షేర్ చేసిన శిరీష్!

Related News

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

యాంకర్ గా స్రవంతి ఉంటే సినిమా హిట్టే.. డైరెక్టర్ ప్రశంశలు..సుమ క్రేజ్ తగ్గిందా?

లెనిన్ హిట్.. మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన భాగ్య శ్రీ?

మధ్యం మానేశాను.. హృదయ విదారకమైన బాధ అంటున్న కొండన్న!

Big Stories

Advertisement
×