E-Paper
Advertisement

Tiny Desktop PC: టీవీని కంప్యూటర్‌లా మార్చే.. బుల్లి సీపీయూ.. దీంతో మీ డబ్బంతా ఆదా!

Tiny Desktop PC: టీవీని కంప్యూటర్‌లా మార్చే.. బుల్లి సీపీయూ.. దీంతో మీ డబ్బంతా ఆదా!
Advertisement

Tiny Desktop PC: ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరికి కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే సీపీయూ కలిగిన మానిటర్ కొనుగోలు చేయాలంటే భారీగా ఖర్చు చేయాల్సిందే. ఒక వేళ ల్యాప్ టాప్ తీసుకోవాలని భావించినా.. రూ.30-50 వేల వరకూ ఖర్చు చేస్తే గాని మంచిది రాని పరిస్థితి. అయితే ఇంట్లోని స్మార్ట్ టీవీనే కంప్యూటర్ మార్చుకుంటే ఎలా ఉంటుందన్న అభిప్రాయాలు చాలా మందిలో సహజంగానే ఉంటుంది. అయితే ఇందుకోసం పెద్ద సీపీయూ సెటప్ అవసరం. కానీ అదేమి అవసరం లేకుండానే.. అరచేతిలో పట్టే బుల్లి ‘Tiny Desktop PC’ని ఈ కథనంలో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇది డబ్బును ఆదా చేయడంతో పాటు.. మీ టీవీని కంప్యూర్ లా మార్చేసి వర్క్ చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇంతకీ ఈ బుల్లి సీపీయూ ధర, ప్రధాన ఫీచర్లు, కొనడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మల్టీ టాస్కింగ్ ప్రొసెసర్..

ఈ టినీ డెస్క్‌టాప్ పీసీలు సాధారణంగా డెల్ ఆప్టిప్లెక్స్ మైక్రో (Dell OptiPlex Micro), హెచ్‌పీ ఎలైట్ డెస్క్ టిని (HP EliteDesk Tiny), లెనొవొ థింక్ సెంటర్ టిని (Lenovo ThinkCentre Tiny) సిరీస్‌లలో అందుబాటులో ఉన్నాయి. దీని ప్రొసెసర్ విషయానికి వస్తే.. ఇందులో Intel Core i5 6th Generation అమర్చారు. ఇది ఆఫీస్ పనులు, బ్రౌజింగ్, మల్టీ టాస్కింగ్ పనులు చేసేందుకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది.

ర్యామ్, స్టోరేజ్

Advertisement

టిని డెస్కటాప్ పీసీ.. 8GB DDR4 RAMను కలిగి ఉంది. దీనిని 16GB నుంచి 32GB వరకు పెంచుకోవడానికి టిని వీలు కల్పించింది. మరోవైపు ఇది 512GB SSDతో వచ్చింది. ప్రీవియస్ తరం HDDతో పోలిస్తే SSD వల్ల కంప్యూటర్ చాలా వేగంగా ఆన్ అవ్వడంతో పాటు ఫాస్ట్ గా పని చేస్తుంది.

MS Office, వైఫై కనెక్టివిటీ

ఈ టిని డెస్కటాప్ పీసీ.. ఎంఎస్ ఆఫీస్ ను కలిగిఉంది. కాబట్టి రోజువారు ఆఫీసు వర్క్ ను దీనిలో చాలా సులభంగా చేసుకోవచ్చు. అలాగే వైఫై కనెక్టివిటిని దీనికి అందించారు. ఇంటర్నెట్ కు సమస్యలు రాకుండా పై భాగంలో రెండు డాంగిల్స్ సైతం ఇచ్చారు. కనెక్టింగ్ పోర్ట్స్ విషయానికి వస్తే.. USB 3.0, DisplayPort/HDMI, LAN పోర్ట్ దీనికి ఉన్నాయి.

కొనడం వల్ల ఏంటి లాభం?

Advertisement

టిని డెస్కటాప్ పీసీని కొనడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అరచేతిలో పట్టేంత సైజు ఉండటం వల్ల ఇది చాలా తక్కువ స్థలాన్నే ఆక్యుపై చేస్తుంది. మరోవైపు సాధారణ డెస్క్‌టాప్ పీసీలతో పోలిస్తే ఇవి చాలా తక్కువ కరెంటును వినియోగిస్తాయి. కాబట్టి విద్యుత్ బిల్లు భయం ఉండదు. వీటిలో ఫ్యాన్ శబ్దం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి.. ప్రశాంతంగా మీ వర్క్ ఫినిష్ చేసుకోవచ్చు. ఆఫీసు పనులు, ఆన్ లైన్ క్లాసులు, కోడింగ్ నేర్చుకోవడం, బిల్లింగ్ సాఫ్ట్ వేర్ వాడటం లేదా టీవీకి కనెక్ట్ చేసి హోమ్ థియేటర్ పీసీగా ఉపయోగించుకునేందుకు ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Also Read: New CCTV Rules 2026: నిఘా కెమెరాలపై సరికొత్త రూల్స్.. ఏప్రిల్ 1 నుంచే అమలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

మరి ఎలా కొనొచ్చు?

Tiny Desktop PC.. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు విధానాల్లోనూ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్స్ లో ఇది అందుబాటులో ఉంది. అమెజాన్ రూ16,999 (8 GB RAM | 512GB SSD వేరియంట్) లభిస్తోంది. 252 GB స్టోరేజ్ సామర్థ్యం చాలు అనుకుంటే.. ఇంకా తక్కువకే దీనిని సొంతం చేసుకోవచ్చు. మరోవైపు కొన్ని కంప్యూటర్ సేల్స్ స్టోర్లలోనూ ఈ టిని డెస్కటాప్ పీసీ లభిస్తోంది.

ముఖ్య గమనిక: టిని డెస్కటాప్ పీసీకి సంబంధించిన ఫీచర్లను.. కంపెనీ ఇచ్చిన సమాచారం మేరకే అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఈ డెస్కటాప్ పీసీని కొనుగోలు చేయమని చెప్పడం మా ఉద్దేశం కాదు. మీరు కొనుగోలు చేయాలని భావిస్తే ఫీచర్లు, ధర, వారంటీ వివరాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే మంచిది.

Also Read: Price Hike Alert: ఏప్రిల్ 1 నుంచి.. మెుబైల్, టీవీ, ఏసీ ధరల పెంపు.. ఒక్కోదానిపై అదనంగా పడే భారమెంత?

Related News

ఎయిర్‌టెల్ బిగ్ షాక్.. అన్‌లిమిటెడ్ 5G డేటాపై ఆంక్షలు, హాట్‌స్పాట్ వాడితే అంతే సంగతులు!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

Big Stories

Advertisement
×