Sonu Sood Visit Fish Venkat Family: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా కిడ్ని సంబంధిత సమస్యలతో బాధపుడుతున్న ఆయన చికిత్స పొందుతూ గతనెల తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి టాలీవుడ్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అయితే ఆయన చికిత్స కోసం ఎంతోమందిని ఆర్థిక సాయం చేయాలని వెడుకున్నారు. కానీ, ఇండస్ట్రీలోని కొందరు తప్పిదే.. ఎవరూ స్పందించలేదని ఆయన భార్య తెలిపింది. ఆయన మరణాంతరం ఆర్థిక సాయం కోసం వేచి చూస్తోంది. అయితే ఇప్పటికే టాలీవుడ్ నుంచి ఆమెకు పెద్దగా మద్దతు రావడం లేదని తెలుస్తోంది.
లక్షన్న రూపాయల సాయం
వారి ధీనస్థితిని తెసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు, రియల్ హీరో ఫిష్ వెంకట్ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు. తన వంతుగా లక్షన్న రూపాయల సాయం అందజేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని బ్యాంక్ ద్వారా ఫిష్ కుటుంబానికి అందేల చేసిన ఆయన ఇప్పుడు స్వయంగా ఆయన కుటుంబానికి కలిసి పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ వచ్చిన ఆయన కుకట్పల్లి అడ్డగుట్టలోని ఫిష్ వెంకట్ కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.
ఫిష్ వెంకట్ కుటుంబానికి పరామర్శ
ఆ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడి ధైర్యాన్ని ఇచ్చారు. తమ కుటుంబానికి ఎప్పుడు తాను అండగ ఉంటానని, ఏ అవసరం వచ్చిన వెంటనే తనని అడగాలని వారికి భరోసా ఇచ్చారు. ఇక ఫిష్ వెంకట్ విషయానికి వస్తే.. తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా విలన్ రోల్స్ తో మంచి గుర్తింపు పొందారు. దాదాపు 100పైగా సినిమాల్లో నటించిన ఫిష్ వెంకట్ జూ. ఎన్టీఆర్ అదుర్స్తో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఖైది నంబర్ 150, శివం వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.మరోవైపు కమెడియన్ కూడా మెప్పించారు.
Also Read: Sang Yong-Kyun: డ్రంగ్ డ్రైవ్ వివాదంతో విమర్శలు.. కారులో శవమై కనిపించిన నటుడు.. చంపేశారా?
కాగా సినిమాల్లో సహానటుడు, విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన కరోనా టైంలో ఎంతోమంది నిరాశ్రయులకు, పేదలకు అండగా నిలిచి తన ఉదారత చాటుకున్నారు. లౌక్డౌన్ కాలంలో తన పేరుపై ఛారిటీ పెట్టి పేద ప్రజలకు ఆర్థిక సాయం చేశారు. కరోనా వల్ల కొన ఊపిరితో ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందించారు. ఆక్సిజన్ లేని వారి ఆక్సిజన్ సప్లై చేశారు. ఇక పేద విద్యార్థులకు అన్నివిదాలు అండగా ఉన్నారు. కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సొంతం ప్లైయిట్స్ ఏర్పాటు చేసి భారత్కు రప్పించారు. ఇలా కరోనా సమయంలో నిరంతరం పేదవారికి,నిరాశ్రయులకు సేవలు అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. అప్పటి నుంచి సోను సూద్ సామాన్య ప్రజలకే కాదు ఇండస్ట్రీలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న నటీనటులకు ఆయన అండగా నిలుస్తున్నారు.
ఇటీవల మరణించిన సినీ నటుడు ఫిష్ వెంకట్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించిన నటుడు సోనూ సూద్…#SonuSood #FishVenkat pic.twitter.com/sYbsbmzbdb
— AppalaNaiduKellaiTdp (@AppalaNaiduKe12) August 4, 2025