E-Paper
Advertisement

నిహారిక డ్రీమ్.. గొప్ప మనసుకి ఫ్యాన్స్ ఫిదా!

నిహారిక డ్రీమ్.. గొప్ప మనసుకి ఫ్యాన్స్ ఫిదా!

Niharika: మెగా డాటర్ నిహారిక గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. హీరోయిన్గా ఇండస్ట్రీలో సత్తా చాటాలని ఎన్నో కలలు కంది. పైగా మెగా హీరోయిన్ అనిపించుకోవాలని పరితపించింది. కానీ కాలం కలిసి రాలేదు. దాంతో తన రూటు మార్చుకుంది నిహారిక. యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత నటిగా కొన్ని చిత్రాలు చేసిన ఈమె.. ఆ తర్వాత నిర్మాతగా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. దీని ద్వారా పలు చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ముఖ్యంగా నటీనటులతో , వారి స్టార్ స్టేటస్ తో సంబంధం లేకుండా చిన్న నటీనటులతో సినిమాలు చేస్తూ సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది నిహారిక. అందులో భాగంగానే కమిటీ కుర్రోళ్ళు అనే చిత్రం నిర్మించి, నిర్మాతగా సక్సెస్ఫుల్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ద్వారా ఏకంగా 15 మంది కొత్త వాళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.

వీఎఫ్ఎక్స్ విషయంలో జాగ్రత్తలు చెప్పారు..

ఇక ఇప్పుడు రాకాస అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సభ వేదికగా తన డ్రీమ్ ను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది నిహారిక. ఈమె కోరిక బయటపడటంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈమె కోరికకు ఫిదా అవుతున్నారు. ఇకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నిహారిక మాట్లాడుతూ..” కొణిదెల ఫ్యామిలీ నాకు ఎంత ముఖ్యమో.. నా బ్యానర్ పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యం. పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీని చూస్తుంటే నాకు అమ్మ అనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా నాకు వీఎఫ్ఎక్స్ గురించి ఏమీ తెలియదు. రాకాసా స్టోరీ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తుంటేనే చాలామంది చెప్పారు. పెద్దపెద్ద సినిమా మేకర్స్ వీఎఫ్ఎక్స్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. మీది చాలా చిన్న సినిమా.. బడ్జెట్ కూడా చాలా తక్కువ. ఇబ్బంది పడతారు.. జాగ్రత్త” అంటూ చాలామంది కామెంట్లు చేశారు.

నా డ్రీమ్ అదే – నిహారిక

అయితే మేము మాత్రం మాకు తెలిసినంత 100% కష్టపడతాము.. జనాల్లోకి ఒక మంచి సినిమాను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాము.. ఇంటింటికి వెళ్లి మా సినిమా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము . అంతేకాదు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో భాగమైన ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు, కారు ఉండాలి. వాళ్లు తమ ఫ్యామిలీస్ తో ట్రిప్స్ కి వెళ్తూనే ఉండాలి. అదే నా డ్రీమ్.. నా డ్రీమ్ నెరవేరే వరకు నేను ఈ నిర్మాణ సంస్థ ద్వారా కష్టపడుతూనే ఉంటాను” అంటూ నిహారిక కామెంట్లు చేసింది. మొత్తానికైతే తన పింక్ ఎలిఫెంట్ బ్యానర్ లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి గురించి చక్కగా ఆమె ఆలోచిస్తుండడంతో అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు.

ALSO READ:క్యాస్టింగ్ కౌచ్ పై ప్రముఖ నటి షాకింగ్ కామెంట్!

రాకాస సినిమా..

రాకాస సినిమా విషయానికి వస్తే.. మానస శర్మ దర్శకత్వంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ , గెటప్ శ్రీను, అమన్ , అన్నపూర్ణ, రమణ భార్గవ్, జబర్దస్త్ రోహిణి, 90 ఫేమ్ రోహన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. చాలా నమ్మకంతో మళ్ళీ ప్రేక్షకుల మనసులు దోచుకోవడానికి ఆడియన్స్ ముందుకు వస్తున్న నిహారిక.. ఈ సినిమాతో ఇంకెలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

Related News

అర్ధరాత్రి ఆ వీడియో డిలీట్ చేయడానికి కారణం అదే….. నిజం చెప్పేసిన బాలీవుడ్ బ్యూటీ!

‘రైరై రారా’ సాంగ్‌కు థియేటర్లోనే పూనకాలు.. ‘పెద్ది’ లేడీ ఫ్యాన్ మాస్ అరాచకం!

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

Big Stories

×