E-Paper
Advertisement

Niharika: గుడ్ న్యూస్ చెప్పబోతున్న మెగా డాటర్.. గెస్ చేయమంటున్న నిహారిక?

Niharika: గుడ్ న్యూస్ చెప్పబోతున్న మెగా డాటర్.. గెస్ చేయమంటున్న నిహారిక?
Advertisement

Niharika: నిహారిక కొణిదెల(Niharika Konidela) పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. ఈమె మెగా వారసురాలిగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. నిహారిక నాగబాబు(Nagababu) కుమార్తెగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కెరియర్ మొదట్లో బుల్లితెర యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టిన ఈమె అనంతరం హీరోయిన్గా సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా మెగా కుటుంబం నుంచి వచ్చిన మొట్టమొదటి హీరోయిన్ గా నిహారిక పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. నిహారిక వెండితెరపై ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయారని చెప్పాలి. ఇలా ఈమె నటించిన సినిమాలు సక్సెస్ కానీ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఈమెకు ఘనంగా వివాహం చేశారు. అయితే ఈ వైవాహిక జీవితం కూడా ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని చెప్పాలి.

నిర్మాతగా సక్సెస్…

Advertisement

నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ తన భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక విడాకులు తర్వాత ఈమె పూర్తిస్థాయిలో ఫోకస్ కెరియర్ పైనే పెట్టారని చెప్పాలి. హీరోయిన్ గా సినిమాలలో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. నిహారిక నిర్మాణంలో వచ్చిన మొట్టమొదటి చిత్రం కమిటీ కుర్రాళ్ళు(Kamiti Kurrollu). ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం సంతోష్ శోభన్ తో రెండో సినిమాని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి.

కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న నిహారిక..

Advertisement

ఇలా నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారని నిహారిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ఇందులో భాగంగా నిహారిక అభిమానులకు శుభవార్తని చెప్పారనే తెలుస్తుంది. ఈ వీడియోలో భాగంగా..”నేను మీకు ఈ విషయాన్ని చెప్పకూడదని భావించాను. కానీ చెప్పేస్తున్నాము ఈ సీక్రెట్ ను చాలాకాలంగా మేము దాచి ఉంచామని, ఫైనల్లీ ఇప్పుడు ఇది జరగబోతుంది” అంటూ ఈమె ఒక వీడియోని అభిమానులతో పంచుకున్నారు.

?igsh=MTdodGNwcGF5emtldA%3D%3D

మరి నిహారిక చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏంటా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా అదేంటో గెస్ చేయమని కూడా ఈమె అభిమానులకు చెప్పడంతో ఎంతోమంది వారి ఆలోచనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. అయితే నిహారిక మాత్రం త్వరలోనే బిజినెస్(Business) రంగంలోకి అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. తన బెస్ట్ ఫ్రెండ్ అయినా భార్గవి(Bhargavi) తో కలిసి ఈమె బిజినెస్ రంగంలోకి రాబోతున్నారని సమాచారం. అయితే వీరిద్దరూ కలిసి కేఫ్ ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి నిహారిక ఆ శుభవార్త గురించి ఎప్పుడు అధికారకంగా తెలియజేస్తారో తెలియాల్సి ఉంది. నిర్మాతగా సక్సెస్ అయిన నిహారిక వ్యాపార రంగంలో కూడా సక్సెస్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: Siva karthikeyan: సీక్వెల్స్ అంటే భయపడుతున్న హీరో…ఆ సీక్వెల్ మాత్రం చేస్తానంటూ !

Related News

కన్నీటి పర్యంతమవుతున్న మహారాజా హీరోయిన్.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

Big Stories

Advertisement
×