Siva karthikeyan: ఇటీవల కాలంలో ఒక సినిమా మంచి సక్సెస్ అందుకు ఉంది అంటే తప్పనిసరిగా ఆ సినిమాకు సీక్వెల్ సినిమాని(Sequel Movies) నిర్మాతలు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాలు సీక్వెల్ షూటింగ్ పనులను జరుపుకుంటూ ఉన్నాయి. అయితే గతంలో కూడా సక్సెస్ అందుకున్న సినిమాలకు ఇప్పుడు నిర్మాతలు సీక్వెల్స్ ప్రకటిస్తున్నారు. ఇలా ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాలో ట్రెండ్ నడుస్తోంది. ఇక హీరోలు కూడా ఇలాంటి సినిమాలలో నటించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే శివ కార్తికేయన్(Siva Karthikeyan) మాత్రం తనకు సీక్వెల్ సినిమాలలో నటించాలి అంటే భయం వేస్తుందని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీక్వెల్స్ అంటే చాలా భయం..
శివ కార్తికేయన్ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ హీరోగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఈయన నటించిన అమరన్ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభించింది. తెలుగు తమిళ సినిమాలలో నటిస్తున్న శివ కార్తికేయన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సీక్వెల్ సినిమాల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.”నాకు సీక్వెల్ సినిమాలలో నటించడం అంటే చాలా భయం అని తెలిపారు. మొదటి సినిమా ద్వారా వచ్చిన విజయాన్ని సీక్వెల్ ఎక్కడ పాడు చేస్తుందనే భయం తనని వెంటాడుతుందని శివ కార్తికేయన్ తెలిపారు. అందుకే నాకు సీక్వెల్స్ అంటే పెద్దగా ఆసక్తి లేదని తెలిపారు.
మహావీరన్ సీక్వెల్ చేయాలని ఉంది..
ఇకపోతే మహావీరన్ (Mahaveeran)సినిమాకు మాత్రం సీక్వెల్ చేయాలని ఉంది అంటూ ఈయన చెప్పుకు వచ్చారు. ఈ సినిమా సీక్వెల్ పై ఆసక్తి రావడానికి కారణం లేకపోలేదు ఈ సినిమా ఒక యూనిక్ సినిమా అని, అందుకే ఈ సినిమా సీక్వెల్ చేయాలని ఆసక్తి మాత్రం ఉందని వెల్లడించారు. ఇలా సీక్వెల్ సినిమాల పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేయడంతో శివ కార్తికేయన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తమిళంలో మహావీరన్ పేరుతో విడుదలైన ఈ సినిమా తెలుగులో మహావీరుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి హీరోగా…
లవ్, యాక్షన్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసనం ఆదితి శంకర్(Aditi Shankar) హీరోయిన్ గా నటించారు. అతి త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రాబోతోంది. ఈ సినిమాకు మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించారు. మరి శివ కార్తికేయన్ కోరుకున్న విధంగా ఈ సినిమా సీక్వెల్ లో నటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. శివ కార్తికేయన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ ఈయన చెప్పింది కూడా నిజమేనని తెలియజేస్తున్నారు. మొదటి సినిమా మంచి సక్సెస్ అయ్యి సీక్వెల్ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. శివ కార్తికేయన్ సినీ కెరియర్ విషయానికి వస్తే మిమిక్రీ ఆర్టిస్ట్ గా మొదలైన ఇతని ప్రయాణం బుల్లితెర యాంకర్ గా హీరోగా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.
Also Read: Chitti Babu: సమ్మెకు దిగిన కార్మికులు.. నిర్మాతలదే తప్పు… నిర్మాత చిట్టి బాబు విశ్లేషణ!