20 Peacocks Found Dead: కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా హనుమంతపుర గ్రామంలో ఒకే రోజు 20కి పైగా నెమలులు మృత్యువాత పడిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పచ్చని పంట పొలాల్లో, చిన్న వాగు తీరాన చనిపోయి పడుకున్న నెమలుల దృశ్యం స్థానికులను, వన్యప్రాణి ప్రేమికులను కలచివేసింది. దేశ జాతీయ పక్షిగా పేరుగాంచిన నెమలులు ఇలా గుంపులుగా మృతి చెందడం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ మరణాల వెనుక ఉన్నదేంటని విచారణ మొదలవుతుంది అంటే… అట్టడుగు నుంచి బయటపడిన మరొక చీకటి నిజం చుట్టుపక్కల ప్రాంతాల వారిని వణుకు పుట్టిస్తోంది.
మరోసారి వార్తల్లో ధర్మస్థలి పేరు..
ఈ నెమలుల మరణానికి ధర్మస్థల బలి కార్యక్రమాలకు సంబంధముందన్న అనుమానం బలపడుతోంది. నెత్రావతి నదీ తీరాన ఉన్న ప్రసిద్ధ ధర్మస్థల ఆలయం పేరు ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఈ ఆలయ పరిధిలో గత 20 సంవత్సరాలుగా మానవతను త్రోసిపెట్టే ఘటనలు జరుగుతున్నాయని ఓ మాజీ సానిటేషన్ కార్మికుడు సంచలన ఆరోపణలు చేశాడు. ఆలయ పనుల్లో భాగంగా ఉన్నప్పుడు అతనిపై శవాలను పాతిపెట్టమన్న ఆదేశాలు వచ్చాయని, కొన్ని మృతదేహాలను కాల్చమన్న ఆదేశాలు కూడా వచ్చాయని, అది కూడా పెద్ద వ్యక్తుల నుంచే వచ్చాయని చెప్పిన అతని వాక్యాలు ఇప్పుడు జనాభిప్రాయాన్ని బెంబేలెత్తిస్తున్నాయి.
వీటిలో అత్యాచారాలు, హత్యలు జరిగి మృతదేహాలను మట్టిలో కలిపేస్తున్నారని, కొన్నింటిని రాత్రివేళ కాల్చేసేవారంటూ, అతను చెప్పిన విషయాల్లో మైనర్ బాలికల పేర్లు కూడా రావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఒక ఆలయ పరిసరాల్లో ఇలాంటి అసాంఘిక ఘటనలు జరిగే అవకాశం ఉందా? అని ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆలయ పేరిట జరుగుతున్న ఆచారాలు మూఢనమ్మకాలకు హద్దులు దాటి మూసుపోసిన నరకాలను తవ్వుతున్నాయని తేలుతోంది.
ఈ తరహా ఆరోపణలు వెలుగులోకి వస్తుండగానే నెమలుల మృతదేహాలు గ్రామం వదిలి, చర్చను ధర్మస్థల వైపు మళ్లించాయి. ప్రజలలో అనేక సందేహాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.. నిజంగా నెమలులను ధర్మస్థలి కోసం బలి ఇచ్చారా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే అనుమానం వ్యక్తం మవుతున్నాయి.
భయాందోళనలో ప్రజలు
ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు జరగలేదని, ఏకంగా 20 నెమలులు మృతి చెందడం పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇది కావాలనే ఎవరో చేసిన చర్యగా గ్రామస్తులు చెబుతున్నారు. అటవీశాఖ దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాల వన్యప్రాణులు బలి గొన్నారు. రేపు ధర్మస్థలిలో జరిగిన విధంగానే మనిషి ప్రాణాలు తీసి మట్టిలో కప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తారని భయందోళన చెందుతున్నారు. మరి వీటిపై అధికారులు వద్ద నుంచి ఎలాంటి స్పందన లేదు. నెమలులు చనిపోవడంపై రిపోర్ట్ వచ్చేంత వరకు ప్రజలు భయపడాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు.